KYC పేరుతోనే అధిక ఫ్రాడ్స్, బ్యాంకు కస్టమర్లు జాగ్రత్త! SBI వీడియో అలర్ట్
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) వీడియో ద్వారా సామాన్యులకు ఫ్రాడ్స్టర్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఆన్లైన్ ఫ్రాడ్‌కు సంబంధించి ఈ హెచ్చరికలు చేసింది. ఎస్బీఐ విడుదల చేసిన ఈ వీడియో కేవైసీ ధృవీకరణకు సంబంధించింది. ఈ మేరకు ఎస్బీఐ వీడియోను ట్వీట్ చేసింది. ఎస్బీఐ సహా వివిధ బ్యాంకులు ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేస్తాయి.
విలువలేదు: బిట్ కాయిన్, టెస్లా జంప్‌పై రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు

ఫ్రాడ్ కాల్స్...
KYC వెరిఫికేషన్‌కు సంబంధించిన 'ఫ్రాడ్ కాల్స్, సందేశాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.' అని ఆ వీడియోలో పేర్కొంది. ఫ్రాడ్స్టర్స్ ఫోన్ కాల్ చేయడం ద్వారా లేదా టెక్స్ట్ సందేశాలు పంపించడం ద్వారా, బ్యాంకు ప్రతినిధిగా నమ్మించే ప్రయత్నాలు చేస్తారని, తద్వారా మీ బ్యాంకుకు సంబంధించిన, వ్యక్తిగత వివరాలు పొందే ప్రయత్నం చేస్తారని పేర్కొంది. అలాంటి అంశాలు దృష్టికి వచ్చినప్పుడు cybercrime.gov.in. కు నివేదించాలని తెలిపింది.

ఇదివరకు కూడా
ఇదివరకు కూడా ఎస్బీఐ 20 సెకన్ల వీడియోను షేర్ చేసింది. ఆన్ లైన్ ద్వారా ఎవరితోను మీ బ్యాంకు రహస్య వివరాలు పంచుకోవద్దని సూచించింది. అప్రమత్తంగా, సురక్షితంగా ఉండాలని, సోషల్ మీడియాలో సంభాషించే సమయంలో ధృవీకరించుకోవాలని, ఆన్ లైన్ ద్వారా రహస్య వివరాలు పంచుకోవద్దని తెలిపింది.

కేవైసీ పేరుతో ఎక్కువ ఫ్రాడ్స్
కేవైసీ పేరుతో ఇటీవలి కాలంలో భారీగా ఫ్రాడ్స్ జరుగుతున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తెలిపింది. కేవైసీ చెక్ కోసం ఎవరైనా మీకు కాల్ చేస్తే లేదా సందేశం పంపిస్తే అది ఆన్ లైన్ మోసపూరిత కాల్ కావొచ్చునని తెలిపింది. OTPని ఎవరితోను షేర్ చేసుకోవద్దని సూచించింది. రిమోట్ యాక్సెస్ యాప్స్‌ను నివారించాలి. ఆధార్ కాపీనీ ఎవరితోను పంచుకోవద్దు.
మీ తాజా బ్యాంకు అకౌంటుతో తాజా కాంటాక్ట్ సమాచారాన్ని అప్ డేట్ చేసుకోవాలి. మీ పాస్ వర్డ్‌ను అప్పుడప్పుడు మారుస్తుండాలి. మీ మొబైల్ నెంబర్‌ను, కాన్ఫిడెన్షియల్ డేటాను ఎవరితోను పంచుకోవద్దు. ఏ లింక్ పైన అయినా క్లిక్ చేసేముందు పూర్తిగా తెలుసుకోవాలి.