For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోట్ల ర‌ద్దు త‌ర్వాత పెరిగిన డిజిట‌ల్ లావాదేవీలు 23%

పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు డిజిట‌ల్ లావాదేవీల పెంపుపై దృష్టి సారించాయి. అయితే ప్ర‌భుత్వం అనుకున్నంత స్థాయిలో డిజిట‌ల్ లావాదేవీల్లో పురోగ‌తి లేద‌నే చెప్పాలి. మొత్తం డిజిట

|

పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు డిజిట‌ల్ లావాదేవీల పెంపుపై దృష్టి సారించాయి. అయితే ప్ర‌భుత్వం అనుకున్నంత స్థాయిలో డిజిట‌ల్ లావాదేవీల్లో పురోగ‌తి లేద‌నే చెప్పాలి. మొత్తం డిజిట‌ల్ లావాదేవీల్లో 23% పురోగ‌తి క‌న‌బ‌డుతుండ‌గా కార్డు ఆధారిత లావాదేవీల్లో కేవ‌లం 7% మాత్ర‌మే పెరుగుద‌ల ఉన్న‌ట్లు పార్ల‌మెంట‌రీ స్థాయి సంఘానికి అధికారులు వివ‌రించారు. ఆర్థిక వ్య‌వ‌హారాల‌పై ఏర్పాటైన పార్ల‌మెంట‌రీ స్థాయి సంఘం ముందు నోట్ల ర‌ద్దు, డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌హారాల దిశ‌గా స‌న్న‌ద్ద‌త వంటి అంశాల‌పై దృష్టి సారించింది. వివిధ మంత్రిత్వ శాఖ‌ల నుంచి హాజ‌రైన అధికారుల బృందం డిజిట‌ల్ లావాదేవీల పురోగ‌తిని గురించి వారికి వివ‌రించింది. నవంబ‌రు, 2016 లో ఉన్న డిజిట‌ల్ లావాదేవీల సంఖ్య 22.4 మిలియ‌న్ రూపాయ‌ల నుంచి 23% వృద్దితో మే 2017 నాటికి 27.5 మిలియ‌న్ రూప‌యాల‌కు పెరిగింది. ఇందులో యూపీఐ ద్వారా జ‌రిగే లావాదేవీలే ఎక్కువ వృద్ది సాధించిన‌ట్లు తెలుస్తోంది. న‌వంబ‌రు 2016లో ఒక రోజుకు మిలియ‌న్ యూపీఐ ఆధారిత లావాదేవీలు జ‌రుగుతుండ‌గా మే,2017 నాటికి రోజుకు 30 మిలియ‌న్ లావాదేవీలు జ‌రుగుతున్న‌ట్లు లెక్క‌లు చెబుతున్నాయి.

డిజిట‌ల్ లావాదేవీలు

మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ల్లో ఉండే యూపీఐ ద్వారా మ‌రో వ్య‌క్తి బ్యాంకు ఖాతాను మీ ల‌బ్దిదారుల జాబితాలో జ‌మ చేసుకోకుండానే నేరుగా న‌గ‌దు బ‌దిలీ చేయ‌వ‌చ్చు. దాదాపు 7 నెల‌ల కాల‌వ్య‌వ‌ధిలో ఐఎంపీఎస్ ఆధారిత చెల్లింపులు 1.2 మిలియ‌న్ స్థాయి నుంచి 2.2 మిలియన్ల‌కు పెరిగాయని తెలుస్తోంది. ఇక అతి తక్కువగా డిజిటల్‌ లావాదేవీలు జరిగిన విభాగం క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారానేనని అధికారులు వెల్లడించారు. గతేడాది నవంబర్‌లో 6.8మిలియన్ల మంది కార్డులను వినియోగించగా, ఈ ఏడాది మే నాటికి ఆ సంఖ్య 7.3 మిలియన్లుగా మాత్రమే ఉంది. 2016 నవంబర్‌ 8న కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more about: digital online
English summary

నోట్ల ర‌ద్దు త‌ర్వాత పెరిగిన డిజిట‌ల్ లావాదేవీలు 23% | after demonetisation digital transactions raised by only 23 percent

Transactions through debit and credit cards rose by merely seven per cent post-demonetisation, as against a surge of over 23 per cent in overall digital transactions, top government officials told a parliamentary panel.
Story first published: Tuesday, July 18, 2017, 12:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X