For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

30 ఏళ్లలోపు ఇవి చేయండి, ఇలా చేస్తే ఆర్థిక లక్ష్యాలు చేరుకుంటారు

|

పెట్టుబడులు లేదా నగదును భద్రపరుచుకోవడం ఎంత ముఖ్యమో కరోనా మహమ్మారి నేపథ్యంలో దాదాపు అందరికీ అర్థమైంది. అంతకుముందు నగదును విచ్చలవిడిగా ఖర్చుచేసిన చాలామంది ఇప్పుడు దాచుకోవడానికి అదే సమయంలో పెట్టుబడి పెట్టేందుకు ఉపయోగించుకుంటున్నారు. చిన్న వయస్సులోనే లేదా సంపాదన ప్రారంభించినప్పటి నుండే పెట్టుబడుల వైపు దృష్టి సారించాలని పెట్టుబడిసలహాదారులు సూచిస్తుంటారు.

ఎంత చిన్న వయస్సులో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే, అంత మంచిది. చదువు తర్వాత ఉద్యోగం లేదా సంపాదన, ఆ తర్వాత బాధ్యతలు, పిల్లలు, పిల్లల చదువులు, వారి పెళ్లిళ్ళు.. ఇలా ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఈ ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చే లక్ష్యంలో భాగంగా మీకు ముప్పై సంవత్సరాలు వచ్చే లోపే కొన్ని ఆర్థిక లక్ష్యాలు సాధించాలి. తక్కువ వయస్సులోనే ఆర్థిక లక్ష్యాలు చేరుకునేందుకు బలమైన పునాదిని నిర్మించుకోవాలి.

ఇవి కీలకం

ఇవి కీలకం

- మీమీ ఖర్చులపై ఎప్పటిపప్పుడు అవగాహన పెంచుకోవడం అంటే మీరు ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవడం ద్వారా ఖర్చును అదుపు చేయవచ్చు.

- అత్యవసరమైతే తప్ప క్రెడిట్ వైపు వెళ్లవద్దు. స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాలను ఎంచుకోవాలి.

- ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడులు, పెట్టుబడి సాధానాలపై అవగాహన పెంచుకోవాలి. పదవీ విరమణ కోసం ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాలి.

- ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్న నగరానికి వెళ్లాలి. అలాగే తక్కువ వేతనం ఉన్నప్పటికీ గణనీయమైన ఎదుగుదల ఉన్న ఉద్యోగం వైపు చూడాలి.

- మీ నైపుణ్యాలను, జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేయాలి.

ఖర్చులను ట్రాక్ చేయండి

ఖర్చులను ట్రాక్ చేయండి

మీరు ఎంత ఖర్చు చేస్తున్నారో, దేనిపై ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవడం ద్వారా మీ ఖర్చులను అదుపులో ఉంచవచ్చు. కొన్ని బడ్జెట్ యాప్స్‌ను డౌన్ లోడ్ చేసుకొని, వాటిని అనుసరించవచ్చు. చాలామంది ఉద్యోగులు నిత్యం ఫుడ్ ఆర్డర్ చేయడంపై ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. కానీ ఇది అధిక ఖర్చుకు దారి తీస్తుంది. మీరు సంపాదించిన డబ్బు కూడా వృధా అవుతుంది. మీరు ఆర్డర్ చేయడానికి నెలకు వేల రూపాయలు ఖర్చు చేయడానికి బదులు, ప్రత్యామ్నాయం చూసుకోవాలి.

లైఫ్ స్టైల్..

లైఫ్ స్టైల్..

మీ ఆదాయం కంటే దిగువ లైఫ్ స్టైల్‌ను అలవర్చుకోవడం మంచిది. సాధారణంగా 25 ఏళ్లకు అటు ఇటుగా వృత్తి జీవితం ప్రారంభమవుతుంది. అయితే, కొత్తగా ఉద్యోగం లేదా వ్యాపారంలోకి అడుగుపెట్టగానే మనకు తెలియని విషయాలను చాలా ఉంటాయి. వాటని అవగాహన చేసుకోవాలి. అవసరమైతే వాటిలో నైపుణ్యం సాధించేందుకు కొత్త కోర్సులు చేయాలి. లేదా అనుభవజ్ఞుల సాంగత్యంలో మెళకువలు తెలుసుకోవాలి. అందుకు ముందు కెరీర్‌పై పెట్టుబడి పెట్టాలి. డబ్బు అవసరంలేని చోట సమయాన్ని పెట్టుబడిగా పెట్టవలసి ఉంటుంది.

అప్పులకు దూరంగా ఉండాలి

అప్పులకు దూరంగా ఉండాలి

అత్యవసరమైతే తప్ప అప్పులకు దూరంగా ఉండాలి. రుణం తీసుకొని కొనుగోలు చేయడం సరికాదు. ఇల్లు కొనడం, విద్య కోసం, వ్యాపారం కోసం.. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లోనే రుణం వైపు మొగ్గు చూపాలి. కొన్ని సందర్భాల్లో మీ రుణాలు మీ ఆర్థిక లక్ష్యాలను త్వరగా చేరుకోవడానికి ఉపయోగపడతాయి. రుణం తీసుకుంటే వడ్డీ వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.

షార్ట్ టర్మ్ గోల్స్

షార్ట్ టర్మ్ గోల్స్

షార్ట్ టర్మ్ గోల్స్‌ను పెట్టుకోవాలి. భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయడం, డబ్బు ఆదా చేయడం అవసరం. ఉద్యోగం పోయినప్పుడు లేదా ఆర్థిక సంక్షోభం సమయంలో పెట్టుబడులు ఆదుకునే అవకాశం ఉంటుంది. సంపాదన ప్రారంభంలో దీర్ఘకాలిక లక్ష్యాలతో పాటు స్వల్పకాలిక లక్ష్యాల వైపు ప్రధానంగా దృష్టి సారించాలి.అలాగే, ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడులు, పెట్టుబడి సాధానాలపై అవగాహన పెంచుకోవాలి.

రిటైర్మెంట్‌కు ప్లాన్

రిటైర్మెంట్‌కు ప్లాన్

మీరు ఇరవై ఏళ్లలో ఉన్నప్పుడు మీ రిటైర్మెంట్ వయస్సు సుదూరంలో కనిపిస్తుంది. అయినప్పటికీ దీనిని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి. రిటైర్మెంట్ జీవితం సాఫీగా సాగాలంటే ప్రారంభంలోనే దానికి పునాదులు వేయాలి. అందుకు సరైన పథకాలను ఎంచుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్, ఎన్పీఎస్, ప్రావిడెంట్ ఫండ్స్... వంటి పలు మార్గాలు ఉన్నాయి. వీటిలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. రిటైర్మెంట్ వయసుకు వచ్చేసరికి ఆర్థిక అవసరాల కోసం మరొకరిపై ఆధారపడకుండా చూసుకోవాలి.

రిస్క్ చేయాలి

రిస్క్ చేయాలి

మీరు యవ్వనంలో ఉన్నప్పుడే రిస్క్‌ను అంచనా వేసి, దీర్ఘకాలంలో వివేకవంతంగా ముందుకు సాగాలి. ఏవైనా రిస్క్ తీసుకోవాలంటే ఇరవయ్యేళ్లలోనే తీసుకోవాలి. అప్పుడు కోలుకోవడానికి సమయం ఉంటుంది. 30 ఏళ్ళు లేదా నలభైఏళ్ల తర్వాత రిస్క్ నుండి కోలుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఎక్కువ అవకాశాలు ఉన్న చోటుకు వెళ్ళడం, అదనపు నైపుణ్యతలు పెంచుకోవడం ఇరవై ఏళ్లలోనే చేయాలి.

పెట్టుబడి తెలివిగా..

పెట్టుబడి తెలివిగా..

ముప్పై ఏళ్ల వయస్సు వచ్చేసరికి పూర్తిగా ఓ పెట్టుబడిదారుడిగా మారిపోయే ప్రయత్నం చేయాలి. దీర్ఘకాల లక్ష్యాలకు అనుగుణంగా మీ సంపాదన, పొదుపు బట్టి ఎక్కడో ఒకచోట పెట్టుబడి పెట్టాలి. అప్పుడే మీ లక్ష్యాలను త్వరగా చేరుకుంటారు. కేవలం సంపాదన, పొదుపు ద్వారా మాత్రమే ఆర్థిక లక్ష్యాలను చేరాలంటే సాధ్యం కాదు.

ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మన సంపాదన పెరగాలంటే పెట్టుబడి తప్పుదు. అయితే, తెలివిగా పెట్టుబడి పెడితే ప్రయోజనకరం. ఇందుకు సరైన పథకాలు ఎంచుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, ఈక్విటీ ఇలా ఎక్కడ పెట్టుబడి పెట్టాలన్నా ఆర్థిక అంశాలపై కొంతమేర అవగాహన ఉండాలి.

English summary

Must reach these goals before 30 years for financial securities

Knowing how much you spend can keep spending in check. Become financially literate and save what you can for retirement.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X