Budget 2022: బడ్జెట్లో పన్ను మినహాయింపు నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ అలవెన్స్ వరకు...
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి వేతనజీవులకు పలు శుభవార్తలను వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేతనజీవులకు గరిష్ట మినహాయింపులు కల్పించడంపై కేంద్రం దృష్టి సారించిందని చెబుతున్నారు. దేశంలోని మొత్తం పన్ను చెల్లింపుదారుల్లో శాలరైడ్ ఉద్యోగుల వాటా ఎక్కువ. పన్ను వసూళ్లలో వారి సహకారం ఎంతో ఉంటుంది. శాలరైడ్‌కు ఆదాయపు పన్ను మినహాయింపులు ఉంటాయి. ఈ వెసులుబాటు ద్వారా ఉద్యోగి తమ పన్నులను గణనీయంగా తగ్గించుకోవచ్చు.

ప్రతి సంవత్సరంలాగే అంచనాలు
ప్రతి సంవత్సరం మాదిరిగి ఆ సంవత్సరం కూడా పన్ను చెల్లింపుదారులు లేదా శాలరైడ్ బడ్జెట్ పైన ఎన్నో అంచనాలను కలిగి ఉన్నారు. 2022 కీలక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది. కాబట్టి పన్ను చెల్లింపుదారులకు గరిష్ట సడలింపులు ఇవ్వడంపై కేంద్రం దృష్టి సారిస్తుందని శాలరైడ్ వర్గం భావిస్తోంది. ఈ బడ్జెట్లో పలు శుభవార్తలను అందిస్తారని భావిస్తున్నారు. ఈ సంవత్సరం బడ్జెట్ నుండి ఆశించే కొన్ని...

వర్క్ ఫ్రమ్ హోమ్ అలవెన్స్
ప్రస్తుతం సెక్షన్ 16 కింద స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.50,000గా ఉంది. దీనిని రూ.1 లక్షకు పెంచాలనే డిమాండ్లు ఉన్నాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఈ పెంపు అనివార్యమని అంటున్నారు. కాబట్టి స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు పెరుగుతుందని భావిస్తున్నారు.
కరోనా కారణంగా ప్రస్తుతం అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ కింద కరెంట్, ఇంటర్నెట్ ఛార్జీలు, రెంట్, ఫర్నీచర్ మొదలైన వాటిపై ప్రజల వ్యయం పెరిగింది. పలు కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం అలవెన్స్ అందిస్తున్నాయి. అలాంటి అలవెన్స్‌ను ఆదాయపు పన్ను నుండి మినహాయించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. యూనియన్ బడ్జెట్లో ఇది ఉంటుందని ఆశిస్తున్నారు.

క్లెయిమ్స్ పెరిగి...
కరోన్ క్లిష్ట పరిస్థితుల్లో లైఫ్ ఇన్సురెన్స్ క్లెయిమ్స్ పెరిగాయి. పన్ను చెల్లింపుదారులు దీనికి సంబంధించి కూడా మినహాయింపులు కోరుతున్నారు. కరోనా కారణంగా బీమాను 5 ఏళ్ల నుండి 10 ఏళ్ల పాటు పన్ను లేకుండా చేయాలనే డిమాండ్ ఉంది. రాబోయే బడ్జెట్లో మొత్తం 80సీ పరిమితిని పెంచవచ్చునని ప్రజలు భావిస్తున్నారు.
పన్ను చెల్లింపుదారులు కూడా బీమా/మెడిక్లెయిమ్ ప్రీమియంపై జీఎస్టీలో మినహాయింపును ఆశిస్తున్నారు. మీడియాలో వస్తున్న వార్తల మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాల ప్రకారం బడ్జెట్లో ఈ డిమాండుకు చోటు కల్పించవచ్చు.
వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కేటగిరీలో సెక్షన్ 87ఏ కింద ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాయితీని హిందూ అవిభక్త కుటుంబానికి కూడా అందుబాటులో ఉంచాలనే డిమాండ్ వినిపిస్తోంది.