For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ 15,000 జీతంతో రూ 60 లక్షల రిటైర్మెంట్ ఫండ్... ఎలాగో తెలుసా?

|

రిటైర్మెంట్. ప్రభుత్వ ఉద్యోగులైతే ఫరవాలేదు. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ తో పాటు అన్ని ఏర్పాట్లు ఉంటాయి. కానీ ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి, ముఖ్యంగా తక్కువ వేతనాలు పొందేవారికి భవిష్యతి చాలా ఇబ్బందులు తప్పవు. ఒకవైపు వయసు మీద పడుతుంది. మరోవైపు చేద్దామంటే ఉద్యోగం ఉండదు. అప్పుడు కొంత పెద్ద మొత్తంలో సొమ్ము చేతిలో లేకపోతే జీవితం నరకమే అవుతుంది. సాధారణంగా వచ్చే చాలీ చాలని జీతంతో జీవనం సాగించటమే కష్టం. ఇక రిటైర్మెంట్ గురించి ఆలోచించే తీరిక ఎక్కడ ఉంటుంది అని చాలా మంది చెబుతుంటారు. ఒకవేళ ఆలోచించినా కూడా పొదుపు చేద్దామంటే ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు. అంతకంతకూ పెరిగిపోతున్న స్కూల్ ఫీజులు, హాస్పిటల్ ఖర్చులకే పెద్ద మొత్తంలో జీతం ఖర్చు చేయాల్సిన పరిస్థితి.

ఇంటి అద్దెలు, నెలసరి సరుకులు, ఈఎంఐ ల భారం ఉండనే ఉంటుంది. ఈ బాధలు ఎలాగూ తప్పవు కానీ... కొంత ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తే మీ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీ సాగుతుంది అని చెప్పొచ్చు. ఇందుకోసం పెద్దగా కష్టపడాల్సిన పనికూడా లేదు. కానీ కాస్త ఓర్పు, మరికొంత నేర్పు అవసరం అంటున్నారు నిపుణులు. మరో పది రోజుల్లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టబోతున్నారు. ఇప్పుడు అందరి దృష్టీ అటువైపే ఉంది. పన్ను రేట్లు తగ్గుతాయా లేదా పెట్టుబడులపై ఏమైనా కొత్త వెసులుబాట్లు కల్పిస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

30 ఏళ్లలో సగానికి తగ్గిన ట్యాక్స్: పన్నులో తేడాలొద్దు.. 15% తగ్గించండి

ఈపీఎఫ్ తో సాధ్యమే...

ఈపీఎఫ్ తో సాధ్యమే...

ఎంప్లాయ్ ప్రోవిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ ఇది సుపరిచితమే. కానీ దీని పవర్ మాత్రం కొందరికే అర్థమవుతుంది. చాలా మంది ఉద్యోగులు అదేదో కటింగ్ (జీతం కత్తిరింపు) పేరులా భావిస్తారు. అదొక భారం అని భావించే వారి సంఖ్య కూడా తక్కువేమి కాదు. కానీ, ఈపీఎఫ్ గురించి పూర్తిగా తెలుసుకుంటే... అది అందించే ప్రయోజనాల గురించి ఒక్క సారి తెలుసుకుంటే ఇక మీకు తిరుగు ఉండదు అని చెప్పాలి. అప్పుడు మీరు అందులో దాచుకున్న సొమ్ము రేపు రిటైర్ ఐన తర్వాత ఎంత బాగా పనికొస్తాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అందుకే ఇక మీద మీరు కొత్తగా ఉద్యోగంలో చేరినా... లేదా ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి మారినా తప్పనిసరిగా మీ కంపెనీ ఈపీఎఫ్ బెనిఫిట్స్ గురించి అడిగి తెలుసుకోండి. హ్యాపీ రిటైర్మెంట్ కు బాటలు వేసుకోండి.

చిన్న మొత్తం ... పెద్ద ప్రయోజనం...

చిన్న మొత్తం ... పెద్ద ప్రయోజనం...

ఒక చిన్న ఉద్యోగి రూ 15,000 బేసిక్ శాలరీ తో ఒక ఉద్యోగంలో చేరాడు అనుకుందాం. అప్పుడు అతని వయసు 28గా తీసుకుందాం. అతని రిటైర్మెంట్ వయసును 58 ఏళ్లు అనుకుందాం. ప్రతి నెల ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ తో అతనికి రిటైర్మెంట్ సమయంలో రూ 60 లక్షలకు పైగా సొమ్ము చేతికి అందుతుంది. ఇది కేవలం ప్రతియేటా అతని సొమ్ము 5% చొప్పున పెరిగిందనుకుంటే సాధ్యమవుతుంది. ఒక వేళ అది సగటున ఏటా 10% మేరకు పెరిగితే అతనికి వచ్చే మొత్తం రూ 1 కోటి కూడా దాటవచ్చు. ఎలాగో చూద్దాం. ప్రతి నెల ఉద్యోగి తన వాటాగా నెలకు రూ 1,800 (బేసిక్ వేతనంపై 12%) ఈపీఎఫ్ కు జమ చేస్తారు. అంతకు సమానంగా కంపెనీ కూడా తన ఈపీఎఫ్ ఖాతాకు సొమ్మును జమ చేయాల్సి ఉంటుంది. అంటే నెలకు మరో రూ 1,800 అన్నమాట. ఈ మొత్తానికి ప్రభుత్వం ఏటా నిర్దిష్టమైన వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. అది ప్రస్తుతం 8.65%గా ఉంది. అంటే మనం తీసుకున్న సగటు 5% కంటే కూడా ఇది అధికం. మీరు ఎప్పుడైనా అనుకున్నారా కేవలం రూ 15,000 కనీస వేతనంతో భవిష్యత్లో రూ 60 లక్షల నుంచి రూ 1 కోటి వరకు సంపాదించగలరని? అదే ఈపీఎఫ్ పవర్.

పన్ను ప్రయోజనం...

పన్ను ప్రయోజనం...

పైన ఉదహరించిన రీతిలో మీకు రిటైర్మెంట్ సమయంలో పెద్ద మొత్తం రావాలంటే పెద్దగా చేయాల్సింది ఏమి లేదు. ఒక కంపెనీ లో 20 కి పైగా ఉద్యోగులు ఉంటే .. ఆ కంపెనీ ఈపీఎఫ్ లో రిజిస్టర్ అవుతుంది. అప్పుడు ఉద్యోగులందరికీ దీని ప్రయోజనం లభిస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. ఉద్యోగం మానేసినప్పుడో, ఇంకా ఇతరత్రా అవసరం ఉందనో ఈపీఎఫ్ లో జమ ఐన మొత్తాలను మధ్యలో విత్ డ్రా చేసుకోకూడదు. ఆ ఓపిక ఉంటె చాలు మీరు కూడా భవిష్యత్లో కోటీశ్వరులు అవ్వొచ్చు. పైగా ఈపీఎఫ్ లో జమ చేసే సొమ్ముకు ఆదయ పన్ను చట్టం లోని 80 సి ప్రకారం మినహాయింపు వర్తిస్తుంది. గరిష్టం ఇది రూ 1.5 లక్షల వరకు ఉంటుంది. కాబట్టి, మీరు ఎప్పటికప్పుడు ఈపీఎఫ్ ప్రయోజనాలను తెలుసుకుంటూ... రిటైర్ అయ్యేంత వరకు సొమ్మును ఈపీఎఫ్ ఖాతాలోనే ఉంచితే మీకు రూ 60 లక్షలు అంతకంటే అధిక మొత్తంలో పెద్ద కార్పస్ ఫండ్ చేతికి అందుతుంది. అది కూడా టాక్స్ ఫ్రీ సొమ్ము. దాంతో శేష జీవితాన్ని హాయిగా గడిపేయవచ్చు.

English summary

Invest in EPF to become rich and retire happily

Invest in EPF to become rich and retire happily. With a small contribution of your Rs 15,000 basic salary, you can have a corpus of about Rs 60,00,000 while retirement at the age of 58. So, start investing in EPF as early as possible and become crore pathi before retirement.
Story first published: Monday, January 20, 2020, 19:36 [IST]
Company Search