For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPPB 5 రకాల సేవింగ్స్, కరెంట్ అకౌంట్స్ ఇవే: మినిమం బ్యాలెన్స్, వడ్డీ వివరాలు...

|

పోస్టాఫీస్‌లో ఐదు రకాల సేవింగ్స్, కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చని తెలుసా? ఇండియా పోస్ట్ దేశంలో 1.5 లక్షల పోస్టాఫీస్‌లు రన్ చేస్తోంది. ఇందులో 3 లక్షల మంది పోస్ట్‌మెన్ ఉన్నారు. ఇండియా పోస్ట్ వివిధ రకాల సేవలు అందిస్తోంది. పోస్టాఫీస్‌లో ఎన్నో రకాల స్మాల్ సేవింగ్స్ స్కీంలు ఉంటాయి. ఇందులో భాగంగా పోస్టాఫీస్ సేవింగ్ అకౌంట్ కూడా అందిస్తోంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ద్వారా సేవింగ్స్, కరెంట్ అకౌంట్ అందుబాటులో ఉంది. IPPB తపాలా శాఖకు అనుబంధంగా పని చేస్తోంది. IPPB ఖాతా, పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు మాత్రం భిన్నం.

పోస్టాఫీస్ సేవింగ్ అకౌంట్ మినిమం బ్యాలెస్ రూ.20

పోస్టాఫీస్ సేవింగ్ అకౌంట్ మినిమం బ్యాలెస్ రూ.20

పోస్టాఫీస్ సేవింగ్ అకౌంట్‌ను రూ.20తో ఓపెన్ చేయవచ్చు. ఖాతాదారు తన అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్ రూ.50 మెయింటెన్ చేయాలి. సేవింగ్స్ అకౌంట్‌కు ఖాతాలో కనీస మొత్తం రూ.500 ఉంటే చెక్ బుక్ ఇస్తారు. చెక్ బుక్ తీసుకున్నవారు తమ ఖాతాలో కనీస నగదును రూ.500గా మెయింటెన్ చేయాలి. అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు లేదా ఎప్పుడైనా మీరు నామినీని సూచించవచ్చు. ఈ అకౌంట్‌ను బదలీ చేసుకోవచ్చు. అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలంటే మూడేళ్లలో కనీసం ఒక ట్రాన్సాక్షన్ అయినా ఉండాలి. క్యాష్ వేయడం లేదా తీయడం ఉండాలి. క్యాష్ డిపాజిట్లు, విత్ డ్రాఅంతా ఎలక్ట్రానిక్ మోడ్‌లోనే ఉంటాయి. పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీంలో అకౌంట్ తెరిస్తే పలుచోట్ల ఏటీఎం సదుపాయం అందుబాటులో ఉంటుంది. సంవత్సరానికి 4 శాతం వడ్డీ ఇస్తారు.

ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB) మూడు రకాల సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్‌ను ఆఫర్ చేస్తోంది. రెగ్యులర్, డిజిటల్, బేసిక్ ఉంటాయి. ఇందులో ఒక దాంట్లో రూ.20 కనీస మొత్తం మెయింటెన్ చేయాలి. కానీ మిగతా వాట్లలో ఇలా మినిమం బ్యాలెన్స్ ఉండవలసిన నియమం లేదు. అంటే ఇవి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్.

పోస్టాఫీస్ 5 రకాల సేవింగ్స్, కరెంట్ ఖాతాలు

పోస్టాఫీస్ 5 రకాల సేవింగ్స్, కరెంట్ ఖాతాలు

1. పోస్టాఫీస్ సేవింగ్ అకౌంట్ - ఇందులో కనీసం రూ.20 మినిమం బ్యాలెన్స్. వడ్డీ ఏడాదికి 4 శాతం ఇస్తారు. గరిష్ట పరిమితి లేదు.

2. IPPB రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ - దీనికి మినిమం బ్యాలెన్స్ లేదు. అంటే సున్నాతో ఓపెన్ చేయవచ్చు. వడ్డీ ఏడాదికి 4 శాతం ఇస్తారు. ఈ అకౌంట్ ముగిసే నాటికి ఇందులో బ్యాలెన్స్ గరిష్టంగా రూ.1 లక్ష ఉండాలి.

3. IPPB డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ - - దీనికి మినిమం బ్యాలెన్స్ లేదు. అంటే సున్నాతో ఓపెన్ చేయవచ్చు. వడ్డీ ఏడాదికి 4 శాతం ఇస్తారు. ఈ అకౌంట్ ముగిసే నాటికి ఇందులో బ్యాలెన్స్ గరిష్టంగా రూ.1 లక్ష ఉండాలి.

4. IPPB బేసిక్ సేవింగ్స్ అకౌంట్ - - దీనికి మినిమం బ్యాలెన్స్ లేదు. అంటే సున్నాతో ఓపెన్ చేయవచ్చు. వడ్డీ ఏడాదికి 4 శాతం ఇస్తారు. ఈ అకౌంట్ ముగిసే నాటికి ఇందులో బ్యాలెన్స్ గరిష్టంగా రూ.1 లక్ష ఉండాలి.

5. IPPB కరెంట్ అకౌంట్ - - దీనికి మినిమం బ్యాలెన్స్ లేదు. అంటే సున్నాతో ఓపెన్ చేయవచ్చు. ఈ అకౌంట్ ముగిసే నాటికి ఇందులో బ్యాలెన్స్ గరిష్టంగా రూ.1 లక్ష ఉండాలి. అయితే కరెంట్ అకౌంట్‌లో మరో అంశం గుర్తుంచుకోవాలి. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ ఉండాలి. నెలలో ఓ రోజు బ్యాలెన్స్ రూ.1000గా ఉండాలి.

 పోస్టాఫీసుల్లో మరిన్ని సేవలు

పోస్టాఫీసుల్లో మరిన్ని సేవలు

పోస్టాఫీస్‌లో అయిదేళ్ల రికరింగ్ డిపాజిట్ అకౌంట్స్, పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్స్, పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీం అకౌంట్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీం, పదిహేనేళ్ల పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటివి ఎన్నో అందుబాటులో ఉన్నాయి.

English summary

IPPB 5 రకాల సేవింగ్స్, కరెంట్ అకౌంట్స్ ఇవే: మినిమం బ్యాలెన్స్, వడ్డీ వివరాలు... | Five types of savings, current accounts you can open in a Post Office

India Post Payments Bank, also operated under the Department of Posts, offers three types of savings bank accounts: regular, digital and basic.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X