For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు రూ.1 కోటి ఇన్సురెన్స్ పొందడం అవసరమా?: ప్రీమియం కట్టని బెనిఫిట్స్!

|

కుటుంబాన్ని పోషించే ఓ వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే జీవిత బీమా ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తుంది. వారి భావి జీవితాన్ని సురక్షితం చేసేందుకు ఉపయోగపడుతుంది. ఇన్సురెన్స్ ఉండటం తప్పనిసరి అని చాలామంది భావిస్తారు. అయితే ఎంత మేర బీమా కవరేజ్ ఉండాలనేది చాలామందికి ప్రశ్నార్థకమే. పలు బీమా సంస్థలు రూ.1 కోటి రూపాయల బీమా కవర్ ప్రణాళికలను కస్టమర్ల దగ్గరకు తీసుకు వెళ్తున్నాయి. పేపర్ పైన ఇది చాలా పెద్దదిగా అనిపిస్తోంది. మన వల్ల కాదు అనిపిస్తుంది. కానీ దీర్ఘకాలంలో ఇది ఆచరణ యోగ్యమనేది ఆర్థిక నిపుణుల సూచన.

రూ.1 కోటి ఇన్సురెన్స్ సరిపోతుందా?

రూ.1 కోటి ఇన్సురెన్స్ సరిపోతుందా?

మీరు ఏదైనా నగరంలో నివసిస్తూ ఉంటే... మీపై కుటుంబ సభ్యులు లేదా ఇతరులు ఆధారపడి ఉంటే... మీ కుటుంబానికి మీరే ప్రధాన సంపాదనపరులు అయితే రూ.1 కోటి వరకు కూడా ఇన్సురెన్స్ అవసరమని చెప్పవచ్చు. మీకు ప్రత్యేకంగా హెల్త్ కవర్ లేకుంటే ఇది కూడా సరిపోదని చెప్పవచ్చు. కింది వాటిని పరిశీలించండి...

- నగరంలో ఉండే అధిక ఖర్చులు

- ద్రవ్యోల్భణం

- గృహ రుణం వంటి రుణ బాధ్యతలు

- విద్య సహా వివిధ ఖర్చులు పెరగడం

- మెడికల్ కేర్ ఖర్చులు పెరగడం

- పిల్లల పెళ్లిళ్ల ఖర్చులు పెరగడం

మీరు కుటుంబ బాధ్యతలు మోస్తున్నట్లయితే ఇవి ప్రాథమిక ఖర్చులు అని గుర్తించి ఉంటారు. ఒకవేళ మీది పెద్ద కుటుంబం అయితే వారి సౌకర్యాల కోసం రూ.1 కోటి సరిపోతుందా? అంటే మీ ఇన్సురెన్స్ కవర్ కోసం మీరు కొన్నింటిని పరిగణలోకి తీసుకోవాలి. అవేమిటో చూద్దాం...

ఇన్సురెన్స్

ఇన్సురెన్స్

మీరు లైఫ్ ఇన్సురెన్స్ ఏజెంట్ అయితే కనుక మీ వేతనం, ఇతర కారకాల ఆధారంగా కవర్ మొత్తం ఎంత ఉండాలనేది మీకు అవగాహన ఉంటుంది. అందుకు అనేక పద్ధతులు ఉన్నాయి. అలాగే, ప్రీమియం ప్రారంభానికి కూడా కొన్ని లెక్కలు ఉన్నాయి... ఇందులో వయస్సు, ఆదాయం, మీపై ఆధారపడి ఉండేవారు, రుణాలు వంటి అంశాలు ఉన్నాయి.

వయస్సు.. ప్రీమియం

వయస్సు.. ప్రీమియం

మీరు చిన్న వయస్సులోనే ప్రారంభిస్తే, ప్రీమియం బరువు కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. కాబట్టి ఆదాయ ఆర్జన ఆరంభంలోనే ఇన్సురెన్స్ తీసుకోవడం తెలివైన పని. రూ.1 కోటి ప్రీమియం కవర్ కోసం మీ యాన్యువల్ ప్రీమియం రూ.7,000 కంటే తక్కువ ఉండాలి.

మీ వేతనం... ఆధారపడినవారి ఆధారంగా...

మీ వేతనం... ఆధారపడినవారి ఆధారంగా...

మీరు మొదటి నుంచి బాగా సంపాదిస్తే మీ కుటుంబం జీవనశైలి నిర్దిష్ట శైలికి అలవాటు పడుతుంది. కాబట్టి పెద్ద లైఫ్ కవర్ అవసరం. ఆర్థికంగా బలపడేందుకు మీరు ఎంత ప్రీమియం చెల్లించగలరు లేదా ఇతర పెట్టుబడుల కోసం ఎంత కేటాయించగలరు అనేది మీ వేతనంపై ఆధారపడి ఉంటుంది. అలాగే, మీ పై ఎందరు ఆధారపడి ఉన్నారనే దానిపై కూడా ఆధారపడి ఇన్సురెన్స్ కవర్ తీసుకోవాలి.

ఇన్సురెన్స్ అండ

ఇన్సురెన్స్ అండ

మీకు హోమ్ లోన్, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇతర రెగ్యులర్ బాధ్యతలు ఉండవచ్చు. ప్రీమియం కోసం మీరు ఎంత కేటాయించవచ్చునో నిర్ణయించడానికి ఇవి కూడా అవసరం. హఠాత్తుగా ఇంటి పెద్ద మృతి చెందితే కుటుంబానికి ఇన్సురెన్స్ అతి పెద్ద అండ. డబ్బు పరంగా ఎక్కువ మొత్తంలో తొలుత అండగా ఉండేది బీమా. స్టాక్స్, బాండ్స్ వంటి వాటికి నామినీ అయినా వాటిని ఎన్‌క్యాష్ చేసుకోవడానికి సమయం పడుతుంది.

ఇన్సురెన్స్‌లో వివిధ రకాల ప్రయోజనాలు..

ఇన్సురెన్స్‌లో వివిధ రకాల ప్రయోజనాలు..

సాధ్యమైనంత వరకు అతి చౌక ప్రీమియంకు వెళ్లకపోవడం మంచిది. బీమా సంస్థ అందించే ప్రయోజనాలు చూసుకోవాలి. ఉదాహరణకు పాలసీదారు ప్రమాదం కారణంగా మృతి చెందితే పాలసీదారు కుటుంబానికి యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్స్ అదనపు ప్రయోజాలను అందిస్తుంది. ప్రమాదం జరిగి వైకల్యం ఏర్పడితే... పాలసీదారు సంపాదించే మార్గాన్ని కోల్పోతే... ప్రీమియం చెల్లింపు మినహాయింపు వంటి ప్రయోజనాలు ఉంటాయి.

English summary

Should You Get The Rs 1 Crore Life Insurance Cover?

Life insurance financial secures a family from the unfortunate demise of an earning member of the family. While the need to get one is not debated, the question of how much cover you should get is.
Story first published: Monday, October 14, 2019, 17:56 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more