For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్టుబడులు ఎన్నో రకాలు: లక్ష్యం, రిటర్న్స్ ఆధారంగా పోర్ట్‌పోలియో

|

పెట్టుబడి అంటే స్టాక్ మార్కెట్, బంగారం, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్‌లు, బ్యాంకు ఉత్పత్తులు, ఆప్షన్స్, యాన్యుటీలు, రిటైర్మెంట్, ఎడ్యుకేషన్ సేవింగ్స్, రియల్ ఎస్టేట్, హౌసింగ్.. ఇలా ఎన్నో ఉంటాయి. ఇందులో కొన్ని పెట్టుబడులు రిస్క్‌తో కూడినవి అయితే, మరికొన్ని గ్యారెంటీ హామీ ఉంటుంది. రిస్క్‌తో కూడుకున్నవి అయితే అధిక రిటర్న్స్ ఇవ్వవచ్చు, గ్యారెంటీ హామీ అయితే తక్కువ రిటర్న్స్ ఉండవచ్చు. అలాగే, మన స్వల్పకాలిక, దీర్ఘకాలిక, మధ్యకాలిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టాలి. అలాగే, ఆయా ఏ పోర్ట్ పోలియోలో ఎంత ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలనే విషయం కూడా తెలుసుకోవాలి.

పెట్టుబడి రకాలు

పెట్టుబడి రకాలు

పెట్టుబడి పెట్టడానికి ఎన్నో సాధనాలు ఉన్నాయి. రిస్క్ తీసుకుంటే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు వంటివి ఉన్నాయి. రిస్క్ వద్దనుకుంటే FD, RD వంటి బ్యాంకు ఉత్పత్తులు, రిటైర్మెంట్, ఎడ్యుకేషన్ సేవింగ్స్, బాండ్లు, గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్, ఇన్సురెన్స్ ప్లాన్, ప్రావిడెంట్ ఫండ్ వంటివి ఉంటాయి. రిస్క్ కానప్పటికీ మార్కెట్‌కు అనుగుణంగా ఎత్తుపల్లాలు చూసే పెట్టుబడులు ఉంటాయి. అయితే వీటిలో రిస్క్ కానప్పటికీ మనకు అవసరానికి ఉపయోగపడే సమయంలో క్షీణించే అవకాశం ఉంటుంది. కానీ కొంతకాలానికి మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఉదాహరణకు రియల్ ఎస్టేట్ లేదా ప్రాపర్టీ. ఇందులో మంచి రిటర్న్స్ ఉంటాయి. కానీ కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో అవసరానికి తక్కువ రిటర్న్స్ రావొచ్చు. ఇక ఆప్షన్స్, యాన్యుటీస్ వంటివి కూడా ఉన్నాయి. ఇనిషియల్ కాయిన్ ఆఫరింగ్స్, క్రిప్టో కరెన్సీ ఉన్నాయి.

లక్ష్యాలకు అనుగుణంగా

లక్ష్యాలకు అనుగుణంగా

పెట్టుబడి పెట్టడం కొత్తగా ప్రారంభిస్తే, రిస్క్ వద్దనుకుంటే బ్యాంకు ఉత్పత్తులు, ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు బెస్ట్. కానీ వీటిలో తక్కువ రిటర్న్స్ ఉంటాయి. రిస్క్ తీసుకోవాలనుకుంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ వంటి వాటిని చూడవచ్చు. అయితే ఈ పెట్టుబడుల విషయంలోను జాగ్రత్త అవసరం. ఒక్కో పోర్ట్ పోలియోలో మన పెట్టుబడిలో కొంత శాతాన్ని కేటాయించాలి. అలాగే మన లక్ష్యాలకు అనుగుణంగా అవి ఉండేలా చూసుకోవాలి.

పోర్ట్ పోలియో

పోర్ట్ పోలియో

రెండు మూడు ఉత్పత్తుల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ పెట్టుబడి మొత్తంలో 60 శాతాన్ని ఈక్విటీలు, 40 శాతాన్ని ఫిక్స్డ్ ఇన్‌కం పైన ఇన్వెస్ట్ చేయాలి. 60 శాతం ఈక్విటీలకు సంబంధించి కూడా మళ్లీ ముక్కలు చేయాలి. కంపెనీ చరిత్ర, మున్ముందు ఆ రంగానికి ఎలాంటి భవిష్యత్తు ఉందో తెలుసుకొని, ఇన్వెస్ట్ చేయాలి. ఉదాహరణకు మీ పెట్టుబడి పోర్ట్ పోలియో 100 శాతం అయితే బంగారంపై 20 శాతం, రియాల్టీ లేదా ప్రాపర్టీపై 20 శాతం, స్టాక్స్‌లో 25 శాతం, బ్యాంకింగ్ ఉత్పత్తులపై 30 శాతం ఇలా ఇన్వెస్ట్ చేయాలి.

English summary

పెట్టుబడులు ఎన్నో రకాలు: లక్ష్యం, రిటర్న్స్ ఆధారంగా పోర్ట్‌పోలియో | Types of investments and consider for your portfolio

There are five to ten main investment types, or asset classes, that you can choose from, each with distinct characteristics, risks and benefits.
Story first published: Wednesday, April 20, 2022, 10:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X