SBI కస్టమర్లకు గుడ్న్యూస్, ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంపు, కానీ
మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కస్టమరా? మీరు ఈ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్(FD) చేశారా? అయితే మీకో శుభవార్త. ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు లేదా 0.10 శాతం పెంచుతున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. ప్రస్తుతం ఏడాది నుండి రెండేళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటు ప్రయోజనం 5 శాతంగా ఉండగా, దీనిని పది బేసిస్ పాయింట్లు పెంచి 5.1 పెంచుతున్నట్లు పేర్కొంది. సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు సాధారణ వడ్డీ రేటుతో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 5.50 శాతం నుండి 5.60 శాతానికి పెంచుతున్నట్లు తెలిపింది. అయితే ఇతర కాలపరిమితులపై వడ్డీ రేట్లను స్థిరంగానే కొనసాగిస్తోంది.
రూ.2 కోట్ల కంటే తక్కువ వడ్డీ రేటు పైన ఇది వర్తిస్తుందని, ఇది జనవరి 15, 2022 నుండి అమల్లోకి వస్తుందని ఎస్బీఐ తెలిపింది. ప్రస్తుతం ఫిక్స్డ్ డిపాజిట్ పైన ఎస్బీఐ అత్యధిక వడ్డీ రేటు అయిదేళ్ల నుండి పదేళ్ల కాలానికి 5.40 శాతంగా ఉంది. ఇక సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు అయిదేళ్ల నుండి పదేళ్ల కాలపరిమితిపై 6.20 శాతంగా ఉంది. రెండేళ్ల నుండి మూడేళ్ల డిపాజిట్స్ పైన 5.10 శాతం, మూడేళ్ల నుండి నాలుగేళ్ల కాలపరిమితి డిపాజిట్స్ పైన 5.30 శాతం వడ్డీ రేటు ఉంది. వివిధ కాలపరిమితులపై వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి...

46 days to 179 days 3.90% 4.40%
180 days to 210 days 4.40% 4.90%
211 days to less than 1 year 4.40% 4.90%
1 year to less than 2 years 5.10% 5.60%
2 years to less than 3 years 5.10% 5.60%
3 years to less than 5 years 5.30% 5.80%
5 years and up to 10 years 5.40% 6.20%