For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI FD చేశారా, మీకో శుభవార్త: HDFC, కొటక్ బ్యాంకులతో పోలిస్తే...

|

ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారా? అయితే మీకు ఓ శుభవార్త. ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. స్వల్పకాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పది బేసిస్ పాయింట్లు పెంచింది. అంటే 0.1 శాతం పెంచింది. ఎస్బీఐ వెబ్ సైట్ వివరాల ప్రకారం ఏడాది నుండి రెండేళ్ల కాలపరిమితి కలిగిన రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ కలిగిన వడ్డీ రేటు 5 శాతం నుండి 5.1 శాతానికి పెంచింది. ఇవి జనవరి 15వ తేదీ నుండి అమల్లోకి వచ్చినట్లు బ్యాంకు ప్రకటించింది. ఇదే కేటగిరీలోని సీనియర్ సిటిజన్ డిపాజిట్ వడ్డీ రేటు 5.5 శాతం నుండి 5.6 శాతానికి పెంచారు.

ఎస్బీఐ కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు

ఎస్బీఐ కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు

- 7 days to 45 days - 2.9%

- 46 days to 179 days - 3.9%

- 180 days to 210 days - 4.4%

- 211 days to less than 1 year - 4.4%

- 1 year to less than 2 years - 5.1%

- 2 years to less than 3 years - 5.1%

- 3 years to less than 5 years - 5.3%

- 5 years and up to 10 years - 5.4%

HDFC బ్యాంకు వడ్డీ రేటు కూడా...

HDFC బ్యాంకు వడ్డీ రేటు కూడా...

HDFC బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు కూడా 12 జనవరి 2022 నుండి పెరిగాయి. ఎంపిక చేసిన కాలపరిమితిపై HDFC బ్యాంకు వడ్డీ రేట్లను పెంచింది. రెండేళ్ల నుండి మూడేళ్ల కాలపరిమితిపై FD వడ్డీ రేటు 5.20 శాతానికి పెంచింది. అలాగే మూడేళ్ల నుండి 5 ఏళ్ల కాలపరిమితి డిపాజిట్లపై కూడా వడ్డీ రేటును 5.40 శాతానికి పెంచింది. 5 ఏళ్ల కాలపరిమతి నుండి 10 ఏళ్ల కాలపరిమితిపై 5.60 శాతం వడ్డీ రేటు ఉంటుంది. ఇతర కాలపరిమితులపై వడ్డీ రేట్లలో మార్పులేదు.

- 7 - 14 days 2.50%

- 15 - 29 days 2.50%

- 30 - 45 days 3%

- 61 - 90 days 3%

- 91 days - 6 months 3.5%

- 6 months 1 day - 9 months 4.4%

- 9 months 1 day < 1 Year 4.4%

- 1 year - 4.9%

- 1 year 1 day - 2 years 5%

- 2 years 1 day - 3 years 5.20%

- 3 year 1 day- 5 years 5.40%

- 5 years 1 day - 10 years 5.60%

కొటక్ మహీంద్రా బ్యాంకు వడ్డీ రేటు

కొటక్ మహీంద్రా బ్యాంకు వడ్డీ రేటు

కొటక్ మహీంద్రా బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు వివిధ కాలపరిమితులపై మారింది. తాజా రివిజన్ తర్వాత 7 రోజుల నుండి 30 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటు 2.5 శాతం, 31 రోజుల నుండి 90 రోజుల కాలపరిమితిపై 2.75 శాతం, 91 రోజుల నుండి 120 రోజుల కాలపరిమితిపై 3 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. ఇవి జనవరి 6వ తేదీ నుండి అమల్లోకి వచ్చాయి.

- 7 - 14 days 2.50%

- 15 - 30 days 2.50%

- 31 - 45 days 2.75%

- 46 - 90 days 2.75%

- 91 - 120 days 3%

- 121 - 179 days 3.25%

- 180 days 4.3%

- 181 days to 269 days 4.40%

- 270 days 4.40%

- 271 days to 363 days 4.40%

- 364 days 4.5%

- 365 days to 389 days 4.9%

- 390 days (12 months 25 days) 5%

- 391 days - Less than 23 months 5%

- 23 months 5.10%

- 23 months 1 day- less than 2 years 5.10%

- 2 years- less than 3 years 5.15%

- 3 years and above but less than 4 years 5.3%

- 4 years and above but less than 5 years 5.3%

- 5 years and above up to and inclusive of 10 years 5.3%

English summary

SBI hikes interest rates on short term FDs: How they compare with HDFC Bank, Kotak

India largest lender, the State Bank of India (SBI), on Saturday announced that it has increased interest rates on fixed deposit (FD) by up to 10 basis points or 0.10%.
Story first published: Sunday, January 16, 2022, 19:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X