For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ద్విచ‌క్ర వాహన బీమా - ముఖ్య విష‌యాలు: వాహ‌న బీమా ప‌రిధిలోకి వ‌చ్చే అంశాలు, రాని అంశాలు

|

భార‌త‌దేశంలో అన్ని వాహ‌నాలకు థ‌ర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది ఖ‌చ్చితంగా ఉండాలి. ఈ ర‌క‌మైన బీమాను ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు. రెన్యువ‌ల్ సైతం ఈ రెండు మార్గాల్లోను చేసుకోవ‌చ్చు. మీరు చెల్లించే ప్రీమియాన్ని నిర్ణ‌యించే కార‌కాలు చాలా ఉన్నాయి. ఒకే ర‌క‌మైన బీమా హామీ మొత్తానికి వివిధ కంపెనీలు వివిధ మొత్తాల్లో ప్రీమియాన్ని సేక‌రిస్తాయి.

two wheeler insurance policy

ద్విచ‌క్ర వాహ‌న బీమా ప‌రిధిలోకి వ‌చ్చే అంశాలు
ఈ కింది కార‌ణాల వ‌ల్ల వాహ‌నానికి క‌లిగే న‌ష్టం:

  • అగ్ని ప్ర‌మాదం/ వాహ‌న బీమా/వ‌ర‌ద‌లు/ తుపాను
  • ప్ర‌మాదం/ ఉగ్ర‌దాడి / అల్ల‌ర్లు / స‌మ్మె
  • బాహ్య ప్ర‌మేయం వ‌ల్ల జ‌రిగే ప్ర‌మాదం
  • రోడ్డు, రైలు, జ‌ల లేదా వాయు మార్గాల్లో తీసుకెళ్లేట‌ప్పుడు
  • స్వంతదారుకు,వాహ‌నం న‌డిపే వ్య‌క్తికి వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా

వాహ‌నంలో ప్ర‌యాణించేట‌ప్పుడు ప్ర‌మాదంలో గాయాలు అయినా లేదా మ‌ర‌ణం సంభ‌వించినా స్వంత‌దారుడికి- వాహ‌నం న‌డిపే వ్య‌క్తికి ప‌రిహారం చెల్లిస్తారు. ఈ వాహ‌నంలో ప్ర‌యాణం చేసేట‌ప్పుడు జ‌రిగే ప్ర‌మాదం హింసాత్మ‌కంగా, ప్ర‌మాద‌వ‌శాత్తూ, బాహ్య కార‌ణాల వ‌ల్ల జ‌రిగినా ప‌రిహారం చెల్లింపు వ‌ర్తిస్తుంది.

బాహ్య కార‌ణాల ద్వారా థ‌ర్డ్ పార్టీ శ‌రీర గాయాల‌కు క‌లిగే న‌ష్టానికి ప‌రిహారం:
(థ‌ర్డ్ పార్టీ బాడిలీ ఇంజురీ ల‌య‌బిలిటీ)
వాహ‌నం న‌డిపేట‌ప్పుడు అనుకోని కార‌ణాల వ‌ల్ల వేరే వ్య‌క్తికి క‌లిగే గాయాల‌కు లేదా ఇత‌రుల మ‌ర‌ణాల‌కు సంబంధించిన న‌ష్టాల‌ను పాల‌సీ ప‌రిమితి మేర‌కు చెల్లిస్తుంది.

ద్విచ‌క్ర వాహ‌న బీమా ప‌రిధిలోకి రాని అంశాలు:

  • వాహ‌నంలో సాధార‌ణ అరుగుద‌ల మూలంగా ప్ర‌మాదం జ‌రిగితే
  • వాహ‌నంలో కాలంతో పాటు జ‌రిగే త‌రుగుద‌ల మూలంగా జ‌రిగే న‌ష్టం లేదా ప్ర‌మాదానికి
  • ఎల‌క్ట్రిక‌ల్‌,మెకానిక‌ల్ బ్రేక్‌డౌన్‌
  • భార‌త‌దేశానికి వెలుప‌ల వాహ‌నానికి జ‌రిగే ప్ర‌మాదానికి చాలాసార్లు బీమా వ‌ర్తించ‌దు
  • మ‌ద్యం సేవించి వాహ‌నం న‌డుపుతుంటే జ‌రిగే న‌ష్టం లేదా ప్ర‌మాదం
  • స‌రైన డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహానాన్ని న‌డిపి ఉంటే ఆ వ్య‌క్తికి
  • అణు ప్ర‌మాదాల వ‌ల్ల క‌లిగే న‌ష్టం లేదా ప్ర‌మాదం
  • వాహ‌నాన్ని నిబంధ‌న‌ల ప్ర‌కారం వాడి ఉండ‌క‌పోతే

సాధార‌ణంగా మోటార్ పాల‌సీలు ఏడాది గ‌డువుకు తీసుకుంటారు. దీనిని తుది గ‌డువుకు ముందే రెన్యువ‌ల్ చేయించుకోవాలి. ఒక్కో బీమా కంపెనీ విధించే ప్రీమియంలు, అందించే సేవ‌లు భిన్నంగా ఉంటున్నందున వ్య‌క్తులు ఈ పాల‌సీల‌ను పోల్చి చూసుకోవాలి.
ప్రీమియం త‌క్కువ అని వెంట‌నే పాల‌సీని తీసుకునేందుకు ప్ర‌య‌త్నించ‌కూడ‌దు. మిన‌హాయింపులు, క‌వ‌రేజీ, ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ(ఐడీవీ) వంటి వాటిని చూసుకోవాలి. ఒక‌వేళ ప్రీమియం త‌క్కువ ఉండి, ఎక్కువ మిన‌హాయింపులు, త‌క్కువ క‌వ‌రేజీ, త‌క్కువ ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ(ఐడీవీ) ఉంటే క్లెయిం సెటిల్‌మెంట్ స‌మయంలో ఇబ్బందులు త‌ప్ప‌క‌పోవ‌చ్చు.

English summary

ద్విచ‌క్ర వాహన బీమా - ముఖ్య విష‌యాలు: వాహ‌న బీమా ప‌రిధిలోకి వ‌చ్చే అంశాలు, రాని అంశాలు | Inclusions and exclusions of Two wheeler insurance policy

In India, third party liability insurance is mandatory for all vehicles. Two wheeler insurance policy can be bought or renewed online and offline. There are many factors which determine the premium you will pay.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X