శాలరీ మొత్తాన్ని వీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ప్రయోజనమా, మరేం చేయాలి?
ఉద్యోగి వేతనం నుండి ప్రావిడెంట్ ఫండ్‌కు యజమాని వాటా 12 శాతం, ఉద్యోగి వాటా 12 శాతం మొత్తం 24 శాతం కట్ అవుతుంది. దీంతో పాటు ఉద్యోగి వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF)ను కూడా ఎంచుకోవచ్చు. అంటే తన వాటా 12 శాతం మాత్రమే కాకుండా ప్రస్తుత, భవిష్యత్తు అవసరాన్ని బట్టి ఉద్యోగి సొంతగా ప్రావిడెంట్ ఫండ్‌కు మరింత కాంట్రిబ్యూట్ చేయవచ్చు. ఇలా చేసే మొత్తానికి సెక్షన్ 80సీ కింద డిడక్షన్ ఉంటుందా?
సుదీర్ఘ లాక్‌డౌన్‌తో కరోనా కంటే ఆకలి మరణాలు ఎక్కువ, భారీ ఆర్థిక నష్టం: నారాయణమూర్తి

ఇలాంటి సందర్భాల్లో VPFలో పెట్టుబడి
ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను బట్టి, అలాగే భార్యాభర్తలు ఇధ్దరు ఉద్యోగం చేస్తుంటే ఒకరి వేతనాన్ని సేవ్ చేసుకునేందుకు VPFను ఎంచుకోవడానికి మొగ్గు చూపుతారు. అలాగే డీఏ, ఇతర అలవెన్సులు కలిపి కనీస వేతనానికి రెండింతలు అంతకంటే ఎక్కువ తీసుకునే వారు కూడా ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా VPFలో బేసిక్ శాలరీని పెట్టుబడి పెట్టేవారు ఉంటారు. బేసిక్ శాలరీ మొత్తాన్ని లేదా 12 శాతానికి మించి వీపీఎప్లో ఇన్వెస్ట్ చేయడం మన నిర్ణయం. ఇలాంటి సందర్భాల్లో పెట్టుబడి, రాబడి, మెచ్యూరిటీ ఉపసంహరణలు, పన్నురహితం వంటి ప్రయోజనాలు ఉంటాయా?

వడ్డీ సహా ప్రయోజనాలు
VPFలో 12 శాతం కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం స్వచ్చంధం. సెక్షన్ 80సి కింద వీరు కూడా పన్ను మినహాయింపుకు అర్హులే. ఈపీఎఫ్ మాదిరిగానే EEE (ఎక్సెంప్షన్-ఎక్సెంప్షన్-ఎక్సెంప్షన్) వెసులుబాటు ఉంటుంది. రూ.1.5 లక్షల వరకు చేసే పెట్టుబడికి వడ్డీ చెల్లిస్తారు. ప్రతి ఏటా వడ్డీ రేట్లు సవరిస్తారు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు దీర్ఘకాలంలో వచ్చే మొత్తంలో కూడా తగ్గుతుంది. పన్ను మినహాయింపు పొందడానికి చాలామంది వీపీఎప్ ఆప్షన్ ఎంచుకుంటారు.

దీర్ఘకాలిక లక్ష్యాలు అయితే..
అయితే దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటే ఈక్విటీలలో ఇన్వెస్ట్ చేయడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. దీర్ఘకాలంలో రాబడి బాగుంటుందని చెబుతున్నారు. VPF కాంట్రిబ్యూషన్లో ఈపీఎఫ్లా లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఈక్విటీలలో పెట్టుబడి పెట్టే ముందు కూడా నిపుణుల సలహాలు తీసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉత్తమ మార్గంగా భావించవచ్చు.