For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్య బీమాలో న‌గ‌దు ర‌హిత ప్ర‌యోజ‌నం అంటే ఏమిటి?

పాలసీ ద్వారా నిర్ధారించబడిన పరిమితులు లేదా ఉప పరిమితులను మించిన ఖర్చులు ఆసుపత్రికి బీమాచేయబడిన వ్యక్తి నేరుగా చెల్లించాల్సి ఉంటుంది.అయితే, నెట్ వర్క్ లో లేని ఒక ఆసుపత్రిలో మీరు కనుక చికిత్స చేయించుకు

|

ఆరోగ్య బీమా అవసరాన్ని ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఈ రంగంలో దాదాపు 20-25శాతం వరకూ వృద్ధి చోటు చేసుకుంది. వైద్య ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ పోర్ట్‌ఫోలియోలో ఈ పాలసీని తప్పనిసరిగా చేర్చుకోవాలి. చాలామంది తమ ఉద్యోగ సంస్థ కల్పించే ఆరోగ్య బీమా సరిపోతుందని అనుకుంటారు. కానీ, అన్ని సందర్భాల్లోనూ ఇది సరిపోకపోవచ్చు. ఈ పాలసీలు ఉన్నప్పటికీ.. తప్పనిసరిగా వ్యక్తిగతంగా ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీని తీసుకుంటే మంచిది.

ఆరోగ్య బీమాలో న‌గ‌దు ర‌హిత ప్ర‌యోజ‌నం అంటే ఏమిటి?

క్యాష్‌లెస్ బెనిఫిట్‌(న‌గ‌దు ర‌హిత‌) చికిత్స అన‌గా:
దేశంలోని ఆసుపత్రుల నెట్‌వ‌ర్క్‌తో బీమా కంపెనీలు ఒక ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటాయి. నగదు రహిత బీమా పాలసీ క్రింద, పాలసీ దారుడు కనుక నెట్ వెర్క్ ఆసుపత్రులు దేనిలోనైనా చికిత్స చేయించుకుంటే, అప్పుడు బీమా చేయించుకున్న వ్యక్తి ఆసుపత్రి బిల్లులు చెల్లించవలసిన పని లేదు. బీమా కంపెనీ తనథర్డ్ పార్టి ఎడ్మిన్ స్ట్రేటర్ (టీపీఏ) ద్వారా సరాసరి ఆసుపత్రికి డబ్బులు చెల్లిస్తుంది. పాలసీ ద్వారా సరాసరి ఆసుపత్రికి డబ్బులు చెల్లిస్తుంది. పాలసీ ద్వారా నిర్ధారించబడిన పరిమితులు లేదా ఉప పరిమితులను మించిన ఖర్చులు ఆసుపత్రికి బీమాచేయబడిన వ్యక్తి నేరుగా చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, నెట్ వర్క్ లో లేని ఒక ఆసుపత్రిలో మీరు కనుక చికిత్స చేయించుకుంటే, నగదు రహిత సౌకర్యం లభ్యం కాదు.

English summary

ఆరోగ్య బీమాలో న‌గ‌దు ర‌హిత ప్ర‌యోజ‌నం అంటే ఏమిటి? | What is the cashless benefit in Health Insurance

What is meant by cashless hospitalisation is that when you get admitted in the hospital for treatment, for an illness covered by your health insurance policy, you don’t have to pay for the treatment from your own pocket. Health insurance providers enter into agreements with various hospitals for providing these facilities to policyholders.
Story first published: Saturday, February 11, 2017, 16:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X