చౌకైన మ్యూచువల్ ఫండ్ ఇది, సిప్ పెట్టుబడి కోసం చూడండి
ఇటీవలే లాంచ్ అయిన నావీ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ చీపెస్ట్ మ్యూచువల్ ఫండ్. నావీ మ్యూచువల్ ఫండ్ వివరాలు, లాభాల గురించి తెలుసుకోవడానికి ముందు మొదట ఫండ్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే పెట్టుబడిదారుకు ఫండ్ క్రెడిబులిటీ చాలా ముఖ్యమైన విషయం. ఫ్లిప్‌కార్ట్ కో-ఫౌండర్ సచిన్ బన్సాల్‌కు చెందిన ఏఎంసీ కంపెనీ. దీనిని సెబిలో నమోదు చేశారు. స్పాన్సర్ అన్మోల్ కోమో బ్రోకింగ్ ప్రయివేట్ లిమిటెడ్. నావీ మ్యూచువల్ ఫండ్‌కు నావీ ఏఎంసీ లిమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్. నావీ ట్రస్టీ లమిటెడ్ ట్రస్టీ.

ఈ లోన్ సౌకర్యాలు కూడా
నావీ మ్యూచువల్ ఫండ్ ఏఎంసీతో పాటు ఫైనాన్సింగ్ సదుపాయాలను కూడా కల్పిస్తోంది. పర్సనల్ లోన్, హౌసింగ్ లోన్, టూ-వీలర్ లోన్, ఎస్ఎంఈ బిజినెస్ లోన్, ఇన్సురెన్స్ సేవలు కూడా అందిస్తుంది. ఫండ్స్ పెట్టుబడి కోసం ప్రస్తుతం ఓపెన్ ఉంది. ఇది లార్జ్ క్యాప్ ఈక్విటీ ఓరియెంటేషన్ కలిగిన ఓపెన్ ఎండెండ్ ఇండెక్స్ ఫండ్. ఎర్లీ అండ్ ఎగ్జిట్ లోడ్ జీరో శాతం. ఫండ్ మేనేజర్ గిరిషీ రాజ్. కనీస పెట్టుబడి సిప్ ద్వారా రూ.500. లమ్-సమ్ పేమెంట్స్ కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. బెంచ్ మార్క్ నిఫ్టీ 50 TRI.

మార్కెట్ పతనమైనప్పుడు
ఈ ఫండ్ సాధారణంగా నిఫ్టీ 50 రాబడిని ప్రతిబంబిస్తుంది. ఎక్స్పోజర్ సాధారణంగా లార్జ్ క్యాప్స్‌లో ఉన్నందున మార్కెట్లు పతనమైనప్పుడు నష్టం అంతగా ఉండదు. అంటే అధిక రిస్క్ ఇష్టపడని ఇన్వెస్టర్లకు ఇది అనుకూలంగా ఉంటుందని భావించవచ్చు. 0.06 శాతం ప్లాన్ చౌకైనది. చౌకైన ఫండ్స్ కనీస న్యయ నిష్పత్తి 0.1 శాతం నుండి 0.15 శాతం మధ్య ఉంది. ఈ ఇండెక్స్ ఫండ్‌ను నేరుగా AMC సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. డీమ్యాట్ ఖాతా అవసరం లేదు.

బఫెట్ కూడా...
వారెన్ బఫెట్ వంటి ప్రముఖ ఇన్వెస్టర్లు కూడా ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడాన్ని ప్రోత్సహిస్తారు. సగటు ఇన్వెస్టర్లలో చాలామంది స్టాక్ పికింగ్ చేయలేరు. ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే ఈ ఫండ్ మీకు మంచి రాబడిని ఇస్తుంది. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, రిటర్న్స్ మార్కెట్‌కు అనుగుణంగా ఉంటాయి. దీని ఆధారంగా మాత్రమే పెట్టుబడులు సరికావు. నిపుణుల సలహాలు తీసుకొని, అన్నీ పరిశీలించి పెట్టుబడులు పెట్టాలి.