For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్తగా పెళ్లైందా: రూ.699తో బజాజ్ ఫిన్ అదిరిపోయే హనీమూన్ హాలీడే కవరేజ్

|

కొత్తగా పెళ్లయిందా? మీ మ్యారేజ్ డే లేదా ఇతర ఏదైనా సందర్భాన్ని పురస్కరించుకొని ఘనమైన హాలీడే వేడుకలు జరుపుకోవాలనుకుంటున్నారా? మీ భాగస్వామి (లైఫ్ పార్ట్‌నర్)తో కలిసి హనీమూన్‌కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే బజాజ్ ఫైనాన్స్ అద్భుత ఆఫర్‌తో ముందుకు వచ్చింది. మనం ఎంత ప్లాన్ చేసుకొని వెళ్లినా డబ్బులు సరిగా సరిపోకపోవడం లేదా డబ్బులు ఉంటే హోడల్ గదులు దొరకకపోవడం, కార్డు మిస్ కావడం వంటి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఎదురయ్యే ఆర్థిక నష్టాన్ని భరించేందుకు బజాజ్ ఫిన్ సర్వ్ హనీమూన్ హాలీడే ప్రొటక్షన్ పాలసీని తెచ్చింది.

రూ.699తో రూ.3 లక్షల పరిహారం

రూ.699తో రూ.3 లక్షల పరిహారం

రూ.699 ప్రీమియంకు రూ.3 లక్షల కవరేజీని పొందవచ్చు. పర్యటన సమయంలో అనుకోని ఘటనలు జరిగితే ఈ కవరేజీ ఉంటుంది. చివరి నిమిషంలో పర్యటన రద్దు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో లేదా బ్యాకేజీని కోల్పోతే లేదా అత్యవసరంగా ఆసుపత్రిలో చేరితే లేదా హనీమూన్ పర్యటనలో ఉన్నప్పుడు ఇళ్లలో దొంగతనం జరిగితే.. ఇలాంటి కారణాల వల్ల ఎదురయ్యే నష్టానికి ఈ ప్లాన్ కింద పరిహారం ఉంటుంది.

వీటికి మాత్రం బీమా వర్తించదు

వీటికి మాత్రం బీమా వర్తించదు

హనీమూన్‌కు వెళ్లిన జంటకు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఈ పాలసీ ద్వారా పరిష్కారం లభిస్తుంది. అయితే మద్యం మత్తులో పోగొట్టుకున్న విలువైన వస్తువులకు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు జరిగే ప్రమాదాలకు మాత్రం బీమా వర్తించదను గుర్తించాలి.

ఎన్నో ప్రయోజనాలు

ఎన్నో ప్రయోజనాలు

- వార్షిక ప్రీమియం రూ.699 కాగా, బీమా కవర్ రూ.3 లక్షల వరకు ఉంది.

- చేతిలో డబ్బులు లేనప్పుడు హోటల్ బిల్లులు, ట్యాక్సీ బిల్లులు, విమాన టిక్కెట్లు లాంటి వాటి చెల్లింపులకు అందించే రుణం భారత్‌లో రూ.50 వేలు. విదేశాల్లో రూ.1 లక్ష వరకు ఇస్తుంది. అంటే ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుంది.

- ట్రిప్ సందర్భంగా బ్యాడ్ వెదర్ కారణంగా ట్రిప్ ఆగిపోతే లేదా క్యాష్ లేదా కార్డ్స్ పోగొట్టుకోవడం ద్వారా ఇబ్బందులు ఎదురైతే ఎమర్జెన్సీ అడ్వాన్స్ తీసుకోవచ్చు.

టెంపరరీ స్మార్ట్ ఫోన్

టెంపరరీ స్మార్ట్ ఫోన్

- ప్రయాణంలో స్మార్ట్ ఫోన్‌ను కనుక పోగొట్టుకుంటే మీరు ఉన్నచోటుకు తాత్కాలిక స్మార్ట్ ఫోన్ వస్తుంది. 7 రోజుల పాటు ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది.

- ఈ వెసులుబాటు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ఉన్నాయి.

- ఈ సౌకర్యం పొందేందుకు ఇన్సూరర్‌కు కాల్ చేసి అడగాలి.

ఒక్క కాల్‌తో కార్డు బ్లాక్

ఒక్క కాల్‌తో కార్డు బ్లాక్

- పర్స్ పోతే ఒక్క ఫోన్ కాల్‌తో డెబిట్, క్రెడిట్ కార్డులను తాత్కాలికంగా నిలిపివేసుకోవచ్చు.

- టోల్ ఫ్రీ నెంబర్ 1800-419-4000కు కాల్ చేసి తమ మిస్ అయిన కార్డును బ్లాక్ చేసుకోవచ్చు.

- దీనికి వినియోగదారులకు సమయం లేదా స్థల పరిమితి లేదు.

ఉచితంగా పాన్ కార్డు

ఉచితంగా పాన్ కార్డు

- కస్టమర్ కనుక తమ పాన్ కార్డును కోల్పోతే కొత్త దానిని వెంటనే పొందవచ్చు. పేపర్ వర్క్, డాక్యుమెంటేషన్ ఉంటుంది. దీనికి ఎలాంటి ఛార్జ్ ఉండదు. ఏమీ చెల్లించకుండానే పాన్ కార్డ్ రీప్లేస్ చేస్తారు.

కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవర్

కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవర్

- హనీమూన్ సమయంలో గాయాలపాలైతే రూ.1.5 లక్షల కవరేజీ ఉంటుంది.

- ఆసుపత్రి పాలైతే, బ్యాకేజీ కోల్పోతే, ఇంట్లో దొంగదనం జరిగితే లేదా ట్రిప్ క్యాన్సిల్ అయితే రూ.3 లక్షల కవరేజీ ఉంటుంది.

ఇలాంటి సందర్భంలో బీమా కవర్ ఉండదు

ఇలాంటి సందర్భంలో బీమా కవర్ ఉండదు

- మద్యం మత్తులో ఉన్నప్పుడు వ్యాలెట్, ఫోన్ వంటి విలువైన వస్తువులు పోతే బీమా వర్తించదు.

- ట్రాఫిక్ ఉల్లంఘనలతో లేదా మీ నిర్లక్ష్యం వల్ల వాహనం డ్యామేజ్ అయితే బీమా వర్తించదు.

English summary

Bajaj Finserv is Offering Honeymoon Holiday Cover Starting at Rs 699

Bajaj Finance Ltd., the lending and investment arm of Bajaj Finserv is offering Honeymoon Holiday Cover, a specially tailored plan that ensures customers are protected in a range of eventualities during their trip.
Story first published: Tuesday, December 17, 2019, 11:56 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more