రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 24న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయియి. అంటే సంవత్సరానికి రూ.6 వేలు అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు 23 విడతలుగా పీఎం కిసాన్ నిధులు వచ్చాయి. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.46 వేలు జమ అయ్యాయి. పీఎం కిసాన్ పథకంలో భాగంగా డబ్బులు ఖాతాల్లో జమ కావాలంటే తప్పనిసరిగా ఇకేవైసీ చేసుకోవాలి. ఇకేవైసీ చేస్తేనే అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు తేల్చి చెప్పారు.

Advertisement

ఇప్పటికీ కూడా ఇకేవైసీ చేసుకోని వారికి డబ్బులు జమ కాలేదు. రైతులు చాలా సులభంగా ఇకేవైసీ చేసుకోవచ్చు. మీసేవ కేంద్రాలు, సీఎస్సీలు, పీఎం కిసాన్ మొబైల్ యాప్ లో ఇకేవైసీ చేసుకోవచ్చు. బయోమెట్రిక్ ద్వారా ఇకేవైసీ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ 23వ విడత నిధులు గత నెలలో అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి. 24 వ విడతకు సంబంధించి సెప్టెంబర్ లో అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అయితే పీఎం కిసాన్ పథకం తీసుకొచ్చి 7 సంవత్సరాలు పూర్తయింది. అయినప్పటికీ పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6 వేలను పెంచడం లేదు.

Advertisement

గత బడ్జెట్ సమయంలో పీఎం కిసాన్ పథకం కింద అందించే రూ.6 వేలను రూ.9 వేలకు పెంచుతారని వార్తలు వచ్చాయి. కాని కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వచ్చే బడ్జెట్ లో అయిన పీఎం కిసాన్ నిధులను రూ.6 వేల నుంచి రూ.9 వేలకు పెంచాలని రైతులు కోరుతున్నారు. కాగా.. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు, ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినవారు, ఆదాయపు పన్ను కట్టేవారు పీఎం కిసాన్ పథకానికి అనర్హులు. ఒక వేళ వారు పీఎం కిసాన్ తీసుకుంటే స్వచ్ఛందంగా వెనక్కు ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.

Advertisement

ఇక రాష్ట్రం కూడా రైతులకు ఆర్థిక సాయం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. ఈ పథకం కింద సంవత్సరానికి రూ.12 వేలు అందిస్తోంది. సీజన్ కు రూ.6 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈసారి వర్షాకాల సీజన్ కు సంబంధించి రైతు ఖాతాల్లో రూ.6 వేల చొప్పున జమ చేశారు. ఈ సీజన్ కు సంబంధించి 9 రోజుల్లో దాదాపు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. అయితే గత యాసంగి సీజన్ కు సంబంధించి కేవలం రెండు ఎకరాల వరకే రైతు భరోసా ఇచ్చారు.