1.2 కోట్ల ట్యాక్స్ రీఫండ్స్ జారీ అయ్యాయి, ట్యాక్స్ రీఫండ్ చెక్ చేయండిలా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను డిపార్టుమెంట్ రూ.1.54 లక్షల కోట్ల పన్నులు రీఫండ్ చేసింది. ఈ మేరకు ట్యాక్స్ డిపార్టుమెంట్ నేడు వెల్లడించింది. 1 ఏప్రిల్ 2021 నుండి 10 జనవరి 2022 నాటికి సీబీడీటీ రూ.1,54,302 కోట్లను రీఫండ్ చేసింది. 1,56,57,444 కేసుల్లో రూ.53,689 కోట్లను, 2,21,976 కార్పోరేట్ కేసుల్లో రూ.1,00,612 కోట్లను ఇన్‌కం ట్యాక్స్ రీఫండ్స్గా చెల్లించింది.
ఇందులో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1.20 కేసులకు సంబంధించి రూ.23,406.28 కోట్ల రీఫండ్స్ ఉన్నాయి. 2021-22 అసెస్మెంట్ ఇయర్‌కు సంబంధించి 31 డిసెంబర్ 2021 నాటికి దాదాపు 58.9 మిలియన్ ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేశారు.

చివరి రోజునే ఎక్కువ ఐటీ రిటర్న్స్
మొత్తం ఫైల్ అయిన ఐటీ రిటర్న్స్‌లో 4.6 మిలియన్ల ఐటీఆర్‌లు ఐటీ రిటర్న్స్ గడువు చివరి తేదీ అయిన డిసెంబర్ 31న ఫైల్ అయినట్లు తెలిపింది. ట్యాక్స్ డిపార్టుమెంట్ హెల్ప్ డెస్క్ 16,850 ట్యాక్స్ పేయర్స్ కాల్స్‌ను అటెండ్ చేసిందని, 1467 చాట్స్‌కు రెస్పాండ్ అయిందని, దీంతో సదరు ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ కస్టమర్లు సులవుగా రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఉపయోగపడిందని తెలిపింది. డిసెంబర్ 31వ తేదీనే ట్యాక్స్ పేయర్స్, ప్రొఫెషనల్స్ నుండి 230 ట్వీట్స్ వచ్చాయి.

ఇలా అర్హత..
మీరు కనుక ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ లయబిలిటీ కంటే అధిక ట్యాక్స్ చెల్లిస్తే కనుక మీరు రీఫండ్ చేసుకోవచ్చు. అయితే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం ద్వారా వీటిని రీఫండ్ చేసుకోవచ్చు. ఇండివిడ్యువల్ ట్యాక్స్ పేయర్స్‌కు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి చివరి గడువు డిసెంబర్ 31. మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే ఆ తర్వాత డిపార్టుమెంట్ ప్రాసెస్ చేస్తుంది. మీ ఇన్‌కం ట్యాక్స్ రీఫండ్‌ను కన్ఫర్మ్ చేస్తుంది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 143(1) మీకు సమాచారం అందిస్తుంది.

ఐటీ రిటర్న్స్ ఫండ్ ట్రాక్ ఇలా
- మొదట https://eportal.incometax.gov.in/iec/foservices/#/login పోర్టల్‌లోకి లాగ్-ఇన్ కావాలి.
- incometax.gov.in లోకి లాగ్-ఇన్ కావాలి. మీ యూజర్ ఐడీ, పాస్ వర్డ్‌తో (పాన్ నెంబర్‌తో) లాగ్ ఇన్ కావాలి.
- e-file ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. Income Tax Returns ను సెలక్ట్ చేసుకోవాలి. వ్యూ ఫైల్ రిటర్న్స్‌ను సెలక్ట్ చేయాలి.
- లేటెస్ట్ ఐటీఆర్ సెక్షన్‌ను పరిశీలించాలి. AY2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ చూడాలి. వ్యూ డిటైల్స్‌ను సెలక్ట్ చేస్తే, మీ ట్యాక్స్ రీఫండ్ తేదీ కనిపిస్తుంది.