Tap to Read ➤
స్టాక్ మార్కెట్ సినిమా చూపించిందిగా
రూ.లక్షల కోట్లు ఆవిరయ్యాయ్ మరి
స్టాక్ మార్కెట్ ఇవ్వాళ ఇన్వెస్టర్లకు సినిమా చూపించింది.
దలాల్ స్ట్రీట్ దడదడలాడింది.
సెన్సెక్స్ 1,416.23 పాయింట్లు నష్టపోయింది. 52,792 వద్ద ట్రేడింగ్ ముగిసింది
నిఫ్టీదీ అదే దారి. నిఫ్టీ 430.90 పాయింట్లు నష్టపోయింది. 15,809 వద్ద ట్రేడింగ్ ముగిసింది.
ఇవ్వాళ్టి నష్టం విలువ రూ. 7 లక్షల కోట్ల రూపాయలకు పైమాటే
ఐటీ సెగ్మెంట్ షేర్లు మునిగాయి. విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్ స్టాక్స్ 6% పైగా క్షీణించాయి.
ఎల్ఐసీ, టీసీఎస్, టెక్ మహీంద్ర షేర్ల ధరలు 5 శాతం మేర దిగజారాయి.
టాటా స్టీల్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ 4 నుంచి 5 శాతం మేర నష్టపోయాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, మహీంద్ర అండ్ మహీంద్ర బజాజ్ ఫిన్సర్వ్ భారతి ఎయిర్టెల్ టాప్ లూజర్స్
ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, రెయిన్బో హాస్పిటల్స్ స్వల్పంగా లాభపడ్డాయి.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ద్రవ్యోల్బణ పరిస్థితులు స్టాక్ మార్కెట్స్పై ప్రభావం చూపాయి.