For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెన్సెక్స్ 650 పాయింట్లు జంప్: 2022 మిడ్ వరకు ఇటీవలి నష్టాలు తిరిగి రావా?

|

స్టాక్ మార్కెట్లు బుధవారం(డిసెంబర్ 1) లాభాల్లో ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం గం.1.00 సమయానికి సెన్సెక్స్ 6452 పాయింట్లు ఎగిసి 57,709 పాయింట్ల వద్ద, నిఫ్టీ 182 పాయింట్లు లాభపడి 17,165 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 17,000కు దిగువన ఉన్న నిఫ్టీ నేడు ఈ మార్కుని క్రాస్ చేసింది. సెన్సెక్స్ కూడా 58,000కు చేరువైంది. అమెరికా మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలు నమోదు చేశాయి. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా ఉన్నాయి.

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలతో మార్కెట్లు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. అయితే, ఇప్పటికే రెండు దశల కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వాలు కట్టడికి సన్నద్ధంగా ఉన్నాయనే సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది.

అందుకే స్టాక్స్ జంప్

అందుకే స్టాక్స్ జంప్

బాండ్ పర్చేస్‌కు సంబంధించి చర్చిస్తామని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పోవెల్ ప్రకటించిన నేపథ్యంలో సానుకూల నిర్ణయం వెలువడుతుందనే అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకున్నాయి. అలాగే, యూఎస్ ట్రెజరీ యీల్డ్స్ పెరగడం, పోవెల్ కామెంట్స్ తర్వాత డాలర్ వ్యాల్యూ పుంజుకోవడం కలిసి వచ్చాయి.

బెంచ్ మార్క్ టెన్ ఇయర్ యీల్డింగ్స్ రెండున్నర నెలల కనిష్టం నుండి పుంజుకున్నాయి. ఒమిక్రాన్ వైరస్ ప్రభావంపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ఆర్థిక రికవరీపై ప్రభావం పడకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత్ ఒమిక్రాన్ కట్టడికి చర్యలు తీసుకుంది. ఇవి ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి.

అప్పటి వరకు ఇంతేనా?

అప్పటి వరకు ఇంతేనా?

సెన్సెక్స్ ఇటీవలి ఆల్ టైమ్ గరిష్టం 62,245 పాయింట్లతో పోలిస్తే ఇప్పటికీ దాదాపు 4800 పాయింట్ల వరకు తక్కువగా ఉంది. అయితే ప్రస్తుతం కాస్త పుంజుకున్నట్లు కనిపించినప్పటికీ, ఒమిక్రాంట్ ఆందోళన, గ్లోబల్ మానిటరీ పాలసీ కఠినతరం వంటి అంశాల కారణంగా 2022 మిడిల్ వరకు భారత ఈక్విటీలు ఇటీవలి నష్టాలను తిరిగి పొందలేవని రాయిటర్స్ పోల్‌లో ఎక్కువమంది ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు.

రాబోయే ఆరు నెలల కాలంలో మరింత దిద్దుబాటు ఉంటుందని చెబుతున్నారు. ఈజీ మానిటరీ పాలసీ, క్రమంగా ఆర్థిక వ్యవస్థ పునఃప్రారంభం, వేగవంతమైన వ్యాక్సినేషన్ డ్రైవ్ వంటి అంశాలతో 2021 సంవత్సరంలో సెన్సెక్స్ దాదాపు 20 శాతం ఎగిసింది. అయితే ప్రస్తుతం అక్టోబర్ 19 నాటి (62,245) ఆల్ టైమ్ గరిష్టం నుండి ఎనిమిది శాతం పడిపోయింది.

మార్కెట్ ప్రస్తుతం పుంజుకున్నట్లు కనిపిస్తోంది. అయితే 2022 మిడిల్ వరకు గాను సెన్సెక్స్ 60,450 పాయింట్లను క్రాస్ చేయకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. అంటే ఇటీవలి నష్టాలను మరో 6 నెలల తర్వాత కానీ నష్టాలను తిరిగి పొందలేవన్నారు.

63,000 స్థాయికి సెన్సెక్స్

63,000 స్థాయికి సెన్సెక్స్

సెన్సెక్స్ 2022 చివరి నాటికి 63,000 పాయింట్లకు చేరుకోవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. ఎమర్జింగ్ మార్కెట్లలో ఇండియన్ మార్కెట్లలోకి పెద్ద ఎత్తున ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తున్నాయి. భారత కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా కరోనా కారణంగా గత ఏడాదిన్నరగా వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. అయితే 2022 రెండో త్రైమాసికంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచవచ్చునని అంచనా వేశారు. గత రెండు మూడేళ్లలో భారత్ రెపో రేటును పెంచడం ఇదే మొదటిసారి అవుతుంది.

English summary

Sensex surges over 600 points, stocks unlikely to recoup recent losses till 2022 end

Auto, IT, bank, metal indices up 1 percent each, while selling is seen in the power stocks. BSE midcap and smallcap indices are trading with marginal gains.
Story first published: Wednesday, December 1, 2021, 13:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X