For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు క్రెడిట్ కార్డు ఉందా?అయితే కొన్ని షాకింగ్ విషయాలు మీకోసం!

By Sabari
|

క్రెడిట్ కార్డులు వాడుతుంటారు. బిల్లులు కడుతుంటారు. కానీ స్టేట్‌మెంట్‌లో ఉండే ఛార్జీల గురించి చాలామందికి తెలియదు. అసలు ఆ ఛార్జీలేంటో తెలుసుకోండి.

క్రెడిట్ కార్డులు

క్రెడిట్ కార్డులు

ప్లాస్టిక్ కరెన్సీ వాడకం పెరిగిపోయింది. జేబులో డబ్బులు లేకపోయినా అవసరానికి ఆదుకునేందుకు క్రెడిట్ కార్డులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఒక్కసారి క్రెడిట్ కార్డులకు అలవాటు పడ్డారంటే అదో వ్యసనంలా మారుతుంది.

 వచ్చే సమస్యేమీ

వచ్చే సమస్యేమీ

క్రెడిట్ కార్డులు వాడి అప్పులపాలైనవాళ్లు చాలామందే ఉన్నారు. అయితే క్రెడిట్ కార్డుల్ని తెలివిగా వాడుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఆర్థిక క్రమశిక్షణ ఉన్నవారికి క్రెడిట్ కార్డులతో వచ్చే సమస్యేమీ ఉండదు. అయితే క్రెడిట్ కార్డుల విషయంలో కొన్ని ఛార్జీల గురించి అవగాహన ఉండటం మంచిది. అసలు ఆ ఛార్జీలేంటో తెలుసుకోండి

వార్షిక నిర్వహణ ఛార్జీ(యాన్యువల్ మెయింటనెన్స్ ఛార్జ్):

వార్షిక నిర్వహణ ఛార్జీ(యాన్యువల్ మెయింటనెన్స్ ఛార్జ్):

ఇది ఏడాదికోసారి వసూలు చేసే ఫీజ్. మీకు క్రెడిట్ కార్డు ఉచితంగా ఇస్తున్నారంటే ఛార్జీలు లేకుండా ఇస్తున్నారని కాదు. జాయినింగ్ ఫీజుతో పాటు వార్షిక ఫీజులంటాయి. అయితే మీ కార్డు వినియోగాన్ని బట్టి ఆ ఛార్జీలను మినహాయిస్తారు. బ్యాంకు సూచించిన దానికన్నా తక్కువ వాడితేమాత్రం ఛార్జీలు భరించాల్సిందే. యాన్యువల్ ఫీజులు రూ.200 నుంచి రూ.5000 వరకు ఉంటాయి.

మినిమమ్ అమౌంట్

మినిమమ్ అమౌంట్

క్రెడిట్ కార్డు బిల్లులో మీరు ఎంత చెల్లించాలో సూచిస్తారు. దాంతో పాటు మినిమమ్ అమౌంట్ అని కూడా ఉంటుంది. మినిమమ్ అమౌంట్ చెల్లిస్తే అసలు తర్వాత చెల్లించొచ్చని చాలామంది అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. మీరు మినిమమ్ అమౌంట్ చెల్లించినా సరే బిల్లు మొత్తంపై మళ్లీ వడ్డీ చెల్లించాల్సిందే. మినిమమ్ అమౌంట్ అనేది మీరు డిఫాల్ట్‌ అవకుండా తీసుకునే రుసుము. బిల్లుపైన 3-4 శాతం వడ్డీ వసూలు చేస్తుంది బ్యాంకు. అంటే వార్షికంగా 36-48 శాతం వడ్డీ అన్నమాట.

జీఎస్టీ:

జీఎస్టీ:

క్రెడిట్ కార్డు లావాదేవీలన్నీ జీఎస్టీ పరిధిలోకే వస్తాయి.

లేటు రుసుములు:

లేటు రుసుములు:

గడువులోగా బిల్లు చెల్లించకపోతే బ్యాంకులు 'లేటు రుసుము' పేరుతో అదనపు ఛార్జీలను వసూలు చేస్తాయి. డ్యూ డేట్ తర్వాత చేసే పేమెంట్లకు ఈ ఛార్జీలు వర్తిస్తాయి. దీనికి వడ్డీ రేట్లతో సంబంధం లేదు. వడ్డీ రేట్లతో పాటు ఆలస్య రుసుము చెల్లించాల్సిందే.

ఓవర్‌ డ్రాఫ్ట్ ఛార్జీలు:

ఓవర్‌ డ్రాఫ్ట్ ఛార్జీలు:

మీకు ఇచ్చిన క్రెడిట్ లిమిట్ కన్నా ఎక్కువ వాడారంటే ఓవర్ డ్రాఫ్ట్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు మీ ఔట్‌స్టాండింగ్ అమౌంట్‌ని బట్టి ఉంటాయి.

పెట్రోల్‌పై ఛార్జీలు:

పెట్రోల్‌పై ఛార్జీలు:

క్రెడిట్ కార్డులతో రైల్ టికెట్లు, పెట్రోల్ కొంటే అదనపు ఛార్జీలు ఉంటాయి. అయితే కొన్ని బ్యాంకులు ఈ ఛార్జీలను మళ్లీ వెనక్కి ఇచ్చేస్తాయి.

ఏటీఎం విత్‍డ్రా ఛార్జీలు:

ఏటీఎం విత్‍డ్రా ఛార్జీలు:

క్రెడిట్ కార్డులతో ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకునే అవకాశముంటుంది. అయితే ఎంతవరకు డ్రా చేసుకోవచ్చన్నది క్రెడిట్ లిమిట్‌పై ఆధారపడి ఉంటుంది. అలాగని క్రెడిట్ కార్డుతో ఏటీఎంలో డబ్బులు తీసుకుంటే పర్సుకు చిల్లు పడటం ఖాయం. మీ డ్రా చేసిన క్యాష్‌పై బ్యాంకులు 2.5 శాతం వరకు ఛార్జీలు వసూలు చేస్తాయి. అంతే కాదు మీరు డ్రా చేసిన డబ్బులకు ఆ తర్వాత వడ్డీ చెల్లించాలి. ఈ వడ్డీ రేట్లు ఏడాదికి 36-48 శాతం ఉంటాయి.

పర్సు ఖాళీనే

పర్సు ఖాళీనే

ఇవే కాదు ఇలా అనేక ఛార్జీలుంటాయి. వార్షిక ఫీజులు, ఫైనాన్స్ ఛార్జీలు,లేటు రుసుములు అని పేర్లు మాత్రమే వేరు. వీటిపై అవగాహన పెంచుకుంటేనే అదనపు భారం తగ్గించుకోవచ్చు. ఇవేమీ తెలియకుండా క్రెడిట్ కార్డు విచ్చలవిడిగా వాడేస్తే మాత్రం పర్సు ఖాళీనే.

Read more about: credit card
English summary

మీకు క్రెడిట్ కార్డు ఉందా?అయితే కొన్ని షాకింగ్ విషయాలు మీకోసం! | Unknown Facts of Credit Cards

Credit cards are used. Bills are tied up. But most people do not know about the fare in the statement. Find out that charge.
Story first published: Tuesday, August 28, 2018, 13:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X