For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ నెలలో రూ.3,000 పెరిగిన బంగారం ధరలు, ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా?

|

బంగారం ధరలు ఈ నెలలో (ఏప్రిల్) ఇప్పటి వరకు రూ.3,000 పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.35 శాతం ఎగిసి రూ.47,350కి చేరుకుంది. ఈ నెల ప్రారంభంలో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.44,000 వద్ద ఉంది. అంతకుముందు ఈ స్థాయి దిగువకు వచ్చింది. ఈ నెల ప్రారంభం నుండి ఇప్పటి వరకు రూ.3వేలకు పైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధరలు ఏడు వారాల గరిష్టానికి చేరుకున్నాయి. ఈ వారం 0.8 శాతం ఎగిసి 1778.04 డాలర్లకు చేరుకుంది. అమెరికా బాండ్ యీల్డ్స్ ఈ వారం 1.6 శాతం క్షీణించాయి.

కొనుగోలుదారులకు మారుతీ సుజుకీ షాక్, రూ.22,500కు ధరల పెంపు

మరింత పెరిగే ఛాన్స్

మరింత పెరిగే ఛాన్స్

కరోనా కేసులు పెరుగుతుండటం, ద్రవ్యోల్భణ భయాలు కమ్ముకోవడం వంటి వివిధ కారణాలు బంగారం పెరగడానికి దోహదపడుతున్నాయి. యూఎస్ రిటైల్ సేల్స్ డేటా, వీక్లీ జాబ్ లాస్ క్లెయిక్స్ తగ్గిపోవడం వల్ల పసిడి ధరలు కాస్త తగ్గాలి. అయితే కరోనా కేసులు పెరగడం పసిడికి కలిసి వస్తోంది. సమీప భవిష్యత్తులో కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయమని, ధరలు మరికొంత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బంగారం ధర ఇప్పటికే కీలక మద్దతు 1760 డాలర్లను క్రాస్ చేసిందని, ఈ పరిస్థితుల్లో మరింత పెరిగే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు.

గత వారం బంగారం ధరలు

గత వారం బంగారం ధరలు

ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు క్రితం సెషన్‌లో 175.00 (0.37%) పెరిగి రూ.47,350 వద్ద క్లోజ్ అయింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.189.00 (0.40%) పెరిగి రూ.47,590.00 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ మే రూ.62.00 (0.09%) ఎగిసి రూ.68602.00 వద్ద, జూలై సిల్వర్ ప్యూచర్స్ రూ.116.00 (0.17%) పెరిగి రూ.69728.00 వద్ద క్లోజ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లో

అంతర్జాతీయ మార్కెట్లో

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ గత వారం చివరి సెషన్లో 10.10 (+0.57%) శాతం ఎగిశాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 1,776.90 డాలర్ల వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ చివరి సెషన్లో 0.068 (+0.26%) డాలర్లు పెరిగి 26.032 డాలర్ల వద్ద క్లోజ్ అయింది.

English summary

Gold prices up RS 3000 this month. Why rates are rising and should you buy now?

Gold prices rose this week in India, amid positive global cues. On MCX, gold futures settled 0.35% higher at ₹47,350 per 10 gram. From levels of about ₹44,000 at the start of this month, gold prices have jumped about ₹3,000 per 10 gram. In global markets, gold hit a a seven-week high when it rose 0.8% to $1,778.04 per ounce.
Story first published: Sunday, April 18, 2021, 15:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X