For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోల్డ్ బాండ్ స్కీమ్ వల్ల ప్రయోజనాలెన్నో, ఇన్వెస్ట్ చేయవచ్చా?

|

మీరు గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే మరింత అధిక రాబడులనిచ్చే అవకాశాలకు దూరమవుతున్నట్లే! మార్కెట్‌లో గోల్డ్ బాండ్స్ అందుబాటులో ఉన్నాయి. గోల్డ్ బాండ్స్ ధరల కదలికలను క్యాప్చర్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇచ్చినట్లే మీకు స్థిర వడ్డీని కూడా చెల్లిస్తాయి. సావరీన్ గోల్డ్ బాండ్ అనేది ఫిజికల్ గోల్డ్ కొనుగోలుకు అత్యుత్తమ ప్రత్యామ్నాయం. బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గోల్డ్ బాండ్స్ ఎందుకు కొనుగోలు చేయాలో చూద్దాం...!

ఏమిటీ సావరీన్ గోల్డ్ బాండ్

ఏమిటీ సావరీన్ గోల్డ్ బాండ్

సావరీన్ గోల్డ్ బాండ్ అంటే బంగారాన్ని గ్రాములలో డినామినేట్ చేస్తుంది. మీరు 1 గ్రాము గుణిజాలలో పొందవచ్చు. మీరు గోల్డ్ బాండ్ ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో కొనుగోలు చేయగల గరిష్ట బంగారం 4 కిలోలు. నామినేషన్ సౌకర్యం అందుబాటులో ఉంది. పెట్టుబడి సమయంలో నామినీ వివరాలను అప్ డేట్ చేయాలని గుర్తు పెట్టుకోవాలి. దీనిని తర్వాత కూడా చేయవచ్చు.

సావరీన్ గోల్డ్ బాండ్ పథకం యొక్క ప్రధాన ప్రయోజనం స్థిర వడ్డీ రేటు ఉంటుంది. గోల్డ్ బాండ్ వడ్డీ రేటు ప్రతి సంవత్సరం వడ్డీ రేటు 2.50 శాతం. ఇది బంగారం ధర రాబడి కంటే ఎక్కువ. వడ్డీ మొత్తం ప్రతి ఆరు నెలలకు ఓసారి లేదా నామమాత్రపు విలువపై సెమీ వార్షికంగా చెల్లిస్తారు.

ఎప్పుడు ప్రారంభం

ఎప్పుడు ప్రారంభం

బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారుకు కేంద్ర ప్రభుత్వం సావరీన్ గోల్డ్ బాండ్స్ అద్భుతమైన స్కీంగా చెబుతున్నారు. ఇది 2015 నవంబర్ 5న ఆర్బీఐ ద్వారా మొదటిసారి విడుదలైంది. దాదాపు 9,15,953 గ్రాముల బంగారానికి విలువైన బాండ్స్‌ను విక్రయించడం ద్వారా రూ.246 కోట్లు వసూలయ్యాయి. అప్పుడు గ్రాము అంటే ఒక యూనిట్ ధర రూ.2,684. ఆదరణ లభిస్తుండటంతో వరుసగా విడుదల చేస్తోంది. 2017-18లో ఏకంగా 14 విడతల్లో ఈ బాండ్స్‌ను జారీ చేసింది. తక్కువ డబ్బుతో బంగారంలో పెట్టుబడికి అవకాశం ుండటం, పెట్టిన పెట్టుబడిపై ప్రతి సంవత్సరం 2.5 శాతం వడ్డీ లెక్కన ఆరు నెలలకు ఒకసారి చెల్లించడం వంటి ప్రయోజనాలతో చాలామంది తమ పెట్టుబడుల్లో వైవిద్యం కోసం వీటిని ఎంచుకుంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పదో విడద బాండ్స్ ఇష్యూ ఈ నెల 4వ తేదీ వరకు జరిగింది. వీటికి యూనిట్ కనీస ధర రూ.5109గా ఆర్బీఐ నిర్ణయించింది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసే రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.50 తగ్గింపు లభిస్తుంది. గత ఏడాది జనవరిలో ఈ బాండ్ రూ.4786గా ఉంది.

75 శాతం రాబడి

75 శాతం రాబడి

గోల్డ్ బాండ్ కాలపరిమితి ఎనిమిదేళ్లు. అయిదేళ్ల తర్వాత ఎగ్జిట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. మీరు మెచ్యూరిటీకి ముందు నిష్క్రమించాలనుకుంటే మీరు ముందస్తుగా రిడెంప్షన్ చేయాలి. ఉదాహరణకు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులో ముందస్తుగా 30 రోజుల నోటీసు ఉంటుంది.

గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లు ఎప్పుడైనా స్టాక్ ఎక్స్చేంజీలో బాండ్స్‌ను విక్రయించే అవకాశముంది. బాండ్స్‌ను ఎక్స్చేంజ్ ప్లాట్‌ఫామ్‌లో విక్రయిస్తే వర్తించే మూలధన లాభాల పన్ను ఫిజికల్ గోల్డ్ పైన అదే రేటుతో చెల్లించబడుతుంది.

గోల్డ్ బాండ్స్ గత ఆరేళ్లలో 75 శాతం రాబడిని ఇచ్చాయి. 2015-16లో తొలి విడత బాండ్స్ వచ్చినప్పుడు రూ.2684. ఇప్పుడు ఎక్స్చేంజీలో రూ.4700 పలుకుతున్నాయి. నాలుగేళ్లలో రాబడి 60 శాతం వరకు వచ్చింది.

కొత్తగా జారీ చేస్తున్న బాండ్స్‌కు బదులు స్టాక్ ఎక్స్చేంజీల్లో వివిధ వ్యవధుల బాండ్స్‌ను పరిశీలించటి కొనుగోలు చేయడం ద్వారా మరింత తక్కువ ధరకే బాండ్స్‌ను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

English summary

Advantages of Gold bond scheme and should you invest?

All investors looking to buy gold should buy gold bonds. This is a great credit-risk free form of investment. There are no making charges or annual fees involved. Plus, it is taxed as physical gold and there are indexation benefits offered.
Story first published: Sunday, March 20, 2022, 10:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X