బంగారం ఈ వారం ఎలా ఉండవచ్చు? జోబిడెన్ గెలుపు.. అక్కడ భారీగా పెరిగిన పసిడి ధర
గతవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1000కి పైగా, వెండి రూ.4వేల వరకు పెరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జోబిడెన్ విజయం సాధించారు. గతవారం వరకు గోల్డ్ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఇప్పుడు స్పష్టత రావడంతో బంగారంపై ఈ ప్రభావం ఉంటుంది. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో చూస్తే పసిడి ధరలు గతవారం రూ.4,000 తక్కువతో ముగిశాయి.
దీపావళికి డబుల్ బొనాంజా, PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్?

ఈ వారం పసిడి ధరలు ఎలా ఉండవచ్చు
డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ఈ వారం రూ.52,875ను అధిగమిస్తే మరింత వేగంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ కిలో రూ.63,830 దిగువకు రాకుంటే గణనీయంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఎంసీఎక్స్‌లో గతవారం డిసెంబర్ ఫ్యూచర్ రూ.52,168 వద్ద ముగిసింది. చివరి సెషన్లో రూ.113(0.22 శాతం) పెరిగింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.52,318 వద్ద క్లోజ్ అయింది. క్రితం సెషన్లో రూ.125 (0.24 శాతం) పెరిగింది.
వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ కిలో గతవారం రూ.65,355 వద్ద ముగిసింది. చివరి సెషన్లో రూ.1,102 (1.72 శాతం) పెరిగింది. మార్చి ఫ్యూచర్స్ రూ.1,148 (1.74 శాతం) పెరిగింది. గతవారం రూ.67,103 వద్ద ముగిసింది.

జోబిడెన్ గెలుపు.. పెరిగిన బంగారం ధర
ఆసియా మార్కెట్లో సోమవారం ప్రారంభ సెషన్లలో పసిడి ధరలు పెరిగాయి. బలహీనమైన డాలర్, జోబిడెన్ గెలుపు నేపథ్యంలో భారీ ఉద్దీపన ప్యాకేజీ అంచనాలతో పసిడిపై ఒత్తిడి పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ పెరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు వరకు ప్యాకేజీపై సంధిగ్దత కారణంగా అటు ఈక్విటీ, ఇటు బులియన్ మార్కెట్లు ఆచితూచి వ్యవహరించాయి. భారీ ప్యాకేజీకి బిడెన్ సానుకూలంగా ఉంటారు. డాలర్ వ్యాల్యూ బలహీనపడటం కూడా బంగారంపై ఒత్తిడి పెంచింది.

బంగారం ధర జంప్
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు నేడు భారీగా పెరిగాయి. ఔన్స్ డిసెంబర్ ఫ్యూచర్స్ 0.27 శాతం పెరిగి 1956 డాలర్లను దాటింది. క్రితం సెషన్లో 1951 డాలర్ల వద్ద ముగిసింది. నేడు ప్రారంభంలోనే దాదాపు 5 డాలర్లు ఎగిసింది. బంగారం ధర ఏడాదిలో 31 శాతం పెరిగింది. నేడు 1,954.15 - 1,961.05 డాలర్ల మధ్య పలికింది. వెండి ధర కూడా 0.95 శాతం పెరిగి 26 డాలర్ల సమీపానికి చేరుకుంది. 25.777 - 26.130 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 25.662 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో 51 శాతం పెరిగింది.