మంచి బ్యాటరీ బ్యాకప్, గేమ్స్ ఆడడానికి, అలాగే మంచి కెమెరా ఫీచర్స్ తో వన్ ప్లస్ ఇండియాలో మొబైల్ లాంచ్ చేసింది. వన్ ప్లస్ ఎన్6 పేరుతో ఈ కొత్త మోడల్ మార్కెట్ లోకి రానుంది. ఈ ఫోన్ ధర రూ.21,999 నుంచి రూ.25,000 నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ లో ఆకర్షణగా నిలిచే అంశాలు చూస్తే.. బ్యాటరీ ఎంఏహెచ్ ఎక్కువగా ఉంది. ఈ ఫోన్ 8,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజుల పాటు వస్తుందని కంపెనీ క్లయిమ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే 6.8 ఇంచులు ఉండనుంది. 120Hz ఉంటుంది. ఈ ఫోన్ గరిష్ఠంగా 1200 నెట్స్ బ్రైట్ నెస్ తో రానుంది.
ఆక్సిజన్ ఓఎస్ 16 తోపాటు ఫ్లాగ్‌షిప్ పరికరాల తరహా డిజైన్ ఉన్నాయి. సరసమైన ధరలో ఎక్కువ బ్యాటరీ లైఫ్, వేగవంతమైన పనితీరు, ప్రీమియం డిజైన్‌ను కోరుకునే వినియోగదారుల కోసం ఎన్6ని రూపొందించినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. వన్ ప్లస్ ఎన్6లో 45 వాట్స్ సూపర్ వోక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ ఛార్జర్ బ్యాటరీని కేవలం 46 నిమిషాల్లో 1 శాతం నుంచి 50 శాతం వరకు ఛార్జ్ చేస్తోంది. ఈ ఫోన్ లో నైట్ ఛార్జింగ్ మోడ్, గేమింగ్ తో పాటు బైపాస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. ఈ ఫోన్ నుంచి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు ఛార్జింగ్ చేసుకోవచ్చు. 5W 'రివర్స్ ఛార్జింగ్' ను సపోర్ట్ చేస్తుంది.
వన్ ప్లస్ ఎన్6లో బ్యాటరీ సుదీర్ఘకాలం పని చేస్తుందని చెబుతున్నారు. ఈ ఫోన్ ను ఏడేళ్లపాటు ప్రతి రోజు ఛార్జ్ చేసినా బ్యాటరీ సామర్థ్యంలో 80 శాతం కంటే ఎక్కువ ఛార్జ్ ను నిలుపుకుంటుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ MIL-STD-810H సర్టిఫికేషన్‌తో పాటు ఫోన్ లోకి దుమ్ము, నీరు వెళ్లినా చెడిపోకుండా ఉంటుంది. ఈ ఫోన్ కు IP65 రేటింగ్ ఇచ్చారు. ఈ మొబైల్ లో ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి. వన్ ప్లస్ ఎన్6 మీడియా టెక్ డైమెన్సిటీ 6360 అపెక్స్ చిప్ సెట్ తో వస్తుంది. 6జీబీ వరకు ర్యామ్ సపోర్ట్ చేస్తోంది. ఇందులో 5,300ఎంఎం వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంది. ఇందులో ఎక్కువ సేపు గేమింగ్ తో పాటు మల్టీ టాస్కింగ్ చేసిన ఫోన్ త్వరగా వేడెక్కదు.
వన్ ప్లస్ ఎన్6లో కెమెరా లు చూస్తే రియర్ కెమెరా 50 మెగా పిక్సెలు ఉండా ఫ్రంట్ కెమెరా 8 మెగా పిక్సెల్ ఉంది. ఈ ఫోన్ తో 60ఎఫ్పీఎస్ వద్ద 1080 క్వాలిటీతో వీడియో రికార్డు చేయవచ్చు. ఇందులో ఏఐ ఫర్పెక్ట్ షాట్, ఏఐ ఏరైసర్, ఏఐ రిప్లేక్షన్ ఎరైసర్ వంటి టూల్స్ కూడా ఉన్నాయి. జూలై 4 నుంచి 6 వరకు జరిగే అమెజాన్ 'ప్రైమ్ డే' సేల్ సమయంలో వన్ ప్లస్ ఎన్6 అందుబాటులో ఉండనుంది. ఆఫర్ల తర్వాత వన్ ప్లస్ ఎన్6 4 GB+128GB వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. అలాగే 6GB+128GB మోడల్ ధర రూ.21,999 గా ఉండే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 4 వన్ ప్లస్ ఆన్‌లైన్ ఛానెల్‌లు, అమెజాన్, వన్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్లు,దేశంలోని ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా ఓపెన్ సేల్‌కు అందుబాటులోకి వస్తుంది.
More Articles
- ఇండియాలోకి సరికొత్త వన్‌ప్లస్ N సిరీస్: జూన్ 30న OnePlus N6 గ్రాండ్ ఎంట్రీ!
- Google Pixel 11: గూగుల్ పిక్సెల్ 11 వచ్చేస్తోంది! ఐఫోన్ కంటే బెటర్ వాల్యూ అవుతుందా?
- Oppo Reno 15: ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్! బ్యాటరీ సెగ్మెంట్లో గేమ్ ఛేంజర్ అవుతుందా?
- వన్‌ప్లస్ మొబైల్స్ క్లోజ్? కస్టమర్లలో టెన్షన్.. ఈ వైరల్ వార్తల్లో నిజమెంత? క్లారిటీ ఇచ్చిన OnePlus!
- Aadhaar: మెుబైల్ నంబర్ మార్చారా.. కొత్త నంబర్ ఆధార్‌తో ఇలా లింక్ చేసుకోండి..
- Vodafone Idea: Vi కంపెనీకి కొత్తచిక్కులు.. వచ్చేనెలలో సేవలు నిలిచిపోయే ప్రమాదం.. కస్టమర్ల పరిస్థితి..