జూలై నెలకు సంబంధించి స్థూల వస్తువులు, సేవల పన్ను వసూళ్ల వివరాలు వచ్చాయి. జూలైలో భారతదేశ స్థూల వస్తువులు, సేవల పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో సారి రూ.2 లక్షల కోట్లను దాటాయి. జూలైలో జీఎస్టీ వసుళ్లు 15.4 శాతం పెరిగి రూ.2.11 లక్షల కోట్లకు చేరాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో వసూలైన రూ.2.43 లక్షల కోట్లు, 2025 ఏప్రిల్‌లో వసూలైన రూ.2.37 లక్షల కోట్లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. శనివారం విడుదల చేసిన ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం భారతదేశ ఆర్థిక పరిస్థితి, స్థిరమైన దేశీయ వినియోగం, సమర్థవంతమైన నిర్ణయాలతో గత జూలైలో రూ.1,83,065 కోట్లుగా ఉన్న వసూళ్లు ఈ జూలైలో రూ.2,11,205 కోట్లకు చేరాయి.

Advertisement

విక్రయాలు, దిగుమతుల ద్వారా అత్యధిక వసూళ్లు రావడం వల్లే జులైలో భారీగా జీఎస్‌టీ వసూళ్లు పెరిగినట్లు తెలుస్తోంది. దేశీయ విక్రయాలపై జీఎస్‌టీ వసూళ్లు 10.1 శాతం పెరిగి రూ.1.44 లక్షల కోట్లకు చేరాయి. దిగుమతులపై జీఎస్‌టీ వసూళ్లు 29 శాతం పెరిగి రూ.66,511 కోట్లకు చేరాయి. మొత్తం రిఫండ్‌లు 13.1 శాతం పెరిగి రూ.29,968 కోట్లకు పెరిగాయి.2026 జూన్‌లో రూ.1.95 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు అయ్యాయి.

Advertisement

ప్రతి నెలా జీఎస్టీ వసూళ్లలో స్థిరమైన వృద్ధి, మొత్తం దేశీయ వినియోగం ప్రభావితమవుతోందని అని డెలాయిట్ ఇండియా భాగస్వామి ఎంఎస్ మణి అన్నారు. అయితే దిగుమతులు నిరంతరం పెరుగుతుండటంపై కొంతమంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పెరిగిన స్థాయిలో ఉన్న దిగుమతుల జీఎస్టీ వసూళ్లను విస్మరించలేమన్నారు. గత కొన్నేళ్లుగా విజయవంతమైన పీఎల్‌ఐ, ఆత్మనిర్భర్ భారత్ పథకాలు అమలు చేసినప్పటికీ, దేశీయ తయారీ సామర్థ్యంలో ఇంకా అంతరం ఉందని పేర్కొంటున్నారు. జూలై లంగాణకు రూ.4,550 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.3,268 కోట్ల జీఎస్‌టీ ఆదాయం వచ్చింది.

Advertisement

2025 జులైతో పోలిస్తే తెలంగాణ జీఎస్‌టీ ఆదాయ వృద్ధి 17 శాతం పెరగ్గా.. ఆంధ్రప్రదేస్ వృద్ధి 12 శాతం పెరిగింది. 2026లో జూలై వరకు తెలంగాణకు రూ.17,437 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.13,246 కోట్ల జీఎస్‌టీ ఆదాయం వచ్చింది. జూలై జీఎస్టీ వసూళ్లలో మహారాష్ట్ర నుంచి రూ.32,210 కోట్లు, కర్ణాటక రూ.13,854 కోట్లు, గుజరాత్ నుంచి రూ.12,923 కోట్లు వచ్చచాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.