లక్షల్లో జీతాలు పొందేవారు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. వారి ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ. 4 లక్షల వరకు ఎలాంటి పన్ను కట్టాల్సి అవసరం లేదు. వార్షిక ఆదాయం రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షలు ఉంటే 5 శాతం ట్యాక్స్ పే చేయాలి. రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షలు ఉంటే 10 శాతం పన్ను కట్టాలి. రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలు ఉంటే 15 శాతం ట్యాక్స్ పే చేయాలి. రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షలు ఉంటే 20 శాతం పన్ను కట్టాలి. రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షలు ఉంటే 25 శాతం ట్యాక్స్ పే చేయాలి. రూ.24 లక్షల పైన ఉంటే.. 30 శాతం పన్ను కట్టాలి.
ఉద్యోగులు వారు పొందే జీతాన్ని బట్టి వారు ఏ స్లాబ్ లోకి వస్తే అంత ట్యాక్స్ పే చేయాలి. ఇలా ఓ వ్యక్తి లక్షల్లో జీతం తీసుకున్నాడు. ప్రభుత్వం పన్ను రూపంలో కోటి రూపాయలు కట్టాడు. అయితే సడెన్ గా అతని ఉద్యోగం పోయింది. దీని పై సదరు వ్యక్తి స్పందించారు. తన నుంచి కోటి రూపాయలు తీసుకున్న ప్రభుత్వం ఉద్యోగం పోయిన తర్వాత సాయం చేయలేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్ గురించి భారీ ఎత్తున చర్చ జరుగుతుంది. ఉద్యోగం కోల్పోయిన వారికి సామాజిక భద్రత ఉండాలా? టాక్స్ చెల్లించే వారికి ప్రభుత్వం ఏమివ్వాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
మొహమ్మద్ నౌసత్ అనే వ్యక్తి 14 ఏళ్ల పాటు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేశాడు. ఈ క్రమంలో కోటి రూపాయల ఆదాయపు పన్ను చెల్లించాడు. ఇప్పుడు అతను ఉద్యోగం కోల్పోయాడు. తనకు ఎలాంటి సపోర్ట్ లేదన్నాడు. థ్యాంక్యూ ఇండియా అంటూ పోస్ట్ చేశారు. అతని పోస్ట్ కు లక్షలాది మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు నౌసత్‌కు మద్దతు పలుకుతూ, పన్నులు క్రమం తప్పకుండా చెల్లించే వారికి ఉద్యోగం కోల్పోయిన సమయంలో కనీసం 3 నుంచి 6 నెలల పాటు ఆర్థిక సాయం అందించే విధానం భారత్‌లో ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.
బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో నిరుద్యోగులకు ప్రభుత్వ సహాయం లభిస్తుందని పేర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రతి వ్యక్తి ముందుగానే పొదుపు చేసుకోవాలని, ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం లేదని మరికొందరు స్పందిస్తున్నారు. ఉద్యోగం కోల్పోయినప్పుడు ఆదుకోవడానికి EPF, NPS, 80C వంటి పథకాలు ఇప్పటికే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఈ కామెంట్ల నౌసత్ స్పందించాడు. ప్రభుత్వం నుంచి తనకు నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా అభ్యంతరం లేదని, కానీ తాము చెల్లించే పన్నులకు తగిన స్థాయిలో నాణ్యమైన ప్రభుత్వ సేవలు, మౌలిక వసతులు అందాలని డిమాండ్ చేశారు. పిల్లలను సురక్షితంగా రోడ్లపై తీసుకెళ్లే ఫుట్‌పాత్‌లు, కాలుష్యం తక్కువగా ఉండే నగరాలు, సైకిల్ తొక్కేందుకు సేఫ్ రూట్స్, ఫ్యామిలీతో గడిపేందుకు పచ్చని పార్కులు, వేగవంతమైన రైలు సౌకర్యాలు వంటి ప్రజా వసతులు అందుబాటులో ఉండాలని కోరారు.
More Articles
- Lay Off: కార్పొరేట్ ఉద్యోగి నుంచి డెలవరీ బాయ్ వరకు.. 56 ఏళ్ల వ్యక్తి కథ ఇది..!
- రూ. 2 కోట్ల అప్పు.. రాత్రికి రాత్రే ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ.. హాట్ డిబేట్‌గా టెకీ సక్సెస్ స్టోరీ..
- అప్పు చేయాలంటే చచ్చేంత భయంగా ఉంది.. లేఆఫ్స్ వణుకుపై టెక్కీ ఆవేదన!
- Layoffs: లేఆఫ్స్ నుండి తప్పించుకోవాలంటే ఏకైక మార్గం ఇదే.. గోల్డ్‌మన్ సాక్స్ కీలక సూచన!
- Bengaluru: ఒరాకిల్‌లో ఉద్యోగం పోయింది.. కానీ దర్జాగా బతుకుతున్నాడు! ఈ టెక్కీ ప్లానింగ్ మామూలుగా లేదుగా!
- జీతం పెంపులో అలసత్వం.. జాబ్ వదిలేసిన బెస్ట్ ఇంజనీర్.. తీవ్రంగా నష్టపోయిన కంపెనీ..