For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ‌చ్చే 18 నెల‌ల్లో వ‌డ్డీ రేట్లు య‌థాత‌థం: ఆర్బీఐ

ఈ నెల ప్రారంభంలో జరిగిన ద్రవ్యపరపతి సమీక్షలో సెకండరీ వడ్డీరేటును పెంచినప్పటికీ, నగదు లభ్యత ఎక్కువగా ఉందనే కారణంతో కీలక రెపో రేటును మార్పులు చేయ‌లేదు. ఇదే విధమైన పాలసీని ఆర్బీఐ వచ్చే 18 నెలల పాటు కొనసా

|

వడ్డీరేట్లపై ఆశలు పెంచుకుంటున్న వివిధ‌ వర్గాలను ఆర్‌బీఐ వ‌రుస‌గా నిరాశపరుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ప్ర‌తి ద్వైమాసిక‌ సమీక్షల్లో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతుంది. ఈ నెల ప్రారంభంలో జరిగిన ద్రవ్యపరపతి సమీక్షలో సెకండరీ వడ్డీరేటును పెంచినప్పటికీ, నగదు లభ్యత ఎక్కువగా ఉందనే కారణంతో కీలక రెపో రేటును మార్పులు చేయ‌లేదు. ఇదే విధమైన పాలసీని ఆర్బీఐ వచ్చే 18 నెలల పాటు కొనసాగించనుందట. వచ్చే ఏడాది వరకు ఆర్బీఐ వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచనున్నట్లు రాయిట‌ర్స్ నిర్వ‌హించిన ఒక పోల్‌లో తెలిసింది.

rbi interest rates in telugu

35 మందికి పైగా ఆర్థికవేత్తలపై ఏప్రిల్ 10-19 మధ్య జరిపిన పోల్‌లో ఈ విషయం వెల్లడైంది. 2018 నాలుగో త్రైమాసికం వరకు ఆర్బీఐ రెపోరేటును 6.25 శాతంగానే ఉంచనున్నట్టు తెలిసింది. అంతేకాక రివర్స్ రెపో రేటు 6.00 శాతం నుంచి మార్చ‌కుండా ఉండే అవ‌కాశాలు ఉన్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. రిజర్వు బ్యాంకుకు సంబంధించి ద్రవ్యోల్బణం అతిముఖ్య‌మైన ఆందోళనకరమైన అంశంగా మారిందని, ప్రస్తుతం సులభతరమైన ద్రవ్యవిధానానికి ఇది తూట్లు పొడుస్తుంద‌ని క్రిసిల్‌కు చెందిన ప్ర‌ధాన ఆర్థికవేత్త ధర్మకీర్తి జోషి అభిప్రాయ‌ప‌డ్డారు.

rbi interest rates in telugu

గత నెల వార్షిక వినియోగదారుల ద్రవ్యోల్బణం 3.81 శాతం పెరిగిందని, 2016 అక్టోబర్ త‌ర్వాత అంత వేగ‌వంత‌మైన పెరుగుద‌ల ఇదేన‌ని అన్నారు. ఇది ఆర్బీఐ నిర్దేశించుకున్న 4 శాతానికి దగ్గరగా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగి 5 శాతానికి రావొచ్చ‌ని ఆర్థికవేత్తలు ఆందోళ‌న చెందుతున్నారు. దీంతో వడ్డీరేట్ల కోత అంచనాలను వారు తగ్గిస్తున్నారు. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడానికే ఆర్బీఐ మొగ్గుచూపుతుందని పేర్కొంటున్నారు.

Read more about: rbi repo rate interest rate
English summary

వ‌చ్చే 18 నెల‌ల్లో వ‌డ్డీ రేట్లు య‌థాత‌థం: ఆర్బీఐ | rbi to keep interest rates as it is for next 18 months Reuters poll said

The Reserve Bank of India is expected to keep interest rates steady well into next year after it shifted to a neutral monetary policy stance in February, and despite having raised concerns over a potential spike in inflation, a Reuters poll found. Earlier this month, the central bank raised a secondary rate while holding the key repo rate steady to mop up excess liquidity from the government's demonetisation drive, making it the fourth meeting in a row it has surprised markets.
Story first published: Thursday, April 20, 2017, 14:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X