For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీఎస్‌టీ వ‌ల్ల సామాన్యుడికి క‌లిగే 7 ప్ర‌యోజ‌నాలు

ఏక‌రీతి ప‌న్ను వ్య‌వ‌స్థ ఏర్ప‌డ‌నుంది. వివిధ ర‌కాల ప‌న్నుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న స‌గ‌టు జీవికి చాలా ప‌న్నుల స్థానంలో జీఎస్‌టీ వ‌చ్చి స్వాంత‌న చేకూర్చ‌నుంది. వ‌స్తువు ఉత్ప‌త్తి నుంచి వినియోగదారుడికి చేర

|

జీఎస్‌టీ బిల్లు సాకార‌మ‌య్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌మావేశాల్లో బిల్లుకు ఆమోదం ల‌భించేందుకు అవ‌కాశాలు ఎక్కువ ఉన్నాయి. దీంతో ఏక‌రీతి ప‌న్ను వ్య‌వ‌స్థ ఏర్ప‌డ‌నుంది. వివిధ ర‌కాల ప‌న్నుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న స‌గ‌టు జీవికి చాలా ప‌న్నుల స్థానంలో జీఎస్‌టీ వ‌చ్చి స్వాంత‌న చేకూర్చ‌నుంది. వ‌స్తువు ఉత్ప‌త్తి నుంచి వినియోగదారుడికి చేరే క్ర‌మంలో వివిధ ప‌న్నుల స్థానే జీఎస్‌టీ ఒక‌టే ఉండే అవ‌కాశం ఉంది.

జీఎస్‌టీ బిల్లు ప‌లు ముఖ్యాంశాలుజీఎస్‌టీ బిల్లు ప‌లు ముఖ్యాంశాలు

జీఎస్‌టీ మ‌న‌కు ఎందుకు అవ‌స‌ర‌మంటే?జీఎస్‌టీ మ‌న‌కు ఎందుకు అవ‌స‌ర‌మంటే?

ధ‌ర‌లు త‌గ్గొచ్చు

ధ‌ర‌లు త‌గ్గొచ్చు

పెద్ద ఎఫ్ఎమ్‌సీజీ కంపెనీలైన హెచ్‌యూఎల్‌; గోద్రెజ్ వంటి వాటికి వేర్ హౌసింగ్‌; లాజిస్టిక్స్ ఖ‌ర్చులు కాస్త త‌గ్గే వీలుంది. వారు ఆ ప్ర‌యోజ‌నాల‌ను వినియోగ‌దారుల‌కు బ‌దిలీ చేస్తే స‌బ్బులు, పేస్ట్ వంటి నిత్యం వాడే కొన్ని వ‌స్తువుల ధ‌ర‌లు కొంచెం త‌గ్గ‌వ‌చ్చు.

 చిన్న కార్ల ధ‌ర‌లు

చిన్న కార్ల ధ‌ర‌లు

ప‌న్ను శాతం 24 నుంచి 18కి త‌గ్గే అవ‌కాశాలున్నందున కార్ల‌పై ప‌న్నులు త‌గ్గేందుకు వీలుంది. దీంతో చిన్న కార్ల ధ‌ర‌లు కాస్త త‌క్కువ‌య్యే అవ‌కాశం ఉంది. అయితే ఉత్ప‌త్తిదారులు అంతిమ వినియోగ‌దారునికి ప్ర‌యోజ‌నాలు బ‌ద‌లాయించాల‌నుకుంటే త‌ప్ప ఇది నిజ‌మ‌య్యే వీల్లేదు. అలా జ‌ర‌క్క‌పోతే ధ‌ర‌లు త‌గ్గ‌కపోవ‌చ్చు.

 సినిమా టిక్కెట్లు

సినిమా టిక్కెట్లు

వినోద ప‌న్ను చాలా ఎక్కువ‌గా ఉన్నందునే మ‌ల్టీప్లెక్స్‌లు సినిమా టిక్కెట్ల‌ను ఎక్కువ ధ‌ర‌ల‌కు అమ్ముతున్నాయి. జీఎస్‌టీని 18 శాతంగా నిర్ణ‌యిస్తే, ఈ వినోద ప‌న్ను చాలా త‌క్కువ ఉన్న‌ట్లే అవుతుంది. దీంతో థియేట‌ర్ల యాజ‌మాన్యాలు సైతం టిక్కెట్ల‌ను త‌గ్గించ‌వ‌చ్చు.

పెయింట్ ఉత్ప‌త్తులు

పెయింట్ ఉత్ప‌త్తులు

అవ్య‌వ‌స్థీకృత రంగం నుంచి వ్య‌వ‌స్థీకృత రంగంలో ఉన్న పెయింటింగ్ ప‌రిశ్ర‌మ విప‌రీత‌మైన పోటీని ఎదుర్కొంటోంది. భ‌విష్య‌త్తులో అన్నీ ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్నందున‌, పెద్ద కంపెనీలు ధ‌ర‌లు త‌గ్గించేందుకు అవ‌కాశాలు లేక‌పోలేదు.

చాలా ఇత‌ర ఉత్ప‌త్తులు

చాలా ఇత‌ర ఉత్ప‌త్తులు

చాలా ఇత‌ర రంగాల్లో ఉత్ప‌త్తుల‌న్నీ ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్తే వ్య‌వ‌స్థీకృత రంగ విస్తృత పెరిగే వీలుంది. దీంతో

ఎల‌క్ట్రిక‌ల్ వైర్లు, టింబ‌ర్ వంటి ఉత్ప‌త్తులు కంపెనీలు త‌క్కువ ధ‌ర‌ల‌కు అమ్మేందుకు వీలు క‌లుగుతుంది. ఇది ఎక్కువ‌గా పెద్ద కంపెనీల‌కు ధ‌ర‌లు త‌గ్గించే అవ‌కాశాల‌ను క‌ల్పించ‌వ‌చ్చు

ఉద్యోగ అవ‌కాశాల సృష్టి

ఉద్యోగ అవ‌కాశాల సృష్టి

జీఎస్‌టీ అమ‌ల‌యిన ఒక‌టి, రెండేళ్ల‌లో జీడీపీ 2 శాతం పెరిగేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. దీంతో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ అయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

త‌క్కువ అవినీతి

త‌క్కువ అవినీతి

మిగ‌తా ప‌న్నుల స్థానంలో ఏక‌రీతి ప‌న్నుగా జీఎస్‌టీ వ‌స్తుంది. దీంతో వ్య‌వ‌స్థ‌లో అవినీతికి త‌క్కువ ఆస్కారం ఉంటుంది. ఇది సామాన్యుడికి చాలా ఊర‌టే అని చెప్పాలి.

Read more about: gst జీఎస్‌టీ
English summary

జీఎస్‌టీ వ‌ల్ల సామాన్యుడికి క‌లిగే 7 ప్ర‌యోజ‌నాలు | 7 Ways The Common Man Will Benefit From GST

The GST looks increasingly like becoming a reality and may be cleared in the Rajya Sabha's monsoon session of parliament. It will make way for a single tax, doing away with the several taxes that are applicable today from the time a product is manufactured until it is sold.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X