ప్రాపర్టీ కొనుగోలు చేసేవారికి డిసెంబర్ 30న SBI బంపరాఫర్! ఈ వివరాలు తెలుసుకోండి
దేశీయ ప్రభుత్వరంగ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) త్వరలో ఈ-ఆక్షన్‌ను నిర్వహించనుంది. మోర్టగేజ్ ప్రాపర్టీల వేలం నిర్వహిస్తోంది. ఇందులో ఇల్లు వంటివి తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. కమర్షియల్, రెసిడెన్షియల్ మోర్టగేజ్ ప్రాపర్టీస్‌కు ఈ-ఆక్షన్ ద్వారా వేలం నిర్వహిస్తోంది. ఈ-ఆక్షన్ డిసెంబర్ 30వ తేదీన నిర్వహిస్తున్నారు. అంటే మరో వారం రోజుల వరకు గడువు ఉంది.
కొనాలనుకుంటున్నారా.. జనవరి 1 నుండి ఈ వాహనాల ధరలు పెరుగుతున్నాయ్

మార్కెట్ ధర కంటే తక్కువ
కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి లేదా కొత్త ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టాలని భావించే వారికి ఇది శుభవార్త అని చెప్పవచ్చు. రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్ కోసం ఇండివిడ్యువల్స్ అవకాశం కలిగి ఉన్నారు. బిడ్డింగ్ ధర మార్కెట్ వ్యాల్యూ కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ఎస్బీఐ నుండి డబ్బులు తీసుకొని చెల్లించని వారికి చెందిన ప్రాపర్టీస్ కాబట్టి వాస్తవ మార్కెట్ ధర కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ వేలం ద్వారా ఎస్బీఐ ఈ ప్రాపర్టీస్ కోసం ఇచ్చిన రుణాలను రికవరీ చేయాలని భావిస్తోంది. 30న ఎస్బీఐ మెగా ఈ-ఆక్షన్ ఉందని చెబుతూ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

ప్రాపర్టీస్ ఎన్ని అంటే...
బ్యాంకు వెబ్ సైట్‌లోని వివరాల ప్రకారం 3,317 రెసిడెన్షియల్ ప్రాపర్టీస్, 935 కమర్షియల్ ప్రాపర్టీస్, 513 ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్, 9 అగ్రికల్చరల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ-వేలం పాటలోని ప్రాపర్టీస్ గురించి అందుకు సంబంధించిన లింక్స్ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. ఆయా బ్రాంచీల్లో వేలం కోసం ప్రతినిధి ఉన్నారు. కొనుగోలుకు ఆసక్తి కలిగిన వారు అలాంటి ప్రతినిధులను కలువవచ్చు. వచ్చే వారం రోజుల్లో 758 రెసిడెన్షియల్ ప్రాపర్టీస్, 251 కమర్షియల్ ప్రాపర్టీస్, 98 ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్‌ను విక్రయానికి వెళ్తున్నాయి. రాబోయే 30 రోజుల్లో 3035 రెసిడెన్షియల్ ప్రాపర్టీస్, 844 కమర్షియల్ ప్రాపర్టీస్, 410 ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్ అమ్మకానికి వెళ్లనున్నాయి.

ఇలా వేలంలో పాల్గొనండి..
నిర్దిష్ట ఆస్తి కోసం ఈఎండీ, సంబంధిత బ్రాంచీలో కేవైసీ డాక్యుమెంట్స్ ఇవ్వడం, చెల్లుబాటు అయ్యే డిజిటల్ సంతకం ఉండాలి. ఈవేలం కోసం బిడ్డర్స్‌కు లాగిన్ ఐడి, పాస్ వర్డ్ పంపిస్తారు. అయితే ఈఎండీ డిపాజిట్ తర్వాత పంపస్తారు. బిడ్డర్స్ ఈ-ఆక్షన్ సమయంలో లాగిన్ అయి వేలంలో పాల్గొనవచ్చు. అంతకంటే ముందు బిడ్డర్స్ కొన్ని చేయాలి. బిడ్డర్స్ ఈ-ఆక్షన్ ప్లాట్‌ఫాంలో రిజిస్టర్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీతో రిజిస్టర్ చేసుకోవాలి. కేవైసీని అప్ లోడ్ చేయాలి. వీటిని ఈ-ఆక్షన్ సూపర్ వైజర్ వెరిఫై చేస్తారు. ఆ తర్వాత ఈఎండీ మొత్తాన్ని ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా పంపించాలి.