లోడ్ లేదా నో లోడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

లోడ్ ఫండ్: మ్యూచువల్ ఫండ్స్ పథకంలో చేరడానికి లేదా ఆ పథకం నుండి బయటకు వచ్చేయడానికి కొంత డబ్బుని వసూలు చేసే విధానాన్ని లోడ్ ఫండ్ అంటారు. ఈ లోడ్ ఫండ్స్‌లో వాటా కొనుగోలుకు లేదా అమ్మకం చేసే ప్రతి దానికి కొంత చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మన వద్ద నుండి వసూలు చేసిన చార్జీలను మ్యూచువల్ ఫండ్స్ మార్కెటింగ్ ఖర్చులుగా ఉపయోగిస్తారు.
ఉదా: ఒక వాటా ఎన్ఎవి పదిరూపాయలుకాగా ఈ పథకంలో చేరేందుకు లేదా పథకం నుండి బయటకు వచ్చేందుకు లోడ్ చార్జీలుగా 1 శాతం వసూలు చేస్తారు. అప్పుడు వాటా కొనుగోలు చేసే మదుపరులు 10 రూపాయలకు 10 పైసలను లోడ్ చార్జీగాచెల్లించాలి. మ్యూచువల్ ఫండ్స్‌కు తమ వాటాను తిరిగి కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించే మదుపరులు 9 రూపాయలకు 90 పైసలు ప్రతీ ఒక్క యూనిట్‌కు పొందుతారు. కాబట్టి మదుపరులు మదుపు చేసే సమయంలో ఈ లోడ్ చార్జీలను పరిగణనలోనికి తీసుకుని తమకు వచ్చే లాభాలు / ఆదాయం పై వీటి ప్రభావం ఉంటుంది.
నో లోడ్ ఫండ్: మ్యూచువల్ ఫండ్స్ లోని స్కీమ్‌ల నుండి బయటకు రావడానికి లేదా స్కీమ్‌లో చేరేందుకు ఎటువంటి చార్జీలు వసూలు చేయక పోతే వాటిని నో లోడ్ ఫండ్ అని అంటారు. అంటే ఈ ఫండ్ లోని పథకాల్లో చేరడానికి మదుపరులు ఎన్ఎవి ధర మీద చేరవచ్చు. మదుపరులు కొనుగోలు లేదా అమ్మకం చేసే వాటాలపై ఎటువంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన పని లేదు.
వన్ఇండియా తెలుగు మనీ


Click it and Unblock the Notifications