FASTag: ఇది గుర్తుకు ఉందా, ఫిబ్రవరి 15 నుండి తప్పనిసరి
న్యూఢిల్లీ: ఇది గుర్తుకు ఉందా? ఫిబ్రవరి 15వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. వాస్తవానికి ఫాస్టాగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సింది. కరోనా కారణంగా ఆలస్యమైంది. ఈ ఏడాది ప్రారంభం నుండి ఫాస్టాగ్ అమల్లోకి రావాల్సి ఉండగా, ఫిబ్రవరి 15వ తేదీకి పొడిగించారు. దీనిని పలుమార్లు పొడిగించారు. మరో 5 రోజుల్లో ఇది అమల్లోకి రానుంది. ఈ నెల 15 నుంచి వాహనదారులు తప్పనిసరిగా ఫాస్టాగ్ ద్వారా టోల్ ఫీజు కట్టాలని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఇదివరకే ఓ ప్రకటనలో తెలిపింది.
ఫాస్టాగ్‌కు సంబంధించి మరిన్ని కథనాలు

ఫాస్టాగ్ ఇలా తీసుకోవచ్చు
FASTagsను పలు బ్యాంకులు అందిస్తున్నారు. HDFC బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ICICI బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, పేటీఎం పేమెంట్ బ్యాంకు, IDFC ఫస్ట్ బ్యాంకు ఇలా ఎన్నో దీనిని జారీ చేస్తున్నాయి. 27 బ్యాంకులతో ఫాస్టాగ్ జారీకి భాగస్వామ్యం కుదిరింది. దేశవ్యాప్తంగా 30వేల కేంద్రాల్లో ఫాస్టాగ్ అమ్మకాలు అందుబాటులో ఉన్నాయి. జాతీయ రహదారుల టోల్ ప్లాజాల వద్ద తప్పనిసరిగా లభించేలా ఏర్పాట్లు చేశారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి ఈ-కామర్స్ సంస్థల్లో అందుబాటులో ఉన్నాయి. భారత్ పే పేమెంట్స్ సిస్టం, యూపీఐ, ఆన్లైన్ చెల్లింపులు, మై ఫాస్టాగ్ మొబైల్ యాప్, పేటీఎం, గూగుల్ పే తదితర పోర్టల్స్ ద్వారా రీఛార్జి చేసుకోవచ్చు. టోల్‌ప్లాజాల వద్ద పాయింట్ ఆఫ్ సేల్స్ వద్ద రీఛార్జ్ సౌకర్యం ఉంది.

720 టోల్ ప్లాజాల వద్ద
ప్రస్తుతం టోల్ గేట్ల వద్ద నగదు చెల్లింపు కోసం ఒక లైన్ కేటాయించారు. ఫిబ్రవరి 15 నుండి ఈ అవకాశం ఉండదు. డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి.
భారత్ మొత్తంలోని 720 టోల్ ప్లాజా వద్ద కూడా FASTags పేమెంట్ ఆప్షన్ అందుబాటులో ైోఫిబ్రవరి 15వ తేదీ నుండి బైక్స్ లేదా ద్విచక్ర వాహనాలు మినహా అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి. ఫాస్టాగ్ 2017లో అమల్లోకి వచ్చింది. అయితే ఫాస్టాగ్‌తో పాటు నగదు చెల్లింపులకు అవకాశం కల్పించింది కేంద్రం. 2017 డిసెంబర్ నుండి కొత్తగా రోడ్డెక్కే ప్రతి వాహనానికి తప్పనిసరి చేసింది. ఈ మేరకు మోటార్ వెహికిల్ నిబంధనల చట్టం 1989కి సవరణలు చేసింది. అంతకుముందు వాహనాలకు కూడా ఈ ఏడాది జనవరి 1 నుండి ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఆ తర్వాత ఫిబ్రవరి 15కు పొడిగించింది.

ధరలు ఇలా...
ఫాస్టాగ్ ధర ఒక్కో దగ్గర ఒక్కో రకంగా ఉంది. ఫాస్టాగ్ తీసుకోవాలనుకునేవారు ఛార్జీలతో పాటు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. ఉదాహరణకు ఏదైనా బ్యాంకులో తీసుకుంటే ట్యాగ్ ఫీజు కొంత, సెక్యూరిటీ డిపాజిట్ కొంత, కనీస బ్యాలెన్స్ అవసరం. మొత్తంగా రూ.500 వరకు అవసరం. స్వల్ప తేడాలతో అన్ని బ్యాంకుల్లోను ధరలు ఓకేలా ఉన్నాయచి. ఫాస్టాగ్ కాలపరిమితి అయిదేళ్లు.