For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాస్త ఓపిక.. ఇలా మీ కాంట్రిబ్యూషన్‌తో రూ.1.5 కోట్లకు చేరుకోవచ్చు

|

సాధారణంగా ఉద్యోగులు తమ శాలరీ స్లిప్‌లో వివిధ డిడక్షన్స్‌ను చూసినప్పుడు కాస్త నిరుత్సాహానికి గురి కావడం సహజం. వివిధ డిడక్షన్స్ వల్ల ఉద్యోగికి టేక్-హోమ్ శాలరీ తగ్గుతుంది. వేతన స్లిప్‌లో వివిధ తగ్గింపుల పట్ల ఎలా స్పందించినప్పటికీ, ఒక డిడక్షన్ మాత్రం కచ్చితంగా మిమ్మల్ని కోటీశ్వరుడని చేయవచ్చు. అదే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF).

ఈ కాంట్రిబ్యూషన్ కోటీశ్వరుడిని చేస్తుందంటే నమ్మశక్యం కానిదే. ఎందుకంటే మీ నెలవారీ ఆదాయం నుండి ప్రావిడెంట్ ఫండ్ కోసం కట్ అయ్యేది కొంత మొత్తమే. అంతేమొత్తం యజమాని వాటా కూడా పీఎఫ్‌కు వెళ్తుంది. అలాగే, ఈ మొత్తం పైన వచ్చే వడ్డీ రేటు అంత పెద్దది ఏమీ కాదు. ప్రతి నెల చిన్న మొత్తంగా కనిపించే ఈ పీఎఫ్ మొత్తం రిటైర్మెంట్ సమయానికి పెద్ద మొత్తంగా మీ చేతికి స్తుంది.

35 ఏళ్లలో రూ.1.65 కోట్లు

35 ఏళ్లలో రూ.1.65 కోట్లు

మీరు కాంపౌండింగ్ రూల్‌ను పరిగణలోకి తీసుకుంటే మీ ప్రావిడెంట్ ఫండ్ మీకు రూ.1.5 కోట్లకు పైగా ఆదాయం చేస్తుందని భావించవచ్చు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను పీఎఫ్ మొత్తం పైన వచ్చే వడ్డీ రేటు 8.5 శాతంగా ఉంది. బ్యాంకులు అందించే ఫిక్స్డ్ డిపాజిట్స్, మార్కెట్లోని ఇతర ప్రభుత్వ పథకాల కంటే ఈపీఎఫ్ వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఉన్న ఈ వడ్డీ రేటుతో నెలకు రూ.25,000 ప్రాథమిక వేతనం కలిగిన ఒక ఉద్యోగి 35 ఏళ్ల కాలంలో రూ.1.65 కోట్ల మేర కూడబెట్టవచ్చు. ఈపీఎఫ్ డిపాజిట్ పైన వచ్చే వడ్డీ పన్నురహితం కూడా.

మీ ఈపీఎఫ్ పెట్టుబడి రూ.1 కోటి కావాలంటే ఏంచేయాలి?

మీ ఈపీఎఫ్ పెట్టుబడి రూ.1 కోటి కావాలంటే ఏంచేయాలి?

మీరు రిటైర్మెంట్ అయ్యే వరకు మీ పీఎఫ్ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవడం చేయవద్దు. అలాగే, ఈపీఎఫ్ ఖాతాలో చేరిన అయిదు సంవత్సరాల లోపు ఈపీఎఫ్ నుండి డబ్బులు ఉపసంహరించుకుంటే పన్నులు ఉంటాయి. మీరు ఉద్యోగం మారితే కనుక పీఎఫ్ బ్యాలెన్స్‌ను కొత్త అకౌంట్‌కు ట్రాన్సుఫర్ చేసుకోవాలి. అంట్ మీరు నగదును ఉపసంహరించుకోవడానికి బదులు ట్రాన్సుఫర్ చేసుకోవడం మంచిది.

ఎవరేం చెబుతున్నారంటే

ఎవరేం చెబుతున్నారంటే

'భారత దేశంలో దీర్ఘకాలంలో సగటు ద్రవ్యోల్భణం దాదాపు ఆరు శాతంగా పరిగణిస్తున్నారు. అదే సమయంలో ఈపీఎఫ్ పైన వచ్చే రిటర్న్స్ 8.5 శాతంగా ఉన్నాయి. ఈపీఎఫ్ అనేది వేతనం తీసుకునే వ్యక్తుల కోసం పరిమిత పెట్టుబడి మార్గాల్లో ఒకటి. ఇది ద్రవ్యోల్భణం విశిష్టతను అధిగమించడానికి, తగినంత పదవీ విరమణ కార్పస్‌ని నిర్మించడానికి ఇది ఉపయోగపడుతుంది. పెద్ద మొత్తంలో సంపదను దీర్ఘకాలంలో నిర్మించాలంటే ప్రారంభ సంవత్సరాల్లో ఈపీఎఫ్ నుండి వైదొలగడం నుండి దూరం జరగాలి' అని ఫినాలజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫ్రంజాల్ కమ్రా అన్నారు.

'ఈపీఎఫ్ పెట్టుడుల ముఖ్య ప్రయోజనాల్లో ఒకటి మూలం వద్ద మైక్రో డిడక్షన్‌లా ఉంటుంది. ఇది గృహ ఆదాయంలో పెద్దగా ప్రభావం చూపదని, అదే సమయంలో రాబడులు ద్రవ్యోల్భణ రక్షణను మాత్రమే కాకుండా అత్యవసర సమయంలో ఆదుకుంటాయ'ని భూటా షా అండ్ కో ఎల్ఎల్‌పీ భాగస్వామి జే ఝవేరీ అన్నారు.

'వారు(ఈపీఎఫ్ కాంట్రిబ్యూటర్స్) సరిగ్గా అర్థం చేసుకుంటే వారు క్రమంగా రిటైర్మెంట్ వైపు వెళ్తున్నట్లేనని, ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ ఇండివిడ్యువల్స్‌కు ఎంతో అండగా ఉంటుంది. చౌక రుణాలు, ఇంటి కొనుగోలు కోసం ఉపయోగించడం వంటి సందర్భాల్లో, అత్యవసర సమయాల్లో పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఉపయోగించుకుంటే ఇది ప్రయోజనం. ' అని తెలిపారు.

బీమా ప్రయోజనాలతో పాటు ఈపీఎఫ్ అత్యంత ప్రయోజనకరమైన సేవింగ్స్ పథకాల్లో ఒకటి అని నిపుణులు చెబుతారు. స్థిరత్వం, భద్రత విషయానికి వస్తే ఇది మంచిపెట్టుబడిగా చెబుతున్నారు.

English summary

You can get over Rs 1.5 crore with your monthly EPF contributions

If you consider the compounding rule, your Provident Fund can save you a lumpsum amount of over Rs 1.5 crore when you hang up your boots.
Story first published: Tuesday, August 10, 2021, 16:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X