For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకునేముందు ఇవి తెలుసుకోవ‌ల్సిందే...

వైద్యం ఏటేటా ఎంతెంత ఖ‌రీద‌వుతున్న‌దో అంద‌రికీ తెలుసు. ఎందుకంటే చికిత్స‌ల ఖ‌ర్చులు, మందుల రేట్లు ఏటేటా పెరుగుతూనే ఉంటాయి. అందుకు విరుగుడుగా చాలా మంది ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకునేందుకు మొగ్గుచూపుతారు. ఒక

|

వైద్యం ఏటేటా ఎంతెంత ఖ‌రీద‌వుతున్న‌దో అంద‌రికీ తెలుసు. ఎందుకంటే చికిత్స‌ల ఖ‌ర్చులు, మందుల రేట్లు ఏటేటా పెరుగుతూనే ఉంటాయి. అందుకు విరుగుడుగా చాలా మంది ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకునేందుకు మొగ్గుచూపుతారు. ఒక పాల‌సీ తోడుగా ఉంటే ఎప్పుడైనా ఆసుప‌త్రి పాల‌యిన‌ప్పుడు విప‌రీతంగా వ‌చ్చే ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకునేందుకు వీలు ప‌డుతుంది. పాల‌సీ తీసుకునేముందు హ‌డావిడిగా ఎంతో కొంత ప్రీమియం చెల్లించేలా ప్ర‌వ‌ర్తించ‌కూడ‌దు.

 ఆరోగ్య బీమా పాల‌సీ గురించి స‌మీక్ష‌

ఆరోగ్య బీమా పాల‌సీ గురించి స‌మీక్ష‌

చాలా మంది మొద‌ట్లో ఏదో ఒక పాల‌సీ తీసుకుని ఏటా దాన్నే రెన్యువ‌ల్ చేయిస్తూ ఉంటారు. అప్ప‌టి అవ‌స‌రాల ఆధారంగా పాల‌సీ బాగానే ఉంటుంది. పాల‌సీని ప్ర‌తి 3 ఏళ్లకోసారి స‌మీక్షించుకునే అవ‌స‌రం ఇప్పుడు ఏర్ప‌డింది. జీవితంలో ఇప్ప‌టికి ప్ర‌తి సంవ‌త్స‌రం కొన్ని మార్పులు వ‌స్తుంటాయి. మీరు ఉద్యోగం మారి ఉండొచ్చు, నివాసం ఉండే స్థ‌లం మారి ఉండొచ్చు. ప్ర‌తి చోటా వైద్య ఖ‌ర్చులు ఒకేలా ఉండ‌వు. కాబ‌ట్టి అప్పుడ‌ప్పుడు పాల‌సీ స‌మీక్ష చేసుకుని అవ‌స‌రాల‌కు త‌గ్గ పాల‌సీని ఎంచుకోవాలి. సంస్థ అందించే ఆరోగ్య బీమా పాల‌సీ ఉన్నా సొంత పాల‌సీ అవ‌స‌ర‌మో లేదో చూసుకోవాలి.

రెన్యువ‌బిలిటీ

రెన్యువ‌బిలిటీ

ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకునేట‌ప్పుడు ముందుగా దాన్ని జీవితాంతం వ‌ర్తించేలా చేసుకునేందుకు వీలుందో లేదో తెలుసుకోవాలి. చాలా మంది ఇప్పుడు బాగానే ఆరోగ్యంగా ఉన్నాం కదా ఇప్పుడెందుకు పాల‌సీ అని భావిస్తారు. అయితే మ‌న‌కు పాల‌సీ కావాల‌నుకున్న‌ప్పుడు ఎక్కువ ప్రీమియం రేట్లు చెల్లించాల్సి వ‌స్తుంద‌ని గుర్తుంచుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు 25 ఏళ్ల వ‌య‌సు ఉన్న వ్య‌క్తికి రూ.5 ల‌క్ష‌ల పాల‌సీకి ఇప్పుడు ప్రీమియం 5 వేలు అవుతుంద‌నుకుంటే 45 ఏళ్ల వ‌య‌సులో ఈ ప్రీమియం రూ.7 వేల‌కు పెర‌గొచ్చు.

 ఇత‌ర పాల‌సీల‌తో పోల్చి చూసుకోవాలి

ఇత‌ర పాల‌సీల‌తో పోల్చి చూసుకోవాలి

ఇప్పుడు ఏది కొనాల‌న్నా యువ‌త ముందు ఆన్‌లైన్‌లో శోధిస్తున్నారు. ఆరోగ్య బీమా పాల‌సీ విష‌యంలో సైతం ముందు ఇంట‌ర్నెట్లో బాగా పాల‌సీల గురించి తెలుసుకోవ‌డం మంచిది. మీకు ఏది స‌రిపోతుంద‌నేది మీరే తెలుసుకోవాలి. పాల‌సీ ఖ‌ర్చు, క‌లిగే ప్ర‌యోజ‌నాలు, గ‌ది అద్దె ఖ‌ర్చులు, స‌హ ప‌రిమితి చెల్లింపు, అంబులెన్స్ క‌వ‌రేజీ, ముంద‌స్తు వ్యాధులు, వెయిటింగ్ పీరియ‌డ్ ఆధారంగా పాల‌సీని ఎంచుకోవాలి.

 గ్రూపు ఇన్సూరెన్స్ ఉంటే తీసుకోవ‌డం మంచిదే

గ్రూపు ఇన్సూరెన్స్ ఉంటే తీసుకోవ‌డం మంచిదే

ఇప్పుడు చాలా కంపెనీలు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాల‌సీని అందిస్తున్నాయి. మీకు వ్య‌క్తిగ‌త పాల‌సీ ఉన్న‌ప్ప‌టికీ కుటుంబ స‌భ్యుల‌కు వ‌ర్తించే వెసులుబాటు ఉంటే గ్రూప్ ఇన్సూరెన్స్ పాల‌సీ తీసుకోవ‌డం సూచ‌నీయం. అయితే మొత్తంగా చూస్తే ఉద్యోగం చేసే వాళ్ల‌యినా, సొంత వ్యాపారుల‌యినా సొంత పాల‌సీ ఉండ‌టం మాత్రం ఈ రోజుల్లో మంచిది. ఉద్యోగుల‌కు సంస్థ క‌ల్పించే గ్రూప్ పాల‌సీ రెండో ప్రాధాన్య‌త కింద‌నే ప‌రిగ‌ణించాలి. ఎందుకంటే మీరు ఉద్యోగం మారినా, ప‌ద‌వీ విర‌మ‌ణ చేసినా ఈ పాల‌సీ మీకు తోడుండ‌దు.

 కుటుంబానికి అంత‌టికీ ఒక పాల‌సీ

కుటుంబానికి అంత‌టికీ ఒక పాల‌సీ

ఒకే ఫ్యామిలీ ప్లోట‌ర్ ప్లాన్ ఉంటే ఒక్కొక్క‌రికి ఒక పాల‌సీ తీసుకునే బాధ ఉండ‌దు. ఒకే దాని కింద కుటుంబ స‌భ్యులంద‌రికీ ఆరోగ్య ఖ‌ర్చుల‌ను క‌వ‌ర్ చేయ‌వ‌చ్చు. దీని వ‌ల్ల ప్రీమియం ఖ‌ర్చు త‌గ్గించిన‌వార‌వుతారు. పాల‌సీ వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను కుటుంబ స‌భ్యులంద‌రి కోసం వాడుకోవ‌చ్చు.

Read more about: insurance policy health insurance
English summary

ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకునేముందు ఇవి తెలుసుకోవ‌ల్సిందే... | What to see before Buying a Health Insurance Policy

A chronic or occasional health problem could not just affect your daily life but take a toll on your psychological well-being. Having a good health insurance cover is a must for you and your family to pay off the medical expenses.Here are a few ways to reduce the associated expenses of maintaining a health cover.
Story first published: Tuesday, June 27, 2017, 12:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X