ICICI గుడ్‌న్యూస్, వారికీ రూ.50 లక్షల వరకు హోమ్‌లోన్: ఎవరెవరికి, ఎలా తీసుకోవాలి?
అసంఘటిత రంగంలో పనిచేసేవారికి గుడ్‌న్యూస్. క్రమబద్ధమైన ఆదాయం లేని వారికి కూడా గృగరుణాలు అందించేందుకు ప్రయివేటురంగ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ హోమ్ ఫైనాన్స్(ICICI HFC) కొత్త పథకాన్ని తీసుకు వచ్చింది. అప్నా ఘర్ డ్రీమ్స్ పేరుతో ఈ సరికొత్త హోమ్ లోన్ పథకాన్ని ప్రారంభించింది. సాధారణంగా బ్యాంకులు ఉద్యోగులు, వ్యాపారాలు చేసే వారికి హోమ్ లోన్స్ కాస్త సులభంగా ఇస్తుంటాయి. ఐసీఐసీఐ నిర్ణీత మొత్తం మేరకు హోమ్ లోన్‌గా అసంఘటిత రంగంలోని వారికి కూడా ఇవ్వడానికి సిద్ధమైంది.
SBI ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా, సెప్టెంబర్ 18 నుండి కొత్త రూల్... తెలుసుకోండి

ఈ హోమ్ లోన్ ఎవరెవరికి?
నగరాల్లోని కార్పెంటర్లు, ప్లంబర్స్, ఎలక్ట్రిషియన్స్, టైలర్స్, పెయింటర్, వెల్డర్స్, ఆటో మెకానిక్, మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ ఆపరేటర్, లాప్టాప్, కంప్యూటర్, ఆర్ఓ రిపెయిర్ టెక్నిషియన్లతో పాటు చిన్న, మధ్యతరహా వ్యాపారులకు హోమ్ లోన్ ఇచ్చేందుకు ఐసీఐసీఐ బ్యాంకు ఈ కొత్త పథకాన్ని తీసుకు వచ్చింది. గ్రాసరీ స్టోర్స్ వ్యాపారులకు కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

ఎంతమొత్తం లోన్ ఇస్తుంది? డాక్యుమెంట్స్ లేకున్నా
ఈ అసంఘటిత రంగాల్లోని వారికి ఐసీఐసీఐ హోమ్ లోన్ ఫైనాన్స్ రూ.2 లక్షల నుండి రూ.50 లక్షల మేర హోమ్ లోన్స్ ఇస్తుంది. అసంఘటిత రంగంలో ఉండి ఇంటిని కొనుగోలు చేయాలని కోరుకునే వారి కోసం ఈ హోమ్ లోన్ స్కీం ఉపయోగపడుతుంది. వీరికి ఉద్యోగులు, వ్యాపారుల్లా అవసరమైన అన్ని రకాల డాక్యుమెంట్లు ఉండకపోవచ్చు. కాబట్టి అలాంటి వారికి కూడా ఆదాయ ధృవీకరణపత్రాలు, ఇతర పత్రాలు లేకున్నప్పటికీ లోన్ అందిస్తుంది.

హోమ్ లోన్‌కు ఏం అవసరం, ఎలా పొందాలి?
అప్నా ఘర్ డ్రీమ్స్ హోమ్ లోన్ పొందాలనుకునే వారు తమ పాన్ కార్డు, ఆధార్ కార్డుతో పాటు ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ను సమర్పించాల్సి ఉంటుంది. రూ.5 లక్షల వరకు హోమ్ లోన్ కోసం బ్యాంకు అకౌంట్లో కనీసం రూ.1500 ఉండాలి. రూ.5 లక్షల హోమ్ లోన్ వరకు కనీసం రూ.3000 బ్యాంకు ఖాతాలో ఉండాలి.

ఈ ప్రయోజనాలు కూడా...
తక్కువ ఆదాయ వర్గాలకు లేదా ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకోసం లేదా మధ్య ఆదాయ వర్గాల కోసం కల్పించే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీం ప్రధానమంత్రి ఆవాస్ యోజన(PMAY) పథకం ప్రయోజనం కూడా ఉంటుందని తెలిపింది.