For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చేతిలో డబ్బు లేదా? క్రెడిట్‌కార్డ్ అవసరమేలేదు.. ఇలా రూ.1 లక్ష వరకు వడ్డీ లేని రుణం!

|

ఇటీవలి కాలంలో 'ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి' (buy now pay later-BNPL) అని చెబుతూ చాలా మొబైల్ యాప్స్ భారతీయ మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ యాప్స్ క్రెడిట్ కార్డ్స్ మాదిరిగా పని చేస్తాయి. ఈ BNPL వినియోగదారులకు విద్యుత్ బిల్లులు, ఆహారం, షాపింగ్ వంటి ఉత్పత్తులు, సేవల కోసం ముందస్తుగా చెల్లించేందుకు తక్షణ క్రెడిట్‌ను అందిస్తాయి. ఈ పద్ధతిలో కస్టమర్లు నగదు కొరత గురించి ఆందోళన చెందకుండా వారి రోజువారీ ఖర్చులను తీర్చుకోవడానికి సులభమైన, శీఘ్ర విధానాన్ని అందిస్తోంది. భారత్‌లో పలు యాప్స్ 'ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి' అంటూ నెటిజన్ల ముందుకు వచ్చాయి. వాటిలో....

లేజీ పే (Lazy Pay)

లేజీ పే (Lazy Pay)

లేజీపే యాప్ ద్వారా రూ.1 లక్ష వరకు పర్సనల్ లోన్‌ను పొందవచ్చు. మీ క్రెడిట్ లిమిట్ ఎంతనో తెలుసుకోవడానికి మీకు సంబంధించిన ప్రాథమిక సమాచారం ఇవ్వవలసి ఉంటుంది. ఇందులోని ప్రయోజనాల్లో మీరు రూ.1 లక్ష మొత్తమే కాదు, రూ.10,000 లేదా రూ.20,000 వంటి తక్కువ మొత్తాల కోసం కూడా పర్సనల్ లోన్ కింద దరఖాస్తు చేసుకోవచ్చు. మీ క్రెడిట్ లిమిట్ వరకు ఎంత అయితే అంత లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

పేయూ ఫైనాన్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ లేజీపే టెక్నాలజీ ప్లాట్‌ఫాంతో ముందుకు వచ్చింది.

పోస్ట్ పే (Postpe)

పోస్ట్ పే (Postpe)

'ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి'తో ముందుకు వచ్చిన మరో షాపింగ్, పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ పోస్ట్‌పే. ఈ యాప్ ద్వారా ఏ ఉత్పత్తిని అయినా ముందుగా కొనుగోలు చేసి, తర్వాత చెల్లించవచ్చు. ఈ యాప్ మీకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇస్తుంది. అంతేకాదు, మీ నెలవారీ ఖర్చులను ట్రాక్ చేయడంలో మీకు సహకరిస్తుంది.

పోస్ట్‌పే యాప్‌ను ఇండియన్ ఫిన్‌టెక్ సంస్థ భారత్ పే లాంచ్ చేసింది. యూపీఐ పేమెంట్స్ కోసం క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేయడంలో మార్కెట్ లీడర్‌గా ఉంది భారత్ పే.

పేటీఎం పోస్ట్‌పెయిడ్ (PayTM Postpaid)

పేటీఎం పోస్ట్‌పెయిడ్ (PayTM Postpaid)

ఫిన్‌టెక్ సంస్థల్లో భారత్‌లో పేటీఎం మార్కెట్ లీడర్‌గా ఉంది. ప్రారంభంలో ఇది మొబైల్ యాప్ డెయిలీ పేమెంట్ యాప్, డిజిటల్ వ్యాలెట్‌గా వచ్చింది. 2015లో పేమెంట్ బ్యాంకులోకి అడుగు పెట్టింది.

పేటీఎం పోస్ట్‌పెయిడ్ సదుపాయం నిర్దిష్ట వ్యాపారి వెబ్ సైట్ లేదా పేటీఎం ప్లాట్‌ఫాం చెల్లింపులను ఆమోదించే దుకాణాల నుండి ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్‌లో చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు 30 రోజుల పాటు సున్నా శాతం వడ్డీతో రూ.60,000 వరకు క్రెడిట్ పొందవచ్చును. పేటీఎం పోస్ట్ పెయిడ్ సదుపాయాన్ని పొందడం అనేది పూర్తి డిజిటల్ ప్రక్రియ.

అమెజాన్ పే లాటర్ (Amazon Pay Later)

అమెజాన్ పే లాటర్ (Amazon Pay Later)

అమెజాన్ పే ఈఎంఐ సేవలను అమెజాన్ పేలాటర్‌గా పేరు మార్చారు. అమెజాన్ డాట్ ఇన్ ఈఎంఐ కొనుగోలుకు ఇది వేగవంతమైన ప్రక్రియ. వన్ టైమ్ సెటప్ ప్రాసెస్ ద్వారా రెండు నిమిషాల్లో దీనిని పూర్తి చేయవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ పే లాటర్ (Flipkart Pay Later)

ఫ్లిప్‌కార్ట్ పే లాటర్ (Flipkart Pay Later)

ఫ్లిప్‌కార్ట్ పే లాటర్ ద్వారా తమ కస్టమర్లకు ముందుగా కొనుగోలు చేసి, తర్వాత చెల్లింపులు జరిపే సౌకర్యాన్ని అందిస్తోంది. ఇందులో క్రెడిట్ లిమిట్ రూ.70,000 వరకు ఉంది. కస్టమర్లు తమ ప్లాట్ ఫామ్ పైన క్రెడిట్ కార్డ్ లేకుండా కూడా కొనుగోలు చేసే సౌకర్యాన్ని అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్‌లో చెకౌట్ ప్రక్రియలో ఆలస్యం జరగకుండా నిరోధించేందుకు కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ పే లాటర్‌ను ఉపయోగించవచ్చు. ఉత్పత్తులను కొనుగోలు చేసే కస్టమర్లు ఆ మొత్తాన్ని వచ్చే నెల 5వ తేదీ లోపు చెల్లించాలి. ఇందుకు గాను ఎలాంటి అదనపు ఛార్జీ ఉండదు. ఫ్లిప్‌కార్ట్ పేతో మీ బిల్స్‌ను ట్రాక్ చేయడం చాలా సులభం.

మొబిక్విక్ జిప్ పే (Mobikwik ZIP pay)

మొబిక్విక్ జిప్ పే (Mobikwik ZIP pay)

పేటీఎం వలె మొబిక్విక్ మరో మొబైల్ వ్యాలెట్. పేటీఎం వలె పేమెంట్ బ్యాంక్స్‌ను ఆపరేట్ చేయడానికి లైసెన్స్ ఇవ్వరు. దేశంలో ప్రసిద్ధి చెందిన ఫిన్ టెక్ మొబిక్విక్. మొబిక్విక్ అత్యంత సమర్థవంతమైన, ప్రయోజనకరమైన స్వదేశీ ఫిన్ టెక్ బ్రాండ్‌గా పేరు పొందింది. దేశవ్యాప్తంగా 120 మిలియన్లకు పైగా కస్టమర్లు ఉన్నారు.

మొబిక్విక్ జిప్ పే ద్వారా సున్నా శాతం వడ్డీతో రూ.30,000 వరకు క్రెడిట్ పరిమితి కలిగి ఉంది. ఇది కూడా డిజిటల్ క్రెడిట్ కార్డు. క్రెడిట్ కార్డుకు సమానం. ఈ క్రెడిట్ పర్క్స్‌ను పొందేందుకు మీరు తప్పనిసరిగా మొబిక్విక్ యాప్‌లో నమోదు చేసుకోవాలి. అలాగే జిప్ ఫీచర్‌ను యాక్టివేట్ చేయాలి. మీరు తీసుకున్న క్రెడిట్ మొత్తం వెంటనే మీ డిజిటల్ వ్యాలెట్‌లో క్రెడిట్ అవుతుంది.

BNPLకు ఆదరణ అందుకే

BNPLకు ఆదరణ అందుకే

BNPL యాప్స్ వినియోగం కస్టమర్లను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఎందుకంటే బ్యాంకుల వలె ఎక్కువగా లేట్-ఫీ, వడ్డీ రేట్లను విధించడం లేదు. క్రెడిట్ కార్డ్ రావాలంటే వేతనం, వ్యాపారం, సిబిల్ స్కోర్, చెల్లింపు సామర్థ్యం.. ఇలా ఎన్నింటినో పరిగణలోకి తీసుకుంటారు. అయితే buy now pay later అయితే ప్రాథమిక సమాచారాన్ని తీసుకొని, రుణాలు ఇస్తుంటాయి. ఈజీ రుణ దరఖాస్తు, అంతగా రిస్క్ లేని ప్రక్రియ, తక్కువ ఛార్జీ వంటివి ఉన్నాయి. దీంతో ఇవి ఆదరణ పొందుతున్నాయి.

English summary

What Are Buy Now And Pay Later Apps? How They Are Disrupting The Credit Card?

In recent years, a number of buy now pay later (BNPL) mobile apps in India have emerged on the Indian market. These apps work in a similar way to credit cards in that they give users an immediate credit line that customers can use to pay for goods and services like energy bills, food, and shopping. This method provides customers with a simple and quick approach to meet their daily expenses without having to worry about running out of cash.
Story first published: Friday, December 10, 2021, 10:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X