దేశంలో ఈక్విటీ మార్కెట్ లో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. అయినప్పటికీ చాలా మందికి చాలా మందికి మ్యూచువల్ ఫండ్లకు సంబంధించి తెలియదు. అయితే మ్యూవల్ ఫండ్లు, ఫైనాన్షియల్ ప్లాన్ల గురించి ఈ తరం వారికి తెలియడానికి ఒడిశా ప్రభుత్వం నడుం బిగించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో కామర్స్, మేనేజ్‌మెంట్, సంబంధిత కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులలో ఆర్థిక అక్షరాస్యతను, ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు మ్యూచువల్ ఫండ్స్‌పై ఒక సర్టిఫికేట్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు చెప్పారు.

Advertisement

ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం బీకామ్, బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (బీఎంఎస్), బీఏ ఇన్ ఎకనామిక్స్ అండ్ కామర్స్, ఎంబీఏ, ఎంకామ్ కోర్సులలో చేరిన విద్యార్థులకు ఈ 30 గంటల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ శిక్షణ, విద్యార్థులను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ (ఎన్ఐఎస్ఎం) సిరీస్ V-A మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ సర్టిఫికేషన్ పరీక్షకు కూడా సిద్ధం చేస్తుందని అధికారులు తెలిపారు.

Advertisement

భువనేశ్వర్, బెర్హంపూర్, భద్రక్, ధెంకనాల్, జయపూర్, కేంద్రపారా, కియోంజర్, రూర్కెలా, సంబల్‌పూర్ వంటి ప్రధాన పట్టణ కేంద్రాలకు 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 97 ఎంపిక చేసిన కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టులో భాగంగా అమలు చేయనున్నారు. ప్రతి సంస్థ నుంచి దాదాపు 60 మంది విద్యార్థులను ఈ కోర్సు కోసం ఎంపిక చేస్తారని, దీనిని ఉచితంగా అందిస్తారని అధికారులు తెలిపారు.

పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమాలు, విద్యార్థుల కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించడానికి ఉన్నత విద్యా శాఖ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మధ్య మే నెలలో కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) కొనసాగింపుగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే ఇలాంటి కోర్సులు దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని డిమాండ్ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈక్విటీ మార్కెట్లకు సంబంధించి కోర్సులు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.