ఎండోమెంట్‌ పాలసీ అంటే ఏమిటి? దాని ప్రయోజనాలేమి..?

Endowment Policy
ఎండోమెంట్‌ పాలసీకి ఉన్న ప్రత్యేక లక్షణం ఏమిటంటే మన డబ్బు పొదుపుతో పాటు మనకు ఏమైనా ఆపదలు వచ్చినప్పుడు వాటికి రక్షణగా నిలుస్తాయి. ఈ ఎండోమెంట్‌ పాలసీలు మన దగ్గర ఉన్న ధనాన్ని పెంచుకోవడంతో పాటు.. భవిష్యత్తులో ఏదైనా అపాయం నుండి మనల్ని రక్షించడం కోసం ఏర్పడ్డాయి. ఈ బీమా పాలసీలు వార్షిక, అర్ధ వార్షిక మరియు త్రైమాసికంగా ప్రీమియం చెల్లించే విధాన పద్ధతిలో ఉంటాయి. ప్రీమియం చెల్లించడంలో మనం జాగ్రత్తగా ఉండాలి. బీమా కంపెనీలు, ప్రీమియం చెల్లింపు కాలపరిమితి దాటిపోయాక కూడ కొంత సమయం కేటాయిస్తాయి. మీరు గనుక ఈ గ్రేస్ పీరియడ్ సమయం లోపల ప్రీమియం చెల్లించక పోయినట్లైతే పాలసీ రద్దు అవుతుంది.

ఎండోమెంట్ పాలసీలు:

ఎండోమెంట్ పాలసీలు ఒక నిర్దిష్ట కాలానికి బీమా చేసుకోవచ్చు. బీమా చేయించుకున్న వారు మరణించినప్పుడు (పాలసీ టర్మ్ కాలంలో) హామీ ఇచ్చిన మొత్తాన్ని మరియు బోనస్‌ వంటిది ఉంటే దాన్ని కూడా నామినీ అందుకుంటాడు. పాలసీ అమలులో ఉన్న సంవత్సరాల వరకు బోనస్ చెల్లించబడుతుంది. పాలసీ కాలం పూర్తయ్యే వరకు జీవించి ఉన్నట్లయితే, అంటే మెచూరిటీ తరువాత హామీ ఇచ్చిన మొత్తాన్ని పాలసీకి సంబంధించిన బోనస్ లాంటిది ఉంటే దాన్ని కూడా బీమా చేయించుకున్న వారు అందుకుంటారు. ఆ తర్వాత, బీమా చేయించుకున్నవారు పాలసీ ద్వారా రక్షణ పొందలేరు.

సంపూర్ణ జీవిత పాలసీలతో పోలిస్తే ఎండోమెంట్ పాలసీలు సాధారణంగా ఎక్కువ వ్యయంతో కూడి ఉంటాయి. ఎండోమెంట్ పాలసీలు రెండు రకాలుగా వర్గీకరించబడ్డాయి.

1. ఎండోమెంట్ - లాభం లేనటువంటివి.
2. ఎండోమెంట్ - లాభంతో కూడినవి.

ఎండోమెంట్ - లాభం లేనటువంటివి: బీమా తీసుకున్న వ్యక్తి మరణించినప్పుడు, నామినీకి హామీ ఇచ్చిన మొత్తాన్ని మాత్రమే అందిస్తాయి. పాలసీ టర్మ్ ఉంటున్నప్పుడు లేదా మెచూరిటీ అయినప్పుడు, బీమా తీసుకున్న వ్యక్తి హామీ ఇవ్వబడిన మొత్తాన్ని అందుకుంటారు లేదా హామీ ఇవ్వడిన మొత్తంలో కొంతభాగాన్ని లేదా ప్రీమియం యొక్క రీఫండ్ మాత్రమే అందుకుంటాడు.

ఎండోమెంట్ - లాభంతో కూడినవి: బీమా తీసుకున్న వ్యక్తి మరణించినప్పుడు లేదా పాలసీ టర్మ్ ముగిసినప్పుడు, హామీ ఇవ్వబడిన మొత్తానికి అదనంగా బోనస్‌ని (దీనికి గ్యారంటీ ఉంది) అందిస్తుంది. లాభంలేని పాలసీలు కంటే ఎక్కువ ఖర్చుతో కూడి ఉంటాయి.

ఎస్‌బిఐ లైఫ్ ఎండోమెంట్ పాలసీ 'శుభ్ నివేశ్':

ప్రైవేట్ రంగ భీమా కంపెనీ అయిన ఎస్‌బిఐ లైఫ్ 'శుభ్ నివేశ్' అనే పేరుతో కొత్త ఎండోమెంట్ పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పాలసీ రెండు రకాలుగా లభిస్తుందని, పాలసీ కాల పరిమితి తీరిన తర్వాత జీవితాంతం బీమా రక్షణ కల్పించడం వల్ల ఇది అందరిని బాగా ఆకర్షిస్తుందని ఎస్‌బిఐ తెలిపింది. జీవితం మొత్తానికి ఎండోమెంట్ ఆప్షన్ ఎంచుకుంటే పాలసీ కాల పరిమితి తీరిన తర్వాత గరిష్టంగా 100 సంవత్సరాల వరకు బీమా రక్షణ ఉంటుంది. అదే మీరు మెచ్యూర్టీ ఆప్షన్‌ని ఎంచుకుంటే, కాల పరిమితి తీరిన తర్వాత మొత్తం మెచ్యూర్టీ సొమ్ముని ఒకేసారిగా లేదా సులభ వాయిదాల్లో ప్రతీ 5/10/15/20 సంవత్సరాలకు అందుకోవచ్చు.

ఈ పాలసీని 18 ఏళ్లు నిండిన వారి దగ్గర నుంచి గరిష్టంగా 60 ఏళ్ల వారిదాకా తీసుకోవచ్చు. పాలసీ కనీస కాలపరిమితి 5 ఏళ్లు, గరిష్ట కాలపరిమితి 30 ఏళ్లుగా నిర్ణయించారు. కనీస బీమా మొత్తం రూ.75,000. ఈ పాలసీ సింగిల్ లేదా రెగ్యులర్ ప్రీమియం ఆప్షన్స్‌లో లభిస్తోంది. ప్రధాన పాలసీకి అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా ప్రిఫర్డ్ టర్మ్, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్, యాక్సిడెంటల్ టోటల్, పర్మనెంట్ డిసబిల్టీ బెనిఫిట్ రైడర్లను తీసుకోవచ్చు. చెల్లించే ప్రీమియంపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం పన్ను మినహాయింపులు లభిస్తాయి.

వన్ఇండియా తెలుగు మనీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+