
బ్రోకర్ ద్వారా ఆన్‌లైన్‌లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి:
కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్‌లో ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే వారికి ఈ పద్దతి చాలా అనువైనది. ఉదహారణకు షేర్ ఖాన్ అనే సంస్ద ఆన్ లైన్‌లో మ్యూచువల్ ఫండ్స్‌ని అందిస్తుంది. మీ దగ్గర తగిన ఆదాయం ఉండి ఆన్ లైన్‌లో మ్యూచవల్ ఫండ్స్‌ని కొనుగోలు చేయాలంటే ఈ క్రింది విధానాలు పాటించండి.
* ట్రేడ్ పెట్టుబడి క్లిక్ చేయండి
* మ్యూచువల్ ఫండ్ ఎంచుకోండి
* కొనుగోలుపై క్లిక్ చేయండి
* అందించిన జాబితా నుండి మ్యూచువల్ ఫండ్ ఎంచుకోండి
* క్లిక్ చేయండి.. మీరు ఆస్తి నిర్వహణ సంస్థ యొక్క వివిధ నిధులు చూస్తారు
ఇండిపెండెంట్ వెబ్‌సైట్స్:
మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్‌ని కొనుగోలు చేసేందుకు మార్కెట్‌లో చాలా ఇండిపెండెంట్ వెబ్‌సైట్స్ వాటిని అందిస్తున్నాయి.
మ్యూచువల్ ఫండ్స్ వెబ్‌సైట్స్:
మ్యూచువల్ ఫండ్స్ వెబ్ సైట్స్ ద్వారా కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు పెట్టుబడి పెట్టవచ్చు. ఇందు కోసం గాను ఐదు లేదా ఆరు వెబ్ సైట్స్‌లలో రిజిస్టర్ అయి.. మనకు నచ్చిన మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్‌ని ఎంచుకోవచ్చు. ఈ విధంగా పలు రకాలైన వెబ్ సైట్స్‌ల్లో రిజిస్టర్ అవడం వల్ల ఎక్కువ మ్యూచవల్ ఫండ్స్ స్కీమ్స్‌ని ఎంచుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ఈ ఖచ్చితమైనది అయినప్పటికీ.. ఎక్కువ సమయం పట్టవచ్చు.
ఆన్‌లైన్ మ్యూచువల్ ఫండ్ నుండి ఈ క్రింది లావాదేవీలకు అవకాశం ఉంది:
సబ్ స్క్రయిబ్ లేదా కొనుగోలు
ఎన్ఎఫ్ఓ పెట్టుబడి
అదనపు కొనుగోలు
మరల తీసుకొను
స్విచ్
ఆన్‌లైన్‌లో మ్యూచవల్ ఫండ్స్‌పై పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకటి రెండు సార్లు మ్యూచవల్ ఫండ్స్ స్కీమ్ రికార్డుని సరిచూసుకోవాల్సి ఉంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎవరికి కావాల్సిన విధంగా వారు స్కీములను ఎన్నుకోవచ్చు. కొంతమంది నెలా నెలా స్థిర ఆదాయం ఇచ్చే ఇన్‌కమ్ ఫండ్స్‌ని ఎన్నుకుంటే, మరి కొందరు మొత్తం షేర్లలోనే పెట్టే ఎంక్వైరీ ఫండ్స్‌ని ఎన్నుకొంటారు. ఇలా ఎన్నో అవకాశాలు మ్యూచువల్ ఫండ్స్‌లో వుంటాయి. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కాక యూనిట్లను మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకునే అవకాశం వుంటుంది.
మ్యూచువల్ ఫండ్స్ వివిధ రకాలు:
ఓపెన్ ఎండెడ్ ఫండ్స్
క్లోజ్ ఎండెడ్ ఫండ్స్
ఈక్విటీ ఫండ్స్ డెట్ ఫండ్స్
బ్యాలెన్స్‌డ్ ఫండ్స్
వన్ఇండియా తెలుగు మనీ


Click it and Unblock the Notifications