Tap to Read ➤

కొంపలు కూల్చుతున్న ఎల్ఐసీ

అక్షరాలా రూ.1.23 లక్షల కోట్లు నష్టం
Chandrasekhar Rao
ఎల్ఐసీ ఏ ముహూర్తంలో పబ్లిక్ ఇష్యూ జారీ చేసిందో గానీ.. అన్నీ అపశకునాలే
మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చిన వేళా విశేషం..నష్టాలు తప్ప లాభాల్లేకుండా పాయె
ఎల్ఐసీ షేర్ల ధరలు నానాటికీ పాతాళానికి దిగజారుతున్నాయి
ఇవ్వాళ ట్రేడింగ్ రూ.752.90 పైసల వద్ద ట్రేడ్ అయింది. కటాఫ్ ప్రైస్ రూ. 949.
లిస్టింగ్ నుంచి ఈరోజు వరకు ఒక్కో షేర్ మీద రూ.196 నష్టాన్ని మిగిల్చింది.
ఎల్ఐసీ షేర్ల ధరల పతనం ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. మరింత తగ్గొచ్చనేది అంచనా
ఎల్ఐసీ ఒక్కో షేర్ మీద సోమ, మంగళవారాల్లో వచ్చిన నష్టం రూ.49
లాంచింగ్‌కు ముందు.. ఓపెనింగ్ సమయంలో ఎల్ఐసీ ఐపీఓపై ఉన్న బజ్.. లిస్టింగ్‌తో నీరుగారింది
ఎల్ఐసీ ఇన్వెస్టర్లు ఇప్పట్లో లాభాలను కళ్లచూడలేరని మార్కెట్ వర్గాలు తేల్చి చెబుతున్నాయి
షేర్ల విషయంలో ఎల్ఐసీ.. మరో పేటీఎంలా మారిందనేది స్పష్టమౌతోంది
రూ.2,150 రూపాయల కటాఫ్ ధర ఉన్న పేటీఎం ఒక్కో షేర్ ధర ఇవ్వాళ 615.80 పైసల వద్ద ట్రేడ్ అయింది