For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ స్టాక్స్ కొంటే త్వరలో బోనస్, మరి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చా?

|

కరోనా తర్వాత స్టాక్స్‌లోకి రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరిగాయి. చేతిలో డబ్బులు ఉంటే స్టాక్స్ లేదా బంగారం లేదా ఫిక్స్డ్ డిపాజిట్... ఇలా వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ప్రముఖ బ్రోకరింగ్ ఏజెన్సీలు అప్పుడప్పుడు వివిధ స్టాక్స్‌ను సూచిస్తుంటాయి. మార్కెట్ పైన అవగాహన ఉంటే ఎప్పుడు ఏ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోవడం సులువైన విషయమే. ఇక్కడ కొన్ని స్టాక్స్‌ను పేర్కొన్నాము. ప్రస్తుతం ఈ స్టాక్స్‌లో బోనస్ అందుబాటులో ఉంది. మీరు ఇప్పుడు అది కొనుగోలు చేస్తే బోనస్ అందుకోవచ్చు. ఈ బోనస్ షేర్లలో ఎక్కువ భాగం సెప్టెంబర్ 2021లోనే ఉన్నాయి.

బోనస్ ఇస్తున్న స్టాక్స్ ఇవే...

- Sportking India - ఎక్స్-బోనస్ డేట్ Sept 23 - రికార్డ్ డేట్ Sept 24,
- GEE Ltd - ఎక్స్-బోనస్ డేట్ Sept 21 - రికార్డ్ డేట్ Sept 22,
- TPL Plastech - ఎక్స్-బోనస్ డేట్ Sept 16 - రికార్డ్ డేట్ Sept 18,
- APL Apollo - ఎక్స్-బోనస్ డేట్ Sept 16 - రికార్డ్ డేట్ Sept 18,
- Kanpur Plast - ఎక్స్-బోనస్ డేట్ Sept 15 - రికార్డ్ డేట్ Sept 16,
- Apollo Tricoat - ఎక్స్-బోనస్ డేట్ Sept 16 - రికార్డ్ డేట్ Sept 18,
- ACE Integrated - ఎక్స్-బోనస్ డేట్ Oct 7 - రికార్డ్ డేట్ Oct 8

ఈ స్టాక్స్ కొంటే త్వరలో బోనస్, మరి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చ

అయితే స్టాక్స్‌లో పెట్టబడి పెట్టడానికి ముందు ఆ కంపెనీ ప్రాథమికాలను, ఇతర అంశాలను విశ్లేషించాల్సిన అవసరం ఉంది. కేవలం బోనస్ ఇష్యూ ఆధారంగా పెట్టుబడి పెట్టరాదు. పైన పేర్కొన్న కారణం ఏమంటే ఆ కంపెనీలు బోనస్ ప్రాతిపదికన అందుబాటులో ఉన్నాయని మాత్రమే. అంతేకానీ, ఈ స్టాక్స్‌ను సిఫార్స్ చేయడం లేదనే విషయం గుర్తించాలి.

ఇక, బోనస్ అంశాన్ని పక్కన పెడితే ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం పరిమితం చేయాలి. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లు ఆల్ టైమ్ గరిష్టం వద్ద ఉన్నాయి. ఎప్పుడైనా ప్రాఫిట్ బుకింగ్ లేదా ఇతర అంశాలతో సూచీలు కిందకు పడిపోయే అవకాశాలను కొట్టి పారేయలేం. బలమైన లిక్విడిటీ కారణంగా కరోనా తర్వాత, ముఖ్యంగా గత రెండు నెలలుగా సెన్సెక్స్, నిఫ్టీలు ఆకాశాన్ని అంటేలా పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం దాదాపు అన్ని కంపెనీలు కూడా ఆల్ టైమ్ గరిష్టం వద్దే ఉన్నాయి. ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ తాజా నివేదిక ప్రకారం సెన్సెక్స్ దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే భారీగా జంప్ చేసింది.

నిఫ్టీ 19 ట్రేడింగ్ సెషన్‌లలో 16,000 పాయింట్ల నుండి 17,000 పాయింట్లకు పెరిగింది. నిఫ్టీ 1000 పాయింట్ల మైల్ స్టోన్ విషయానికి వస్తే అత్యంత వేగంగా ఈ మైలురాయి ఇదే. ఇక, ఈ నిఫ్టీ వెయ్యి పాయింట్లలో HDF బ్యాంకు, రిలయన్స్, టీసీఎస్ వంటి దిగ్గజాల వాటా దాదాపు 50 శాతం వరకు ఉంది. అంటే 16,000 పాయింట్ల నుండి 17,000 పాయింట్లకు ఇంత వేగంగా చేరుకోవడానికి కారణం ఈ దిగ్గజ సంస్థల పాత్రే ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయడానికి ముందు ఆలోచించాలి.

మోతీలాల్ ఓస్వాల్ స్ట్రాటెజీ నివేదిక ప్రకారం మార్కెట్ క్యాప్ టు జీడీపీ రేషియో 111 శాతంగా ఉంది. 2007 నుండి కూడా ఇది అత్యధికం. ఐటీ, కన్స్యూమర్ వ్యాల్యుయేషన్ పదిహేనేళ్ల గరిష్టం వద్ద ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించాలని, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.

పైన పేర్కొన్న స్టాక్స్‌లో స్పోర్ట్‌కింగ్ ఇండియా షేర్ ధర ప్రస్తుతం రూ.4,968.95 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 5 శాతం (రూ.236) ఎగబాకింది. ఆరు నెలల కాలంలో 424 రెట్లు, ఏడాది కాలంలో అయితే 1451 రెట్లు ఎగిసిపడింది.

జీఈఈ లిమిటెడ్ స్టాక్ ప్రస్తుతం 2.67 శాతం లేదా రూ.2.25 ఎగిసి రూ.86.50 వద్ద ఉంది. ఆరు నెలల కాలంలో 124.38 శాతం, ఏడాది కాలంలో అయితే 215.12 శాతం లాభపడింది.

టీపీఎల్ ప్లాస్‌టెక్ షేర్ ధర ప్రస్తుతం 0.50 శాతం లేదా రూ.1.75 క్షీణించి రూ.349.05 వద్ద ఉంది. ఆరు నెలల కాలంలో 122.40 శాతం, ఏడాది కాలంలో అయితే 190.27 శాతం లాభపడింది.

ఏపీఎల్ అపోలో షేర్ ధర ప్రస్తుతం 0.77 శాతం లేదా రూ.14.50 క్షీణించి రూ.1,865.00 వద్ద ఉంది. ఆరు నెలల కాలంలో 62.95 శాతం, ఏడాది కాలంలో అయితే 248.57 శాతం లాభపడింది.

షేర్ ధర ప్రస్తుతం 2.76 శాతం లేదా రూ.7.00 ఎగిసి రూ.260.20 వద్ద ఉంది. ఆరు నెలల కాలంలో 68.41 శాతం, ఏడాది కాలంలో అయితే 106.51 శాతం లాభపడింది.

అపోలో ట్రైకోట్ షేర్ ధర నేడు 0.27 శాతం లేదా రూ.4.65 తగ్గి రూ.1,741.00 వద్ద ఉంది. ఆరు నెలల కాలంలో 62.68 శాతం, ఏడాది కాలంలో అయితే 202.89 శాతం లాభపడింది. ఏస్ ఇంటిగ్రేటెడ్ షేర్ కూడా భారీగానే ఎగిసింది.

ఈక్విటీ, ఫండ్స్‌లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. ఆర్థిక నష్టాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పెట్టుబడిదారులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్వెస్ట్ చేసే ముందు నిపుణుల సలహాలు తీసుకోవాలి. బ్రోకరేజీ ఆధారంగా కాకుండా స్టాక్స్ పైన పూర్తి అవగాహనతో ఇన్వెస్ట్ చేయాలి. పైన పేర్కొన్న స్టాక్స్ బోనస్ ఆఫర్ చేస్తున్నవి. అంతేకానీ వీటిని కొనుగోలు చేయమని సిఫార్సు చేస్తున్నట్లు కాదు.

English summary

These stocks available on A Bonus basis, Should you buy these stocks?

We have listed a set of stocks, where there is bonus that is available currently on the stocks, should you buy the same now. Most of these bonus shares are for the month of September 2021.
Story first published: Monday, September 13, 2021, 16:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X