For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.25 లక్షల లోన్ ఇస్తాం.. ఘనంగా పెళ్లి చేసుకోండి: అర్హత, బెనిఫిట్స్, దరఖాస్తు ఇలా...

|

వివాహం అంటే అంగరంగ వైభవంగా... ఆకాశమంత పందిరి వేసే ఇంటి పండుగ. జీవితంలో ఒకసారి మాత్రమే జరిగే పెళ్లిని ఎవరైనా కలకాలం గుర్తుంచుకునేలా చేసుకోవాలని ఎవరైనా అనుకుంటారు. కూతురు లేదా కొడుకు పెళ్లిని అందరూ మెచ్చుకునేలా చేయాలని ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది. అది జీవితమంతా గుర్తుగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పెళ్లి చేసి చూడు.. ఇళ్లు కట్టి చూడు అనే సామెత ఉంది. అంటే ఈ రెండింటికి చాలా ఖర్చు అవుతుందని అర్థం. ఇలాంటి పెళ్లిళ్లకు చేతిలో డబ్బులు లేకుంటే.. బజాజ్ ఫిన్ సర్వ్ అద్భుత ఆఫర్ ఇస్తోంది. పెళ్లి కోసం ఆన్ లైన్ ద్వారా పర్సనల్ లోన్ పొందవచ్చు. ఈ డబ్బు కేవలం24 గంటల్లో మీ అకౌంట్లోకి వస్తుంది.

తగ్గిన బంగారం, వెండి ధరలు, అప్పటి నుంచి రూ.2,000 తగ్గుదల

పెళ్లి కోసం రుణం

పెళ్లి కోసం రుణం

పెళ్లి చేసుకోవడానికి కూడా అప్పు ఇస్తామని బజాజ్ ఫిన్ సర్వ్ వినూత్న ఆఫర్ ఇస్తోంది. పెళ్లి ఖర్చుల కోసం రూ.25 లక్షల వరకు రుణం ఇచ్చే పథకాన్ని ప్రారంభించింది. పెళ్లి అంటేకార్డ్స్ కొట్టించడం మొదలు ఫంక్షన్ హాలు, బంగారు ఆభరణాలు, భోజనాలు, వసతి.. ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి. వీటి కోసం బజాజ్ ఫిన్ సర్వ్ నుంచి పెళ్లి రుణం తీసుకోవచ్చు.

ఉద్యోగం.. వయస్సు

ఉద్యోగం.. వయస్సు

ఈ రుణం తీసుకోవడానికి కొలేటరల్ సెక్యూరిటీ ఇవ్వవలసిన అవసరం లేదని బజాజ్ ఫిన్ సర్వ్ తెలిపింది. 60 ఈఎంఐలలో తిరిగి చెల్లించవచ్చునని పేర్కొంది. అయితే ఈ పెళ్లి రుణం కావాలంటే 23 ఏళ్ల నుంచి 58 ఏళ్ల వయస్సు ఉండాలి. మంచి ఉద్యోగం ఉండాలి.

ఇన్‌స్టాంట్ అప్రూవల్

ఇన్‌స్టాంట్ అప్రూవల్

వివాహ రుణాలు ఇన్‌స్టాంట్‌గా అప్రూవ్ అవుతాయి. డాక్యుమెంట్స్‌ను ధృవీకరించిన అనంతరం మీ రుణ దరఖాస్తును 3 నిమిషాల్లోనే ఆమోదించవచ్చు.

ఫ్లెక్సిబుల్ రీపేమెంట్

ఫ్లెక్సిబుల్ రీపేమెంట్

మీరు తీసుకున్న లోన్‌ను 12 నుంచి 60 నెలల కాలంలో మీకు సౌకర్యవంతమైన కాల పరిమితిలో చెల్లించవచ్చు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఎంచుకున్న కాల పరిమితిలో రుణ మొత్తం చెల్లించుకోవచ్చు.

హైవ్యాల్యూ లోన్

హైవ్యాల్యూ లోన్

పెళ్లి కోసం బజాజ్ ఫిన్ సర్వ్ పర్సనల్ లోన్‌ను రూ.25 లక్షల వరకు తీసుకోవచ్చు. వివాహం జరిగే ఇంటిలో కొద్ది రోజుల ముందు నుంచే పెళ్లి పనుల్లో మునిగి పోతారు. కాబట్టి ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఆఫర్స్ ఉంటాయి.

ఆన్‌లైన్ యాక్సెస్

ఆన్‌లైన్ యాక్సెస్

మీరు తీసుకున్న రుణ ప్రక్రియను ట్రాక్ చేయడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. మీరు రుణాలు తిరిగి చెల్లించే షెడ్యూల్, ఇతర రుణ వివరాలను ఆన్ లైన్ కస్టమర్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది 24x7 మీకు అందుబాటులో ఉంటుంది.

ఏ డాక్యుమెంట్స్ అవసరం?

ఏ డాక్యుమెంట్స్ అవసరం?

బజాజ్ ఫిన్ కార్ప్ పెళ్లి రుణం కోసం కింది డాక్యుమెంట్స్ అవసరం...

- ఆధార్ కార్డు/డ్రైవింగ్ లైసెన్స్/పాస్‌పోర్ట్

- పాన్ కార్డు

- మూడు నెలల బ్యాంకు స్టేట్‌మెంట్

పెళ్లి లోన్ కోసం అర్హతలు

పెళ్లి లోన్ కోసం అర్హతలు

బజాజ్ ఫిన్ కార్ప్ పెళ్లి రుణం కోసం కింది అర్హతలు అవసరం...

- ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి.

- శాలరైడ్ అయి ఉండాలి.

- వయస్సు 23 నుంచి 58 మధ్య ఉండాలి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

బజాజ్ ఫిన్ కార్ప్ రుణానికి ఇలా దరఖాస్తు చేసుకోండి...

- మీ పర్సనల్, ఫైనాన్షియల్, ఎంప్లాయిమెంట్ వివరాలతో సహా దరఖాస్తును నింపాలి.

- మీరు ఎంత కావాలనుకుంటున్నారో ఆ అమౌంట్ పేర్కొనాలి.

- మీరు ఎంత కాల పరిమితి కోరుకుంటున్నారో అది పేర్కొనాలి.

- అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయండి.

- వాటిని పరిశీలించిన మీదట మీ పెళ్లి లోన్ నిమిషాల్లో అప్రూవ్ చేస్తారు.

- డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం మీ బ్యాంకు అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అవుతాయి. 24 గంటల్లో ఈ మొత్తం క్రెడిట్ అవుతుంది.

రుణ మొత్తం మంజూరు ఇలా...

రుణ మొత్తం మంజూరు ఇలా...

- అర్హత ఆధారంగా రుణ మొత్తం ఉంటుంది.

- మీరు నివసిస్తున్న నగరంతో పాటు మీ వేతనం ఆధారంగా ఎంత రుణం మంజూరు చేయాలనేది నిర్ణయిస్తారు.

- అర్హతను బట్టి మంజురైన రుణంలో అవసరమైన మేరకే వాడుకునే వెసులుబాటు ఉంది.

English summary

Bajaj Finserv Marriage Loan: Features and benefits of loan

Weddings are special! Weddings are a grand affair! Weddings can be expensive! No doubt, that you would want this special day to be remarkable, hence, having funds to spend is of the utmost importance.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X