For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదాయ పన్ను క్యాలెండర్ 2021: ముఖ్యమైన ఈ తేదీలు గుర్తుంచుకోండి..

|

ఆదాయ పన్ను శాఖ 2021 సంవత్సరానికి సంబంధించి కొత్త ఈ-క్యాలెండర్‌ను దాఖలు చేసింది. అన్ని ముఖ్యమైన పన్ను సంబంధిత గడువులు ఇందులో ఉంటాయి. నిజాయితీపరులను గౌరవించేవిధంగా ఈ క్యాలెండర్‌ను రూపకల్పన చేశారని, పన్ను వ్యవస్థ ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేని, ఫేస్‌లెస్, పేపర్‌లెస్‌గా మారిందని గుర్తు చేసింది. 2021లో మీ పన్ను ప్రయాణాన్ని మరింత సులభతరం, సరళం చేసేలా క్యాలెండర్ విడుదల చేస్తున్నట్లు తెలిపింది.

2021లో ఆదాయ పన్ను శాఖకు సంబంధించి ముఖ్య తేదీలు

2021లో ఆదాయ పన్ను శాఖకు సంబంధించి ముఖ్య తేదీలు

జనవరి 10 : ఆడిట్ అవసరంలేని పన్ను చెల్లింపుదారులకు 2020-21 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ

జనవరి 15: వివిధ ఆడిట్ నివేదికలను సమర్పించే తేది.

జనవరి 15: 2020 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికానికి జమ చేసిన టీసీఎస్(మూలం వద్ద వసూలు చేసే పన్ను) క్వార్టర్ స్టేట్‌మెంట్.

జనవరి 30: 2020 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో వసూలు చేసిన పన్నుకు సంబంధించి త్రైమాసిక టీసీఎస్ సర్టిఫికెట్.

జనవరి 31: వివాద్ సే విశ్వాస్ పథకం కింద డిక్లరేషన్‌కు చివరి తేదీ.

జనవరి 31: 2020 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో టీడీఎస్ త్రైమాసిక ప్రకటన

ముఖ్య తేదీలు

ముఖ్య తేదీలు

ఫిబ్రవరి 15: ఆడియ్ అవసరమయ్యే పన్ను చెల్లింపుదారులకు మదింపు సంవత్సరం 2020-21 కొరకు ఐటీఆర్‌ని దాఖలు చేసేందుకు పొడిగింపు గడువు.

ఫిబ్రవరి 15: 2020 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో త్రైమాసిక టీడీఎస్ సర్టిఫికెట్(జీతం కాకుండా)

మార్చి 15: 2021-22 ఆర్థిక సంవత్సరం నాలుగో విడత ముందస్తు పన్ను

మార్చి 31: 202-21 కోసం ఆలస్యమైన లేదా సవరించిన ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు చివరి తేదీ.

మార్చి 31: 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొదటి, రెండో త్రైమాసికం డిపాజిట్ చేసిన టీడీఎస్, టీసీఎస్ త్రైమాసిక స్టేట్‌మెంట్

మార్చి 31: అదనపు ఛార్జీలు లేకుండా వివాద్ సే విశ్వాస్ పథకం కింద చెల్లింపు చేసేందుకు లాస్ట్ డేట్.

మార్చి 31: ఆధార్-పాన్ లింకింగ్ చివరి తేదీ.

మే 15: మార్చి 31, 2021తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ త్రైమాసిక స్టేట్మెంట్

మే 31: మార్చి 31, 2021తో ముగిసిన త్రైమాసికంలో టీడీఎస్ త్రైమాసిక స్టేట్మెంట్

మే 31: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 285బీఏ సెక్షన్ కింద ఆర్థిక లావాదేవీల ప్రకటన.

జూన్ 15: 2022-23 అసెస్‌మెంట్ ఇయర్ కోసం మొదటి విడత ముందస్తు పన్ను

జూన్ 15: 2021-22 అసెస్‌మెంట్ ఇయర్ కొరకు ఉద్యోగులకు టీడీఎస్ సర్టిఫికెట్ ఫారం 16 (వేతనంకు సంబంధించి)

జూన్ 15: మార్చి 31, 2021తో ముగిసే త్రైమాసికంలో త్రైమాసిక టీడీఎస్ సర్టిఫికెట్(జీతం కాకుండా)

జూలై 15: మార్చి 31, 2021తో ముగిసే త్రైమాసికంలో త్రైమాసిక టీసీఎస్ సర్టిఫికెట్

జూలై 30: మార్చి 31, 2021తో ముగిసే త్రైమాసికంలో త్రైమాసిక టీసీఎస్ సర్టిఫికెట్

జూలై 31: మార్చి 31, 2021తో ముగిసే త్రైమాసికంలో టీడీఎస్ త్రైమాసిక ప్రకటన

జూలై 31: కార్పోరేట్ మదింపుదారు, ఖాతాలను ఆఢిట్ చేయడానికి బాధ్యత వహించే కార్పోరేట్ కానీ అసెస్సీ లేదా అంతర్జాతీయ లేదా పేర్కొన్న దేశీయ ట్రాన్సాక్షన్‌లోకి ప్రవేశించిన మదింపుదారు మినహా మిగతా వారందరికీ అసెస్‌మెంట్ 2021-22 కొరకు ఐటీఆర్.

మరిన్ని తేదీలు..

మరిన్ని తేదీలు..

ఆగస్ట్ 15: జూన్ 30, 2021తో ముగిసిన త్రైమాసికంలో త్రైమాసిక టీడీఎస్ సర్టిఫికెట్(వేతనం కాకుండా

సెప్టెంబర్ 15: అసెస్‌మెంట్ ఇయర్ 2022-23 కోసం రెండో విడత ముందస్తు తేదీ.

సెప్టెంబర్ 30: అంతర్జాతీయ లేదా పేర్కొన్న దేశీయ లావాదేవీల్లోకి ప్రవేశించని మదింపుదారు విషయంలో అసెస్‌మెంట్ ఇయర్ 2021-22 కొరకు ఆడిట్ నివేదిక.

అక్టోబర్ 15: 2021 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ త్రైమాసిక ప్రకటన

అక్టోబర్ 30: 2021 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో త్రైమాసిక టీసీఎస్ సర్టిఫికెట్

అక్టోబర్ 31: 2021 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో టీడీఎస్ త్రైమాసిక ప్రకటన

అక్టోబర్ 31: అసెస్‌మెంట్ ఇయర్ 2021-22 కోసం ఐటీఆర్ (అంతర్జాతీయ లేదా పేర్కొన్న దేశీయ లావాదేవీలు లేనివి) కార్పోరేట్ మదింపుదారు, కార్పోరేట్ కాని మదింపుదారు, దీని పుస్తకాలను ఆడిట్ చేయాల్సి ఉంది.

అక్టోబర్ 31: అంతర్జాతీయ లేదా పేర్కొన్న దేశీయ లావాదేవీని కలిగి ఉన్న మదింపుదారుకు సంబంధించి అసెస్‌మెంట్ ఇయర్ 2021-22 కొరకు ఆడిట్ నివేదిక.

నవంబర్ 15: 2021 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో త్రైమాసిక టీడీఎస్ సర్టిఫికెట్(జీతం కాకుండా)

నవంబర్ 30: అంతర్జాతీయ లేదా పేర్కొన్న దేశీయ లావాదేవీని కలిగి ఉన్న మదింపుదారినికి సంబంధించి అసెస్‌మెంట్ ఇయర్ 2021-22 కొరకు ఐటీఆర్.

డిసెంబర్ 15: అసెస్‌మెంట్ ఇయర్ 2022-23 కోసం మూడో విడత ముందస్తు తేదీ.

English summary

Income tax calendar 2021: Important deadlines you should know

The income tax department has issued a new e-calendar for the year 2021 having a list of all the important tax-related deadlines. Designed as the 'Honoring the honest' calendar, the income tax department in an email send to the tax payers wrote, "Welcome to a new era where tax system is becoming seamless, faceless and paperless. Every taxpayer is a nation builder. "Here is a calendar to make your tax journey simpler and easier."
Story first published: Monday, January 4, 2021, 14:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X