For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐసీఐసీఐ కొత్త పథకం: హోం లోన్ 20 శాతం అధికంగా..!

By Nageswara Rao
|

ముంబై: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ బుధవారం సరికొత్త గృహ రుణ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఖాతాదారుల అసరాలకు అనుగుణంగా, వారి అర్హతకు మంచి 20 శాతం వరకు అదనపు మొత్తాన్ని గృహరుణంగా అందించడంతో పాటు, చెల్లింపు కాలాన్ని కూడా మరో 7 ఏళ్లు అదనంగా పొడిగించింది.

ఈ తరహా పథకం ఆవిష్కరణ దేశంలో ఇదే తొలిసారి. ఇందు కోసం రుణం తీసుకునే సమయంలోనే తనఖా హామీ రుసుం (మార్టిగేజ్ గ్యారెంట్ ఫీ) చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కసారే వసూలు చేసే ఈ రుసుం, రుణ మొత్తంలో 2 శాతం వరకు ఉంటుంది. అమెరికా, కెనడాల్లో ఈ తరహా పథకాలు ప్రాచుర్యం పొందాయి. ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్ పథకాన్ని ప్రారంభించారు.

ఐసీఐసీఐ కొత్త పథకం: హోం లోన్ 20 శాతం అధికంగా..!

ఐసీఐసీఐ కొత్త పథకం: హోం లోన్ 20 శాతం అధికంగా..!

తమ బ్యాంక్ తాజా చొరవ దేశంలో మార్టిగేజ్ (తనఖా) మార్కెట్ వృద్ధికి దోహదపడుతుందని కొచర్ తెలిపారు. రుణ గ్రహీతలకు ఇబ్బందులు లేకుండా కస్టమర్లకు మెరుగైన రుణ సౌలభ్యతను ఈ తరహా పథకాలు అందిస్తాయని వివరించారు. కాగా, చైనా ప్రభావం వల్ల వచ్చిన ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని భారత్ ఎదుర్కొంటున్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భారీ విదేశీ మారకద్రవ్య నిల్వలు, కరెంట్ అకౌంట్, ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక అంశాల్లో సానుకూలతలు దేశానికి కలిసివచ్చే అంశాలన్నారు.

ఐసీఐసీఐ కొత్త పథకం: హోం లోన్ 20 శాతం అధికంగా..!

ఐసీఐసీఐ కొత్త పథకం: హోం లోన్ 20 శాతం అధికంగా..!

'ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్‌ట్రా హోమ్ లోన్స్' ప్రొడక్ట్‌గా ఇది ప్రారంభమైంది. ఇది 'తనఖా' హామీ ఆధారిత పథకం. 20 శాతం వరకూ అదనపు రుణం దీనివల్ల లభ్యం అవుతుంది. రుణ చెల్లింపు కాల వ్యవధి ఏడేళ్ల (67ఏళ్ల వయస్సు వరకూ) వరకూ పెంచుకునే వీలుంది.

ఐసీఐసీఐ కొత్త పథకం: హోం లోన్ 20 శాతం అధికంగా..!

ఐసీఐసీఐ కొత్త పథకం: హోం లోన్ 20 శాతం అధికంగా..!

ఈ పథకం కింద గరిష్టంగా రూ. 75 లక్షల వరకు రుణం అందిస్తారు. ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంక్ ఇస్తున్న గృహరుణాల సగటు రూ. 35-37 లక్షలుగా ఉంది. గ్రేటర్ ముంబై, ఎన్‌సీఆర్, బెంగుళూరు, సూరత్‌లలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. క్రమక్రమంగా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తామన్నారు.

ఐసీఐసీఐ కొత్త పథకం: హోం లోన్ 20 శాతం అధికంగా..!

ఐసీఐసీఐ కొత్త పథకం: హోం లోన్ 20 శాతం అధికంగా..!

ఈ సౌలభ్యతలను పొందడానికి రుణం పొందే ప్రారంభ దశలోనే ఒకేసారి కొంత మార్టిగేజ్ గ్యారంటీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం రుణ పరిమాణంలో గరిష్టంగా 2 శాతం వరకూ ఈ ఫీజు ఉంటుంది. అదనపు రుణం, ఫీజు నిర్ణయం పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. గృహరుణాల మంజూరు విభాగం 25-27 శాతం వార్షిక వృద్ధి సాధిస్తోందని, నూతన పథకంతో మరింత వృద్ధి లభిస్తుందనే అంచనాను వ్యక్తం చేశారు.

ఐసీఐసీఐ కొత్త పథకం: హోం లోన్ 20 శాతం అధికంగా..!

ఐసీఐసీఐ కొత్త పథకం: హోం లోన్ 20 శాతం అధికంగా..!

ఇండియా మార్టిగేజ్ గ్యారంటీ కార్పొరేషన్ భాగస్వామ్యంతో ఈ పథకం అమలవుతుంది. ఈ కార్పొరేషన్ ఇంక్రిమెంటల్ రిస్క్‌కు గ్యారంటీగా ఉంటుంది. మధ్య వయస్సున్న వ్యక్తులు, స్వయం ఉపాధి ఆధారంగా జీవనం సాగిస్తున్న వ్యక్తుల ప్రయోజనాల కోసం ప్రధానంగా ఈ పథకాన్ని ఉద్దేశించడం జరిగిందని బ్యాంక్ ఈడీ రాజీవ్ సబర్వాల్ తెలిపారు.

English summary

ఐసీఐసీఐ కొత్త పథకం: హోం లోన్ 20 శాతం అధికంగా..! | ICICI Bank launches mortgage guarantee-backed home loan

ICICI Bank on Wednesday launched the country's first mortgage guarantee-backed home loan that will allow consumers to increase borrowing by 5-20 per cent and the tenure up to 67 years of age.
Story first published: Thursday, August 27, 2015, 11:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X