For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

1% వడ్డీ తగ్గింది.. కానీ PPF రుణం తీసుకోవచ్చా? కారణాలు ఇవే

|

వివిధ అవసరాల కోసం ఉద్యోగస్తులు రుణాలు తీసుకోవడం సహజం. చాలామంది PPF (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్)పై లోన్ తీసుకుంటారు. అత్యవసరమైతే తప్ప పీపీఎఫ్‌పై రుణం తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు ముఖ్యంగా మూడు కారణాలు చెబుతున్నారు.

కరోనా వైరస్ ఎఫెక్ట్: అలీబాబా ఆందోళన, తట్టుకునే శక్తి ఉందా అంటే?

వడ్డీ రేటు 1 శాతం తగ్గింది కానీ..

వడ్డీ రేటు 1 శాతం తగ్గింది కానీ..

గత ఏడాది డిసెంబర్ నెలలో ప్రావిడెంట్ ఫండ్ నిబంధనలలో కొన్ని మార్పులు చేసింది ప్రభుత్వం. అలాంటి మార్పుల్లో ఒకటి PPF ఖాతాలకపై తీసుకున్న రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు మార్పు. పీపీఎఫ్‌పై తీసుకునే రుణంపై వడ్డీ రేటు డిసెంబర్ 12, 2019 నుండి మారింది. రుణాలపై వడ్డీ 2 శాతం నుండి 1 శాతానికి తగ్గించింది.

వడ్డీ ఇలా భారం..

వడ్డీ ఇలా భారం..

1 శాతం రుణం చూసేందుకు ఆకర్షణీయంగానే కనిపిస్తోంది. వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పటికీ తొలి ప్రియారిటీగా పీపీఎఫ్ లోన్‌కు వెళ్లకూడదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం పీపీఎఫ్ ఖాతాపై వడ్డీ రేటు 7.9 శాతంగా ఉంది. రుణం తీసుకుంటే ఇది రాకుండా పోతుంది. అప్పుడు వడ్డీ రేటు 1 శాతం కలుపుకొని మొత్తం 8.9 శాతానికి చేరుకుంటుంది.

వడ్డీ రాదు.. పన్ను ప్రయోజనం కోల్పోతారు

వడ్డీ రాదు.. పన్ను ప్రయోజనం కోల్పోతారు

మీరు పీపీఎఫ్ ఖాతాపై రుణం తీసుకుంటే... మీరు తీసుకున్న మొత్తం చెల్లించే వరకు పీపీఎఫ్ బ్యాలెన్స్‌పై వడ్డీని కోల్పోతారు. పన్ను మినహాయింపు ప్రయోజనం కోల్పోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇలా రుణాలు తీసుకుంటే పన్ను ప్రయోజనాలు కోల్పోవడం ఉంటుంది.

25 శాతం లోన్

25 శాతం లోన్

రుణం తీసుకున్నందున కాంపౌండింగ్ బెనిఫిట్ మిస్ అవుతారు. వడ్డీ మీ ఖాతాలో జమ అవుతుంది. దీర్ఘకాలంలో కాంపౌండింగ్ బెనిఫిట్ లభిస్తుంది. రుణం తీసుకుంటే దానిని కోల్పోతారు. PPF ఖాతా తెరిచిన మూడో ఏడాది, ఆరో ఏడాది మధ్య రుణం లభిస్తుంది. పీపీఎఫ్ పైన 25 శాతం లోన్ మాత్రమే లభిస్తుంది.

రుణం తక్కువ..

రుణం తక్కువ..

ఉదాహరణకు మీరు 2015-16లో పీపీఎఫ్ ఖాతాను తెరిచి, ప్రతి ఏడాది రూ.1.5 లక్షలు డిపాజిట్ చేస్తుంటారు. 2019-20 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి మీ పీపీఎఫ్ అకౌంటులో రూ.9.5 లక్షలు ఉంటుంది. మీరు రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే మీకు రూ.1.35 లక్షల రుణం (25 శాతం, అంటే 2017-18 నాటికి మొత్తం రూ.5.25 శాతంలో 25 శాతం) వస్తుంది. ఇది చాలా తక్కువ. షార్ట్ టర్మ్ లోన్ కోసం ఇతర మార్గాల్లో వెళ్తే బెట్టర్ అని అంటున్నారు.

English summary

Three reasons why you should not take a loan against your PPF account

గత ఏడాది డిసెంబర్ నెలలో ప్రావిడెంట్ ఫండ్ నిబంధనలలో కొన్ని మార్పులు చేసింది ప్రభుత్వం. అలాంటి మార్పుల్లో ఒకటి PPF ఖాతాలకపై తీసుకున్న రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు మార్పు. పీపీఎఫ్‌పై తీసుకునే రుణంపై వడ్డీ రేటు డిసెంబర్ 12, 2019 నుండి మారింది. రుణాలపై వడ్డీ 2 శాతం నుండి 1 శాతానికి తగ్గించింది. 1 శాతం రుణం చూసేందుకు ఆకర్షణీయంగానే కనిపిస్తోంది. వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పటికీ తొలి ప్రియారిటీగా పీపీఎఫ్ లోన్‌కు వెళ్లకూడదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
Story first published: Friday, February 14, 2020, 14:49 [IST]
Company Search