బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్‌న్యూస్, వన్‌కార్డ్‌తో కలిసి కొత్త క్రెడిట్ కార్డు
బ్యాంక్ ఆఫ్ బరోడా(BoB) ఆధ్వర్యంలో మరో క్రెడిట్ కార్డు కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. BoB అనుబంధ సంస్థ బీవోబీ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్(BFSL) వన్ కార్డుతో కలిసి కో-బ్రాండెడ్ మొబైల్ ఫస్ట్ క్రెడిట్ కార్డు జారీ చేస్తామని తెలిపింది. ముఖ్యంగా యువత, టెక్ యూజర్లకు ఈ కార్డులు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. BoB క్రెడిట్ కార్డ్స్ జారీతో పాటు వాటి నిర్వహణ వ్యవహారాలను BFSL పర్యవేక్షిస్తోంది. అంతర్జాతీయంగా చెల్లుబాటు గల వన్ కార్డుతో కలిసి జారీ చేస్తోన్న ఈ క్రెడిట్ కార్డుతో బీవోబీ ఖాతాదారుల డిపాజిట్ చెల్లింపులు సులభతరమవుతాయి. మొబైల్ యాప్ ఆధారంగా వన్ కార్డు పని చేస్తుంది. కాబట్టి తమ ఖాతాదారులకు క్రెడిట్ కార్డుపై పూర్తి నియంత్రణ ఉండేలా చర్యలు చేపడుతోంది. ఖర్చు పైన రివార్డ్ పాయింట్స్, చెల్లింపులపై డిజిటల్ సౌకర్యాలు అందిస్తోంది.

ఆ కస్టమర్ల కోసం
BoB ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ యువత కోసం, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న కస్టమర్ల కోసం కో-బ్రాండెడ్ మొబైల్ ఫస్ట్ క్రెడిట్ కార్డ్స్‌ను ప్రారంభించేందుకు వన్ కార్డ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు బుధవారం తెలిపింది. అంతర్జాతీయంగా చెల్లుబాటు అయ్యే క్రెడిట్ కార్డ్స్ BFSLచే జారీ చేయబడుతుంది. వీసా సిగ్నేచర్ ప్లాట్ఫామ్లో వన్ కార్డ్ ద్వారా నిర్వహించబడుతుంది. వన్ కార్డు యూజర్లకు క్రెడిట్ కార్డ్ పైన పూర్తి నియంత్రణను అందిస్తుంది. ఖర్చులు, రివార్డ్స్, పరిమితులు, చెల్లింపులు మరెన్నో ఎండ్ టు ఎండ్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని అందిస్తోంది.

ట్రాన్సాఫార్మేషన్ జర్నీ
BFSL మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ శైలేంద్ర సింగ్ మాట్లాడుతూ కంపెనీ ప్రస్తుతం ట్రాన్సాఫార్మేషన్ జర్నీలో ఉందని, బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు అత్యుత్తమ క్రెడిట్ కార్డ్స్‌ను అందించడానికి టెక్నాలజీ, ప్రాసెస్సెస్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. తమ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో వన్ కార్డు భాగస్వామిగా ఉన్నందుకు ఆనందంగా ఉందని, మొబైల్ ఫస్ట్ వన్ కార్డ్ తమ ఆఫర్స్ పోర్ట్‌పోలియోను మరింత బలపరుస్తుందన్నారు.

కార్డ్ జారీ, నిర్వహణ కోసం
BoB కార్డ్స్ వ్యాపారాన్ని నిర్వహించడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా 1994లో BFSLను తీసుకు వచ్చింది. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్స్‌ను జారీ చేస్తోంది.. నిర్వహిస్తోంది. కరోనా మహమ్మారి కస్టమర్ల మనోభావాలలో తీవ్రమైన మార్పును తీసుకు వచ్చిందని, సులభమైన డిజిటల్ చెల్లింపుల పరిష్కారాల వైపు బలంగా మొగ్గు చూపుతోందని వన్ కార్డు సహ వ్యవస్థాపకులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అనురాగ్ సిన్హా అన్నారు.