డిమ్యాట్ ఎకౌంట్ అంటే ఏమిటీ..? దానిని ఓపెన్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే తప్పనిసరిగా డిమ్యాట్ ఎకౌంట్ అవసరం. షేర్లు మరియు సెక్యూరిటీస్ (డెబించర్స్, బాండ్స్) మొదలగున వాటిని విక్రయించడానికి డిమ్యాట్ ఎకౌంట్ తప్పనిసరి. డిమ్యాట్ ఎకౌంట్ ఓపెన్ చేసేందుకు వినియోగదారులు ఎటువంటి స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏమిటంటే డిమ్యాట్ ఎకౌంట్‌లో మీ సెక్యూరిటీస్ జీరోగా కూడా కలిగి ఉండవచ్చు.
సాధారణంగా స్టాక్ మార్కెట్లలో షేర్లు, సెక్యూరిటీస్ ఒక ఎకౌంట్ నుండి ఇంకొక ఎకౌంట్‌కి బదిలీ చేయడం తాత్కాలికం. మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్ని ఉంటే డిమ్యాట్ ఎకౌంట్ ఓపెన్ చెయ్యడం ఇప్పుడు చాలా సులభం. డిమ్యాట్ ఎకౌంట్ ఓపెన్ చెయ్యడం ఎలాగో చూద్దాం.మీరు ఎందుకు డిమ్యాట్ ఎకౌంట్‌ను కలిగి ఉండాలి..?
సెబి మార్గదర్శకాల ప్రకారం - డిమెటరియలైజ్డ్ రూపంలో తప్ప ఏ రూపంలో విక్రయించకూడదు. అందువల్ల మీరు స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా వాటాల క్రయవిక్రయాలు జరపాలనుకుంటే మీరు తప్పనిసరిగా ఒక డిమ్యాట్ ఎకౌంట్‌ను కలిగి ఉండాలి.
డిమ్యాట్ ఎకౌంట్ ఎలా పని చేస్తుంది: మీరు వాటాలను కొనుగోలు చేసినప్పుడు, బ్రోకర్ మీ వాటాల హోల్డింగ్స్ ఈ డిమ్యాట్ ఎకౌంట్ క్రెడిట్లు ప్రకటనలో ప్రతిఫలిస్తాయి. మీరు ఇంటర్నెట్ ఫ్లాట్ ఫామ్ ఆధారంగా ట్రేడింగ్‌ను నిర్వహిస్తున్నారు కాబట్టి ఆన్ లైన్‌లో మీ హోల్టింగ్స్‌ను చూడొచ్చు. మీరు ఎప్పుడైనా వాటాలను అమ్మదలిస్తే, వివిధ స్టాక్ వివరాలు నింపి డెలివరీ సూచనల నోటుని మీ బ్రోకర్‌కు ఇవ్వాలి. మీ ఖాతా వాటాలను డెబిట్ చేసిన తర్వాత అప్పుడు మీరు అమ్మిన వాటాలకు డబ్బు చెల్లిస్తారు. అదే మీరు ఆన్ లైన్‌లో ఇంటర్నెట్ ద్వారా ట్రేడింగ్ నిర్వహిస్తుంటే వాటంతటవే షేర్స్ డెబిట్ అయి, మీ ఖాతాల్లో డబ్బు క్రెడిట్ అవుతుంది.
డిమ్యాట్ ఎకౌంట్ ఓపెన్ చెయ్యడం వల్ల ఉపయోగాలు:
భౌతిక రూపాలలో వాటాలను ఉంచాల్సిన అవసరం లేదు
వాటాలలో ఒక వాటా క్రయవిక్రయాలు జరపవచ్చు
బదిలీ సంఖ్యపై స్టాంపు డ్యూటీ లేదు బదిలీ దస్తావేజు అవసరం లేదు.

మొదటగా నగదు నిల్వల భాగస్వాములను సందర్శించండి
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ లేదా సెంట్రల్ డిపాజిటరీ ద్వారా జాబితాలో రిజిస్టరైన నగదు నిల్వల భాగస్వాములను సందర్శించండి. బ్రోకింగ్ సంస్థలు మరియు బ్యాంకులు చాలా సౌకర్యాలు డిమ్యాట్ ఖాతా తెరవడానికి అందిస్తున్నాయి. భారతదేశంలో మొత్తం రెండు డిపాజిటరీస్ ఉన్నాయి. అవి ఒకటి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్ (NSDL), రెండవది సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (CDSL).

కావాల్సిన డాక్యుమెంట్స్
డాక్యుమెంట్స్‌గా ఐడెంటిటీ కార్డు, పుట్టినరోజు ధృవపత్రం, నివాస స్దల పత్రం, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఎలక్షన్ కార్డు మొదలగునవి.

అగ్రిమెంట్
డిమ్యాట్ ఎకౌంట్ ఓపెన్ చేసే ముందు నగదు నిల్వల భాగస్వామికి, ఇన్వెస్టర్‌కి మధ్య ఒప్పంద జరుగుతుంది.

పాన్ కార్డు తప్పనిసరి
సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) నిబంధనల ప్రకారం డిమ్యాట్ ఎకౌంట్ ఓపెన్ చేసేందుకు పాన్ కార్డు తప్పనిసరి.

బివో ఐడి (BO ID)
డిమ్యాట్ ఎకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు బివో ఐడి (ప్రయోజనకరమైన యజమాని గుర్తింపు) నెంబర్‌ను పొందుతారు. ఈ నెంబర్‌ని ఉపయోగించి షేర్లు, సెక్యూరిటీస్ మొదలగున వాటిని మీరు బదలాయించుకోవచ్చు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications