For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌లో బంగారం ధరలు మారడానికి గల కారణాలు?

By Nageswara Rao
|

భారతదేశంలో బంగారం ధరలు మార్పునకు దారి వివిధ కారణాలు ఉన్నాయి. నిజానికి, ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయి, కానీ ముఖ్యమైన రెండు కారణాలు మాత్రం ఇవే.

* అంతర్జాతీయ స్ధాయిలో బంగారం ధరలు
* కరెన్సీ అస్థిరత

అంతర్జాతీయ స్ధాయిలో బంగారం ధరలు:

భారత్‌లో బంగారం ధరలు నిలకడగా ఉండకపోవడానికి గల కారణం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉండటమే. భారత్‌లోని ప్రజలకు బంగారంపై మక్కువ ఎక్కువ. కాబట్టి బంగారం దిగుమతి ఎక్కువగా చేసుకుంటారు. దీంతో అంతర్జాతీయ స్ధాయిలో బంగారం ధరలు పెరిగితే, భారత్‌లో బంగారం ధరలు కూడా ఒక్కసారిగా పెరుగుతాయి.

What Factors Lead To Change In Gold Prices In India?

ఉదాహారణకు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ తగ్గినట్లైతే, బంగారం ధర ఆటోమాటిక్‌గా పెరుగుతుంది. అంతర్జాతీయ స్ధాయి మార్కెట్లో ఈరోజు బంగారం ఔన్స్ ధర $1,200కు కంటే తక్కువగా ట్రేడ్ అవుతుంది కాబట్టి డాలర్ విలువ పెరిగింది.

భారత్‌లో చాలా మంది గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పెడుతుంటారు. బంగారం ధరలు పెరగడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. బంగారంలో పెట్టుబడులు అనేవి గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌ల) రూపంలో జరుగుతాయి. గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడులనేవి ఎలక్ట్రానిక్ రూపంలో జరుగుతాయి.

ప్రపంచంలో బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా, భారత్‌లు టాప్ స్ధానంలో ఉన్నాయి. భారత్ ప్రజలను భౌతిక బంగారం కొనుగోలు నుంచి మాన్పించాలని కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను కూడా ప్రవేశపెట్టింది.

2015 కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ఆర్ధిక మంత్రి సావరిన్ గోల్డ్ బాండ్‌లపై వడ్డీ రేటుని పెంచిన విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం భౌతిక బంగారాన్ని కొనుగోలు నుండి పెట్టుబడిదారులు మాన్పించడానికేనని అంటున్నారు.

కరెన్సీ అస్థిరత:

బంగారం ధర పెరగడంలో కరెన్సీ అస్థిరత కూడా ముఖ్య భూమికను పోషిస్తుంది. డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయి విలువ తగ్గుతున్నట్లైతే, బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. దీనిని బట్టి పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు అంతర్జాతీయ బంగారం ధరలపై ఓ కన్నేసి ఉండటం మంచింది. దీనితో పాటు రూపాయి అస్థిరతను కూడా పరిశీలిస్తే మంచిది.

English summary

భారత్‌లో బంగారం ధరలు మారడానికి గల కారణాలు? | What Factors Lead To Change In Gold Prices In India?

There are various factors that lead to a change in gold prices in India. In fact, there are plenty of factors, but two of the most important ones are international prices of gold and currency fluctuation.
Story first published: Tuesday, April 21, 2015, 13:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X