IT Returns: 4 రోజులే... ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే ఏమవుతుంది
ఆదాయపు పన్ను శాఖ రిటర్న్స్(ITR) దాఖలు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2021. ఈ గడువుకు మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 25వ తేదీ వరకు 4.43 కోట్లకు పైగా ఐటీ రిటర్న్స్ దాఖలయినట్లు ఐటీ విభాగం ఆదివారం తెలిపింది. ఇందులో ఐటీఆర్-1లు 2.41 కోట్లకు పైగా, ఐటీఆర్-4లు 1.09 కోట్లకు పైగా ఉన్నాయని పేర్కొంది. 2019-20లో 5.95 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ఈ నెల 25న స్వయంగా 11 లక్షలకు పైగా ఐటీఆర్స్ దాఖలయ్యాయి. రూ.50 లక్షల ఆదాయం ఉంటే ఐటీఆర్ ఫామ్ 1 (సహజ్) సమర్పిస్తారు. అలాగే, శాలరీ, వన్ హౌస్ ప్రాపర్టీ, ఇతర మార్గాల ద్వారా ఆదాయం పొందేవారు కూడా దీనిని సమర్పిస్తారు. ఐటీఆర్-4ను రూ.50 లక్షల వరకు ఆదాయం కలిగిన బిజినెస్, ప్రొఫెషనల్ ఇండివిడ్యువల్స్, HUFs సమర్పిస్తారు.

ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుంటే....
గడువులోగా ఐటీ రిటర్న్స్ దాఖలుచేయని పక్షంలో ట్యాక్స్‌పేయర్ ప్రస్తుత సంవత్సరానికి తమ నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకునే వెసులుబాటును కోల్పోతారు. బిజినెస్ ఆదాయం లేదా క్యాపిటల్ గెయిన్స్ లేదా హౌస్ ప్రాపర్టీ ద్వారా నష్టపోయిన మొత్తాన్ని క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు.
గడువు లోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుంటే రూ.5,00,000కు పైగా ఆదాయంపై రూ.5000 జరిమానా ఉంటుంది. రూ.5,00,000కు లోపు ఆదాయం పైన రూ.1000 లేట్ ఫీజు ఉంటుంది. అలాగే, ఆలస్యం చేస్తే వడ్డీ ప్రయోజనాన్ని కూడా కోల్పోతారు.

వేతన ఆదాయం ఉంటే
- వేతన ఆదాయం, ఆదాయంపై వడ్డీ రేటు, 1 హౌస్ ప్రాపర్టీ నుండి ఆదాయం కలిగిన వారు ఐటీఆర్1 ఫైల్ చేయాలి.
- ఒకటి కంటే ఎక్కువ హౌస్ ప్రాపర్టీ నుండి ఆదాయం లేదా క్యాపిటల్ గెయిన్స్ కలిగిన వారు ఐటీఆర్2 ఫైల్ చేయాలి.
- ప్రీ-ఫిల్డ్ ఐటీ రిటర్న్స్ కాబట్టి ఇప్పుడు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం మరింత ఈజీ.
- ఫాం 16, బ్యాంకు స్టేట్మెంట్, బ్యాంకు వడ్డీ రేటు సర్టిఫికెట్, హౌసింగ్ లోన్ వడ్డీ రేటు, రెంటల్ రిసిప్ట్స్, హౌస్ ప్రాపర్టీ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్స్ స్టేట్మెంట్ వంటివి ఉంటాయి.

చెక్ చేసుకోండి
- ఈక్విటీ లేదా మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు, విక్రయాల నేపథ్యంలో AIS స్టేట్మెంట్ డేటాను తమ బ్యాంకు పాస్‌బుక్, ఇంటరెస్ట్ సర్టిఫికెట్, ఫామ్ 16, క్యాపిటల్ గెయిన్స్ స్టేట్మెంట్తో కలిసి క్రాస్ చెక్ చేసుకోవాలి.
- స్పెషలైజ్డ్ సీనియర్ సిటిజన్లకు ఐటీ రిటర్న్స్ ఫైల్ నుండి మినహాయింపు ఉంది. 75 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్స్ పెన్షన్ ఆదాయం, అకౌంట్ నుండి వచ్చే వడ్డీ ఆదాయాన్ని మాత్రమే ఎక్కువగా కలిగి ఉంటారు. అలాంటి వారు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవలసిన అవసరం లేదు. - కోవిడ్ 19 వైద్య చికిత్స మొత్తానికి ఆదాయపు పన్ను మినహాయింపు ప్రకటించారు. - మీరు ఐటీఆర్‌ను ఎంత త్వరగా ఫైల్ చేస్తే అంత మంచిది. AY 2021-22కు గాను ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశాక, ఈ-వెరిఫికేషన్ పూర్తయ్యాక, రిటర్న్స్ ప్రాసెస్ చేసి, బ్యాంకులో రీఫండ్ చేస్తుంది.