For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఈ సూత్రాలు చూడండి

|

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. వీటిలో ఇన్వెస్ట్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతర్జాతీయ, జాతీయ, దేశ, అంతర్జాతీయ రాజకీయ తదితర పరిణామాలపై సూచీలు ఆధారపడతాయి. ఉదాహరణకు పదమూడు, పద్నాలుగేళ్ల క్రితం ఆర్థిక సంక్షోభం, 2020లో కరోనా మహమ్మారి స్టాక్ మార్కెట్ పైన ప్రభావం చూపిన అంశాలు గుర్తుంచుకోవాలి. కరోనా కారణంగా 2020 ఫిబ్రవరిలో 42,000 పాయింట్ల సమీపంలో ఉన్న సెన్సెక్స్ 2020 మార్చి చివరి నాటికి 26,000 దిగువకు పడిపోయింది. అయితే ఆ తర్వాత ఆర్థిక రికవరీ నేపథ్యంలో సూచీలు క్రమంగా కోలుకున్నాయి. దీంతో నవంబర్ నెలలో 62,000 పాయింట్ల పైకి చేరుకోగా, ప్రస్తుతం ఒమిక్రాన్ కారణంగా 59,000 స్థాయిలో ఉన్నాయి. అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి అప్రమత్తత, పూర్తి అవగాహన అవసరం. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారి కోసం కొన్ని షార్ట్ రూల్స్...

గుడ్డిగా అనుసరించవద్దు

గుడ్డిగా అనుసరించవద్దు

- అంతర్జాతీయంగా సక్సెస్ పెట్టుబడిదారు ఎవరంటే వారెన్ బఫెట్ పేరు వినిపిస్తుంది. దేశీయంగా రాకేష్ ఝున్‌ఝున్‌నవాలా పేరు చెబుతారు. వారు విజవయంతమైన ఇన్వెస్టర్లు కావొచ్చు. కానీ పరిమిత వనరులు కలిగిన రిటైల్ ఇన్వెస్టర్లకు ఇది సరితూగదని చెప్పవచ్చు. కాబట్టి గుడ్డిగా వారిని ఫాలో కావడం సరికాదు. వారి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పరిశీలిస్తూ, వాటిపై మన పూర్తి అవగాహనతో పెట్టుబడి పెట్టాలి.

- సమర్థవంతమైన కంపెనీని లేదా కంపెనీ ఆధ్వర్యంలోని స్టాక్స్‌ను గుర్తించాలి. సుదీర్ఘకాలంగా మంచి రిటర్న్స్ లేదా సమర్థంగా నిర్వహించే కంపెనీలు ఉంటాయి.

- స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి పూర్తి అవగాహన కలిగి ఉండటం మంచిది. స్టాక్ మార్కెట్ పెద్ద ఆర్థిక చక్రవ్యూహం వంటిది. ఇందులోకి ఎంటర్ కావడం సులభంగా అనిపించవచ్చు. కానీ అందులో రిస్క్ ఉంటుంది. అలాగే నిష్క్రమించడం కూడా కష్టమే.

నిపుణుల సలహాలు సరే కానీ

నిపుణుల సలహాలు సరే కానీ

- కనీస ప్రభుత్వ హోల్డింగ్స్, జోక్యం, నియంత్రణ లేదా పర్యవేక్షణ కలిగిన కంపెనీలో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయడం మంచిది. సెలబ్రిటీలతో పెట్టుబడుల కోసం ప్రయత్నించే వాటి పట్ల అధిక శ్రద్ధ వహించాలి.

- దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవచ్చు. కానీ స్టాక్ బ్రోకర్లను గుడ్డిగా వాటిని విశ్వసించవద్దు. మనకు కూడా స్టాక్ మార్కెట్ పైన అవగాహన అవసరం. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం స్టాక్ బ్రోకర్ల పైనే పూర్తిగా ఆధారపడి ఆర్థిక చిట్కాల కోసం ఆధాపరపడవద్దు.

- మార్కెట్ నిపుణులు ఎవరైనా వివిధ మీడియాల ద్వారా నిర్దిష్ట స్క్రిప్‌ను బలమైన కొనుగోలుగా సిఫార్స్ చేస్తే దానిపై ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. చెప్పిందే తడవుగా అనుసరించవద్దు.

మిడిమిడి వద్దు..

మిడిమిడి వద్దు..

- ఏ విషయంలోనైనా సగం జ్ఞానం అంత మంచిది కాదు. అలాగే స్టాక్ మార్కెట్‌లోను మిడిమిడి జ్ఞానంతో ఇన్వెస్ట్ చేసి చేతులు కాల్చుకోకూడదు. స్టాక్ లేదా ఆయా రంగాల గురించి పూర్తి అవగాహనతో ఇన్వెస్ట్ చేయాలి.

- ఏదైనా రాజకీయ నాయకుడితో వ్యాపార సంబంధం కలిగిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ దీర్ఘకాలంలో పెట్టుబడికి జాగ్రత్తగా ఉండాలి.

- ఎవరైనా తక్కువ సమయంలో మీ డబ్బు రెట్టింపు లేదా మూడు రెట్లు అవుతుందని చెబితే అప్రమత్తంగా ఉండాలి. చివరగా కఠిన శ్రమ, వినయం మాత్రమే విజయాన్ని అందించగలవని గుర్తుంచుకోవాలి.

English summary

Some of Investing Rules for the share market

Do not follow Warren Buffett blindly or rakesh jhunjhunwala. It is equivalent to driving on the Indian streets by blindly following the road signs.
Story first published: Friday, January 7, 2022, 8:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X