సిబిల్ స్కోర్ లేకుండా ఇలా తక్షణమే రుణం పొందండి
ప్రస్తుత కాలంలో తక్షణ రుణం పొందడం సమస్య ఏమీ కాదు. ఎందుకంటే ఇది సంప్రదాయ, సంప్రదాయేతర మూలాల నుండి సులభంగా లభిస్తున్నాయి. అయితే రుణగ్రహీత సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ హిస్టరీ లేదా తక్కువ స్కోర్ ఉన్నప్పుడు కొందరికి వ్యక్తిగత రుణం పొందడం సవాలుగా మారుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో సిబిల్ స్కోర్ లేకుండా తక్షణ రుణం పొందవచ్చును. సిబిల్ అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్‌ను సూచిస్తుంది. ట్రాన్స్ యూనియన్ సిబిల్‌తో పాటు ఇతర క్రెడిట్ బ్యూరోలు ఎక్స్పీరియన్, ఈక్విఫాక్స్, సీఆర్ఐఎఫ్ హైమార్క్ కూడా ఉన్నాయి. ఈ ఏజెన్సీలు వ్యక్తులు లేదా కంపెనీల క్రెడిట్ కార్యకలాపాలకు సంబంధించిన రికార్డ్స్‌ను నిర్వహిస్తాయి.

ఇదీ క్రెడిట్ స్కోర్.. వివిధ మార్గాలు
ఎవరైనా రుణాలు లేదా క్రెడిట్ కార్డ్స్ కోరినప్పుడు, బ్యాంకు లేదా ఇతర ఆర్థిక సంస్థల అభ్యర్థనను ఆమోదించేలా లేదా తిరస్కరించే ముందు దరఖాస్తుదారు క్రెడిట్ హిస్టరీని తనిఖీ చేస్తాయి.
క్రెడిట్ స్కోర్.. మూడు అంకెల సంఖ్య. 300 నుండి 900 మధ్య ఉంటుంది. రుణ గ్రహీత క్రెడిట్ యోగ్యతను వెల్లడిస్తుంది. ఈ స్కోర్ రుణగ్రహీత గత రుణాలు, ఖర్చు, తిరిగి చెల్లించిన విధానాల నుండి తీసుకోబడుతుంది. ఈ క్రెడిట్ బ్యూరోలతో ఆర్థిక సంస్థలు భాగస్వామ్యం చేయబడ్డాయి.
రుణాలు, క్రెడిట్ కార్డ్స్ తీసుకోవడానికి క్రెడిట్ స్కోర్ చాలా కీలకం. అయితే క్రెడిట్ స్కోర్ లేదా తగిన క్రెడిట్ హిస్టరీ లేకున్నప్పటికీ ఆర్థిక ఉత్పత్తులు పొందవచ్చు. ఇందుకు వివిధ మార్గాలు ఉన్నాయి. అవి చూద్దాం..

ఇలా రుణాలు...
క్రెడిట్ స్కోర్ ద్వారా తక్షణ రుణం పొందడానికి పలు మార్గాలు ఉన్నాయి. అందులో కొలెటోరల్ బేస్డ్ లోన్స్ ఎంచుకోవడం, గ్యారంటీయర్ గుర్తింపు, కో-అప్లికెంట్‌తో కలిసి దరఖాస్తు, క్రెడిట్ వర్తీనెస్ ప్రూవ్, తక్కువ మొత్తానికి దరఖాస్తు చేసుకోవడం, క్రెడిట్ రిపోర్ట్‌లో హిస్టరీ లేకపోవడం, ఆన్ లైన్ రుణదాతలను ఎంచుకోవడం వంటి వాటి ఆధారంగా తీసుకోవచ్చు.

ఇలా చేయండి
సిబిల్ స్కోర్ 750 పైన ఉంటే పర్సనల్ లోన్ త్వరగా, తక్కువ వడ్డీ రేటుతో అందుతుంది. ఈ స్కోర్ తక్కువ ఉంటే వడ్డీ రేటు ఎక్కువ ఉండటం వంటి అంశాలు చోటు చేసుకుంటాయి. మీ నెలవారీ ఈఎంఐలు ఠంచనుగా చెల్లించడం, క్రెడిట్ కార్డును జాగ్రత్తగా నిర్వహించడం, చెల్లింపు రిమైండర్లను సెట్ చేయడం, వాడకాన్ని పరిమితం చేయడం, సుదీర్ఘమైన లోన్ వధిని జాగ్రత్తగా ఎంచుకోవడం, వీలైనప్పుడు పాక్షిక ప్రీపేమెంట్ చేయడం వంటివి అవసరం.